Editorials

ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి – TNI తాజా వార్తలు

ఈడీకి రాహుల్ గాంధీ విజ్ఞప్తి  –  TNI  తాజా వార్తలు

*నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నలను మూడు రోజులపాటు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదుపరి దర్యాప్తును జూన్ 20కి వాయిదా వేయాలని కోరారు. మరోసారి ప్రశ్నించేందుకు శుక్రవారం హాజరుకావాలని ఆయనను ఈడీ అధికారులు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ గురువారం విజ్ఞప్తిలో తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, జూన్ 17 శుక్రవారంనాటి దర్యాప్తును జూన్ 20 సోమవారంనాటికి వాయిదా వేయాలని కోరారు. ఆయనను ఈడీ అధికారులు సోమ, మంగళ, బుధవారాల్లో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19తో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. ఆమెతోపాటు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీని సోమ మంగళ బుధవారాల్లో ఈడీ అధికారులు ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో షేర్‌హోల్డింగ్ విధానం గురించి ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి.

*అమలాపురం అల్లర్ల కేసులో నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసిన అల్లరిమూకలను పోలీసులు గుర్తిస్తున్నారు. వీడియో, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 143 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో అత్యధికులు జనసేన, టీడీపీకి చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తున్నది.

* అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వర‌స్వామివారు రాత్రి గజ వాహనంపై ద‌ర్శన‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవను నిర్వహించారు.హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉందని, రాజసానికి ప్రతీక మదగజమని వేద పండితులు తెలిపారు. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో , ఉత్సవాల్లో గజానిదే అగ్రస్థానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంక‌ణ‌బ‌ట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు.

*ఆంధ్రప్రభుత్వంలో ఐదుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కోనసీమ జిల్లాలో చెలరేగిన హింసను ముందస్తుగా గుర్తించకపోవడంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నా ఎస్పీ సుబ్బారెడ్డిని బదిలీ చేశారు. అతడిని మంగళగిరి ఆరో బెటాలియన్‌ కమాండెంట్‌గా నియమించారు. కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్‌కుమార్‌ రెడ్డిని, విజయవాడ శాంతి భద్రతల డీసీపీగా విశాల్ గున్ని, కృష్ణా జిల్లా ఎస్పీగా జాషువా, కర్నూలు ఎస్పీగా సిద్దార్ద్‌ కౌశల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

*విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో సమగ్రంగా నేర్చుకునేలా ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సిలబస్‌తోపాటు అదనంగా ఇంగ్లీష్‌ లెర్నింగ్‌ యాప్‌ రూపొందించామని తెలిపారు. బైజూస్ యాప్ కోసం సెప్టెంబర్‌లో విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని తెలిపారు. వీడియోకంటెంట్‌తో పిల్లలు నేర్చుకునేలా క్లాస్‌రూమ్‌లో టీవీలు ఏర్పాటు చేస్తామని, వచ్చే ఏడాది నుంచి బైజూస్‌ కంటెంట్‌తో పుస్తకాల ముద్రిస్తామని జగన్‌ ప్రకటించారు.

*రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి విడదల రజనీ అన్నారు. గురువారం జిల్లా సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ అంటే సీఎం జగన్‌ కు ప్రత్యేకమైన అభిమానమని చెప్పారు. ఎక్కడా జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయన్నారు. అభివృద్ధికి సంబంధించి సమావేశంలో చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు.

*నల్గొండ: జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ షాప్ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రానికి మున్సిపాల్టీ చెత్త వాహనంలో బియ్యం సరఫరా చేశారు. అపరిశుభ్రమైన చెత్త వాహనంలో చిన్న పిల్లలు తినే బియ్యం సరఫరా చేయడంపై మున్సిపల్ అధికారులను స్థానికులు నిలదీశారు.

* బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయం ప్రధాన రహదారిపై ప్రభుత్వ దిష్టిబొమ్మను యువ మోర్చా నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్మా ట్లాడుతూ… బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని పోరాటం చేస్తున్నారన్నారు. 6 వందల మంది విద్యార్థులు 12 డిమాండ్లతో పోరాటం చేస్తుంటే.. విద్యాశాఖ మంత్రి సిల్లీ సమస్యలంటూ ఎగతాళి చేశారని మండిపడ్డారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను చర్చల పేరుతో బెదిరింపులకు గురి చేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేనిపక్షంలో రేపటి నుంచి బాసరకు వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భానుప్రకాష్ స్పష్టం చేశారు.

*హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్‌లో కాంగ్రెస్నే తల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్డుపై యువజన కాంగ్రెస్ నేతలు బైక్‌కు నిప్పు పెట్టారు. బస్సులను అడ్డుకుని నిరసనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్ ఎక్కి నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలతో ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

*కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై ఈడీ (ED) వేధింపులకు నిరసనగా ఛల్ రాజ్‌భవన్‌కు కాంగ్రెస్పి లుపునిచ్చింది. ఈక్రమంలో ఖైరతాబాద్ సర్కిల్ వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రాజ్‌భవన్ వద్ద నిరసన తెలుపుతామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు స్పష్టం చేశారు. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీ బోసరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్ తదితరులు ఖైరతాబాద్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.. పీజేఆర్ విగ్రహం వద్ద కి చేరుకోనున్నారు.

*మాజీ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కన్నెర్ర చేశారు. ఒక్కసారిగా శివంగిలా మారిపోయారు. ఛలో రాజ్‌భవన్‌లో పోలీసులకు చుక్కలు చూపించారు. అరెస్టు చేసేందుకు యత్నించిన ఖాకీలను ఖబడ్దార్ అంటూ హడలెత్తించారు. మహిళా నేతలతో వచ్చిన రేణుకను పోలీసులు అడ్డగించారు. అరెస్టు చేసే క్రమంలో ఓ మహిళా పోలీస్ రేణుకను పట్టుకునేందుకు యత్నించారు. అంతే ఆమెపై కన్నెర్ర చేశారు. ‘తనను టచ్ చేస్తే ఖబడ్డార్’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని రేణుకా చౌదరి ఎస్ఐ కాలర్ పట్టుకున్నారు. నన్నే అరెస్టు చేస్తారా? అంటూ రచ్చ రచ్చ చేశారు. రేణుకా తీరుతో ఒకింత భయపడ్డారు.

*హైదరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా బదిలీలకు కమిషనర్ సీవీ ఆనంద్ శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా కమిషనరేట్ పరిధిలో 2,865 మంది పోలీసుల ట్రాన్స్‌ఫర్స్ జరిగాయి. ఇందులో కానిస్టేబుల్ 2006, హెడ్‌కానిస్టేబుల్‌ 640, ఏఎస్సైలు 219 మంది బదిలీ అయ్యారు. గత రెండేళ్ల క్రితమే బదిలీలుజరగాల్సిందని, కానీ కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బదిలీలను నిలిపి వేశారు.తాజాగా కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ బదిలీలకు ఉపక్రమించారు.5-7 ఏళ్లు లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ప్రతిఒక్కరి పై బదిలీ వేటు పడింది. ఈసందర్భంగా పలువురిని బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

* బాసర ఆర్జీయూకేటీ దగ్గర సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలు విద్యామంత్రికి సిల్లీగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులను నక్సల్స్‌తో పోల్చడం దుర్మార్గమన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాకే వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదని నారాయణ మండిపడ్డారు.

*ఎన్టీఆర్‌: జిల్లాలోని గడ్డమణుగు గ్రామంలో ఎమ్మార్వోను రైతులు అడ్డుకున్నారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో జి.కొండూరు తహసీల్దార్ ఇంతియాజ్ భాషా, గ్రామ వీఆర్వో బలవంతంగా దారి ఏర్పాటు చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకొన్న రైతులు అక్కడకు చేరుకుని తహసీల్దార్, వీఆర్వోలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అధికారులు తమపై దాడి చేసారని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ దాడి చేసిన వీడియోలు కోర్టుకు సమర్పిస్తామని రైతులు తెలిపారు.

*ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం చివరికి ఫలించిందని, ఆయనను అభినందిస్తున్నానని ఎంపీ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా.. గొప్ప పోస్ట్ కాకపోయినా స్టాంప్స్, స్టేషనరీ డిపార్ట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఆలస్యం అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఆలోచన వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇచ్చిన మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అర్హులా అని జగన్గ తంలో అన్నారని, మరి ఎన్నికల్లో జగన్ ఎన్ని హామీలు ఇచ్చారు.. ఎన్ని తప్పారో తెలుస్తోందని రఘురామ అన్నారు.

*ఏపీ హైకోర్టు లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష )కు ఊరట లభించింది. శిరీషకు సీఐడీ ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. టీడీపీ నేతకు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41 ఏ కింద సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓసారి సీఐడీ ప్రధాన కార్యాలయంలో గౌతు శిరీష విచారణకు హాజరయ్యారు. కాగా… ఈ నెల 20న మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను శిరీష హైకోర్ట్‌లో సవాల్‌ చేశారు. శిరీష తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. గతంలో విచారణకు వెళ్లిన సమయంలో కనీసం భోజనం కూడా పెట్టకుండా, ఫోన్‌ కూడా తీసుకొని ఇబ్బంది పెట్టారని పోసాని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీఐడీ నేటి వరకూ ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇవ్వలేదని తెలిపారు. మహిళల పట్ల ఇలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమని న్యాయవాది పేర్కొన్నారు. పోసాని వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నోటీసులపై స్టే ఇస్తూ కేసు విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.

* మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ సమావేశం రసాబాసాగా మారింది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎటువంటి సమాచారం లేకుండా అధికారులు శానిటరి ఇన్‌స్పెక్టర్లను ట్రాన్స్‌ఫర్ చేశారని కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో 52 వార్డులు ఉండగా.. పాణ్యం 16, కోడుమూరు 3, కర్నూలు 33 వార్డులు ఉండగా 25 మంది వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. పాణ్యంకు సంబంధించిన వార్డులకే ప్రాధాన్యత ఇస్తున్నారని కర్నూలు కార్పొరేటర్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని సమావేశానికి కొందరు కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారని సమాచారం.

*కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని నిరసిస్తూ నేడు కూడా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే గవర్నర్ బంగ్లా ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ బంగ్లా ముట్టడి ప్రకటనతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డా.శైలజానాథ్‌ను కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*ఆదోని మండలం, మంత్రికి గ్రామంలో వైసీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎద్దుల ఊరేగింపులో ఇరు వర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆదోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంత్రికి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

*యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో బుధవారం స్వామి, అమ్మవార్లకు శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు నిర్వహించారు. స్వయంభూ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి కల్యాణం జరిపించారు. దేవేరులను గజవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ముస్తాబు చేసి ప్రధానాలయ ప్రాకారంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతు నిర్వహించారు. మొదటగా స్వామివారికి సుదర్శన నారసింహహోమం జరిపారు. వేకువ జామున 3.30 గంటలకు స్వామివారి నిత్యపూజలు ప్రారంభమయ్యాయి.

* సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్‌ ఇచ్చింది. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం డీజీగా ఆయన్ను నియమించింది. మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో నిఘా విభాగ అధిపతిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం వచ్చాక సస్పెండ్‌ చేసింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయన అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలు మోపింది. అయితే కొనుగోళ్లే జరపకుండా అవినీతి ఎలా జరిగిందో చెప్పాలంటూ న్యాయ పోరాటం చేసిన ఏబీవీకి హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ ఊరట లభించింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అవినీతి నిరూపించలేక పోయింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తనపై సస్పెన్షన్‌ ఎత్తి వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏబీవీ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు పోస్టింగ్‌ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

*‘‘వైసీపీ కోసం మా కుటుంబం పనిచేసింది. అయినా మా ఆడబిడ్డకు అంగన్‌వాడీ పోస్టు ఇవ్వకుండా డబ్బులకు అమ్ముకున్నారు’’ అని ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వద్ద ఓ మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శింగనమల మండలం సలకంచెరువులో బుధవారం గడపగడపకు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యేని జ్యోతి అనే మహిళ నిలదీశారు. తమ కుటుంబం వైసీపీ కోసం పనిచేసిందని, తన ఆడబిడ్డకు అంగన్‌వాడీ పోస్టు ఇవ్వకుండా పార్టీ నాయకులు డబ్బులు తీసుకుని, మరో పార్టీకి చెందిన మహిళకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు సమాధానం చెప్పలేక.. ఎమ్మెల్యే పద్మావతి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు.

*టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతనెల 8న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ ఇన్‌చార్జి ఈవోతోపాటు ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానాల మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోటీసులు జారీ చేసింది.

* విద్యా దీవెన, విద్య వసతి పథకాల్లో భాగంగా నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లుగానే, ఇకపై ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయాలని సీఎం జగన్‌రెడ్డి నిర్ణయించడం విస్మయాన్ని కలిగిస్తోందని వైసీపీ ఎంపీ రఘురామరాజు అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఈ విధానం అమలయితే ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేేస అవకాశమే ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటికే విద్యా వ్యవస్థను నాశనం చేశారని, ఇప్పుడు వైద్యాన్ని కూడా నాశనం చేయబోతున్నారని మండిపడ్డారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గుజరాత్‌తో పోల్చడాన్ని వివరణాత్మకంగా తప్పుపట్టారు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు మాతృ భాషలో విద్యాబోధన తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని గౌరవించకపోవడాన్ని ప్రశ్నించారు. జీవో నంబరు 117కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. జూలైలో భీమవరంలో జరగనున్న అల్లూరి స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని నిష్క్రమించిన వెంటనే శాంతిభద్రతల నెపంతో తనను అరెస్టు చేేసందుకు సీఎం ఆదేశాలతో పోలీసులు కుట్ర చేస్తున్నట్లుగా సమాచారం ఉందని..తనకు ఎలాంటి భద్రత కల్పిస్తారన్నదానిపై డీజీపీకి లేఖ రాశానని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

*టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐడీఈఎస్‌ అధికారి ఏవీ ధర్మారెడ్డికి టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతనెల 8న ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ ఇన్‌చార్జి ఈవోతోపాటు ప్రతివాదులుగా ఉన్న కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి, దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తిరుమల తిరుపతి దేవస్థానాల మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేష్‌ బుధవారం ఆదేశాలిచ్చారు.

* ఉన్నత విద్యామండలి చైౖర్మన్‌గా ఆచార్య కొణిరెడ్డి హేమచంద్రారెడ్డిని పునర్నియమించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో ఈయన్ను మొదటిసారి నియమించారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. ఇప్పుడు మళ్లీ ఆయన్ను రెండోసారి కూడా అదే పదవిలో నియమిస్తూ ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరో మూడేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో జేఎన్‌టీయూ అనంతపురంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా, రిజిస్ర్టార్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. పులివెందులలోని జేఎన్‌టీయూ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రిన్సిపాల్‌గా కూడా కొంతకాలం పనిచేశారు.

*లంచం తీసుకున్నారనే అభియోగంపై విజయవాడలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) పున్నమల్లి బాపూజీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. తాను ఏర్పాటుచేసుకున్న సంస్థకు లేబర్‌ లైసెన్స్‌ జారీచేయాలని కోరుతూ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం బాపూజీ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేననడంతో రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు విశాఖలోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు పథకం ప్రకారం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో మాటు వేసి బాధితుడు నుంచి బాపూజీ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

*ఇంటర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లకు 2021 అక్టోబరులోనే బదిలీలు జరిగాయి. తక్కువ కాలమే అయినందున మళ్లీ ఇప్పుడు బదిలీలు చేపట్టాల్సిన అవసరం లేదు’ అని ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది.

*ప్రధాని మోదీ వచ్చే నెల 4న గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించనున్నారు. 2019 ఎన్నికలకు ముందు లాంఛనంగా ప్రారంభించిన ఎయిమ్స్‌లో ఐపీడీ(ఇన్‌ పేషెంట్‌ డిపార్టుమెంట్‌) బ్లాకును ప్రారంభిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శోభా కరంద్లాజే కూడా హజరవుతారని సమాచారం.

*హిల్‌ టాప్‌ సెజ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌(అపాచి) పరిశ్రమకు ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో 298 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. తద్వారా రూ.700 కోట్ల పెట్టుబడులు, 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో పరిశ్రమ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

*గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు భూములు లీజుకివ్వడం ద్వారా రైతులకు ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయని, 66వేల ఎకరాలు వీటికి అవసరమని చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు 30వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీడు భూములను ఈ ప్రాజెక్టుల కోసం తీసుకుంటామని, ఎకరాకు రూ.30 వేలు కౌలు వచ్చేలా విధానం తీసుకువస్తున్నామని తెలిపారు.

*రైతు భరోసా కేంద్రాల సిబ్బందిని అడ్డుపెట్టుకొని అర్హులైన అన్నదాతలకు పంట నష్ట పరిహారం అందించకుండా జగన్‌ ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిని ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల పరిహారం సొమ్మును కూడా వైసీపీ నాయకులు దోచుకోవడం దారుణం. ఈ ఏడాది మిర్చి సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికోసం విడుదలైన రూ.2,907 కోట్లు నిజమైన రైతులకు అందలేదు. వైసీపీ నూతనంగా సృష్టించిన ఆర్‌బీకేల కనుసన్నల్లో పరిహారం సొమ్ము మాయం అయింది. పరిహారం సొమ్ము అందుకున్న వారిలో అత్యధికులు వైసీపీ సానుభూతిపరులే.

*రూ.25 వేలు లంచం తీసుకున్నారనే అభియోగంపై విజయవాడలోని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) పున్నమల్లి బాపూజీని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. లేబర్‌ లైసెన్స్‌ జారీచేయాలని కోరుతూ అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అందుకోసం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ బాపూజీ రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేనని వేడుకోవడంతో చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదిరింది. కానీ లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు విశాఖలోని సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు పథకం ప్రకారం అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయంలో మాటు వేసి బాధితుడు నుంచి బాపూజీ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాపూజీపై కేసు నమోదుచేసి రిమాండ్‌ నిమిత్తం బుధవారం విశాఖలోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచినట్టు అధికారులు పేర్కొన్నారు

*ద్యోగ కేలండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ జూన్‌ 17న రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, అన్నిపార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి నిరసనలకు పిలుపునిస్తున్నామని సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ సిద్దిక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

* ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రాష్ట్రంలో రైతులను మోసం చేయడానికి అబద్ధాల సేద్యం చేస్తున్నారని టీడీపీ విమర్శించింది. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ప్రకటనలకు కొంత విలువ ఉంటుందని, కాని పచ్చి అబద్ధాలతో పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందని ఆ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘మే 16న పత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనలో రైతు భరోసా కింద రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకు రూ.23,870 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జూన్‌ 15న అవే పత్రికల్లో మళ్లీ ఇదే అంశంపై ఇచ్చిన వాణిజ్య ప్రకటనల్లో 52.5 లక్షల మందికి సాయం చేసినట్లు ప్రకటించారు. డబ్బుల దగ్గర మాత్రం పాత సంఖ్యే వేశారు. ఒక నెల కూడా కాకుండానే లబ్ధ్దిదారులు రెండున్నర లక్షలు ఎలా పెరిగారు? లబ్ధిదారులు పెరిగినా రైతు బీమా కింద డబ్బు ఎందుకు పెరగలేదు? ఎంత పచ్చి అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారో ఇదే ఉదాహరణ’’ అని విమర్శించారు.

*‘‘టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎనిమిది లక్షల పక్కా ఇళ్లు నిర్మించిందని వైసీపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు అసెంబ్లీలో చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్లలో కేవలం 60 వేల ఇళ్లు మాత్రం నిర్మించింది. ఎనిమిది లక్షలు ఎక్కడ… 60 వేలు ఎక్కడ? ఇళ్ల నిర్మాణంపై మాట్లాడటానికి ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా ఇళ్లు నిర్మించలేకపోయామని మంత్రులు కుంటిసాకులు చెబుతున్నారని, ఇదే సమయంలో మిగిలిన రాష్ట్రాలు ఎలా నిర్మించాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు నిర్మించిన ఇళ్ల సంఖ్యను పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో తొలి విడత పక్కా ఇళ్ల నిర్మాణానికి 3 కోట్ల టన్నుల ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామంటూ ప్రభుత్వం వాణిజ్య ప్రకటనలు ఇచ్చింది. కాని ఐదున్నర లక్షల టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేశారని సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వమే చెప్పింది. చెప్పిన దానిలో కేవలం ఒకటిన్నర శాతం మాత్రమే ఇసుక ఇస్తే ఇళ్లు ఏం కడతారు? అనకాపల్లిలో ఒక శాతం, పల్నాడు జిల్లాలో రెండు శాతం, కడపలో మూడు శాతం, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో రెండు శాతం, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కేవలం మూడు శాతం ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇళ్ల నిర్మాణంపై డబ్బా కొట్టుకొనే మంత్రులు దీనికి సమాధానం చెప్పాలి’’ అని పట్టాభి డిమాండ్‌ చేశారు.

*నైరుతి రుతుపవనాలు దక్షిణ కోస్తాలో మచిలీపట్నం వరకు విస్తరించాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. మరోవైపు బిహార్‌ నుంచి దక్షిణ కోస్తా వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో బుధవారం కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. మేఘాలయలో వర్షాలు జోరందుకున్నాయి. చిరపుంజిలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు రికార్డు స్థాయిలో 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంత వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

*కాంగ్రెస్‌ తడఖా పార్టీ కార్యకర్తల బలమేంటన్నది చూపిద్దామని ఇక బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేద్దామని అందుకు సిద్ధం కావాలని యూత్‌ కాంగ్రెస్‌ ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తలు పార్టీ శ్రేణులకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.

*భారత్‌లో అక్టోబరు 11 నుంచి జరిగే ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మ్యాచ్‌లు ముంబై, భువనేశ్వర్‌, గోవాలో జరుగుతాయి. 21, 22 తేదీల్లో క్వార్టర్స్‌, 26న సెమీస్‌ గోవాలో, 30న ఫైనల్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో జరగనున్నాయి.

*కోచ్‌లు తమను వేధించారని ఇటీవల ఇద్దరు మహిళా అథ్లెట్లు ఆరోపించడంతో భారత క్రీడా ప్రాధికార సంస్థ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి స్వదేశంలో, విదేశాలలో కానీ మహిళా అథ్లెట్లు తలపడుతుంటే.. వారివెంట మహిళా కోచ్‌ ఉండాలని ఆదేశించింది.

*గౌరవెల్లి నిర్వాసితులపై లాఠీచార్జి ఘటనపై బీజేపీ బుధవారం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ)కు ఫిర్యాదు చేసింది. లాఠీ చార్జ్‌ చేసిన పోలీసులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, లీగల్‌ సెల్‌ నేత కరుణాసాగర్‌తో కూడిన బృందం కోరింది. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా రాంచందర్‌రావు తెలిపారు.

*గౌరవెల్లి భూ నిర్వాసితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం కరీంనగర్‌లోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిర్వాసితులను ఆయన రాష్ట్ర తాత్కాలిక కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. అంతకుముందు బాధితులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజల రక్తంతో ప్రభుత్వం రాక్షస పాలన చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలపై దాడులు చేయించి రక్త హస్తాలతో ఢిల్లీకి వెళ్తారా? అని ఆయన కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇంటిని చక్కబెట్టుకుని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని హితవు పలికారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గౌరవెల్లి భూ నిర్వాసితులపై గుండాలు, రౌడీలు, దోపిడీదారుల మాదిరిగా పోలీసులు, టీఆర్‌ఎస్‌ గూండాలు దాడులు చేశారన్నారు. ఎమ్మెల్యే చేయాల్సిన పని ఇదేనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని మండిపడ్డారు. నిర్వాసితులపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి నిర్మాణాలు చేపట్టాలని, మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇచ్చిన మాదిరిగానే గౌరవెల్లి నిర్వాసితులకూ న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

*కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ పీఆర్‌టీయూటీఎస్‌ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు తదితరులు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కేజీబీవీల్లో విధులు నిర్వహిస్తున్న, ప్రత్యేక అధికారులు, సీఆర్‌టీలు, పీజీసీఆర్‌టీలు, పీఈటీలు, బోధనేతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఉద్యోగులందరికీ కనీస వేతనాలను వర్తింపజేయాలని, ఫైనాన్షియల్‌, ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ సవరించాలని, కేజీబీవీల్లో కేర్‌ టేకర్లను నియమించాలని, ప్రత్యేక అధికారి పేరును ప్రిన్సిపాల్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులందరికి హైల్త్‌ కార్డులు మంజూరు చేయాలన్నారు. పీఈటీలకు సీఆర్‌టీలతో సమానంగా వేతనాలను ఇవ్వాలని, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, అకౌంటెంట్స్‌కు వేతనాలు సవరించాలని విన్నవించారు.

*గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ) చైర్మన్‌గా డాక్టర్‌ ముకేష్‌కుమార్‌ సిన్హాను నియమిస్తూ కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ఉత్తర్వులు జారీ చేసింది. సీడబ్ల్యూసీలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న ఆయనకు సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌(ఎ్‌సఏజీ) నుంచి హయ్యర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌(హెచ్‌ఏజీ)గా పదోన్నతి కల్పిస్తూ గోదావరిబోర్డులో నియమించారు. దాంతో సీడబ్ల్యూసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్‌ ఇంజనీర్‌గా ఉన్న ఎంకే సిన్హాను బుధవారం సాయంత్రం రిలీవ్‌ చేయడంతో ముకేశ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

*‘రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ పల్లెలను దేశానికే ఆదర్శంగా నిలిపాం. కరోనా గోసలోనూ సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్రాన్ని నడుపుతూ సీఎం కేసీఆర్‌ తండ్రి పాత్రలో నిలిచారు. త్వరలోనే అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ కొత్త ఆసరా పింఛన్లు, రేషన్‌ కార్డులను అందిస్తాం. ప్రభుత్వం ఇచ్చే ప్రతీ పైసాను ఊరి బాగుకోసం సద్వినియోగం చేసుకోవాలి. రాజకీయాలకు అతీతంగా సంక్షే మం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగాలి. ఊరు బాగైన తరువాత ప్రజలు మళ్లీ ఆ ఎమ్మెల్యేకు ఓటు వే స్తారు. అందులో నాకు మాత్రం భయం, రంది లేదు. పనిచేసేవారిని తప్పకుండా ఆశీర్వదిస్తారనే విశ్వాసం నాకుంది’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలో గ్రామ పంచాయతీ భవనాన్ని, కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని, చీకోడులో సీసీ కెమెరాలు, డిజిటల్‌ క్లాస్‌ రూంలు, గూడెంలో సింగిల్‌ విండో కమర్షియల్‌ కాం ప్లెక్స్‌ భవనాన్ని ప్రారంభించారు. సేవాలాల్‌ తండాలో జగదాంబ దేవి విగ్రహ ప్రతిష్ఠ, పోత్గల్‌లో రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమాలకు హాజరయ్యారు.

*టెట్‌ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసినట్లు టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తెలిపారు. ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్‌ పరీక్షకు సంబంధించిన ‘కీ’ http//tstet.cgggov.in లో చూడవచ్చన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 18లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. కాగా, ఎడ్‌సెట్‌-2022 పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నమోదు చేసేందుకు జూన్‌ 22 వరకు గడువు పొడించినట్లు ప్రొఫెసర్‌ రామకృష్ణ తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

* రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 395 కేసుల్లో 380 కేసులను కోర్టు కొట్టి వేసిందని, ఇది రాష్ట్ర పోలీసు శాఖ పనితీరుకు అద్దం పడుతుందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎ్‌ఫజీజీ) ఆరోపించింది. ప్రాసిక్యూషన్‌ సరైన ఆధారాలు చూపకపోవడం వల్లే.. 380 కేసులు మాఫీ అయ్యాయని విమర్శించింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన 395 కేసుల్లో విచారణను త్వరితగతిన జరిపేందుకు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 2న ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కోర్టు ఆయా కేసులను విచారించి, తీర్పులను వెలువరించిందని తెలిపారు. ఈ వివరాలన్నింటినీ సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా సేకరించామని పద్మనాభరెడ్డి వెల్లడించారు.

*ఆనకట్టల రక్షణకు తెచ్చిన డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌-2021పై గురువారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఈ భేటీ జరుగనుంది. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజత్‌కుమార్‌, ఈఎన్‌సీ (జనరల్‌) సి.మురళీధర్‌, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివా్‌సరావు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వి.రఘునాథ్‌ శర్మ హాజరుకానున్నారు. ఏపీ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. కాగా కృష్ణానదిలో మిగులు జలాలు, జలవిద్యుత్‌పై చర్చించడానికి గురువారం జరగాల్సిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ) భేటీ వాయిదా పడింది. తదుపరి సమావేశం ఈనెలాఖరులో జరుగనుంది.

* దేశవ్యాప్తంగా వచ్చేనెల 1 నుంచి 2023 జూన్‌ 30 వరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎ్‌సవో) రెండు అంశాలపై సమగ్ర వార్షిక మాడ్యులర్‌ సర్వే నిర్వహిస్తుందని ఎన్‌ఎ్‌సవో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డి.సతీశ్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సర్వేలో పాల్గొనే క్షేత్రస్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 500 గ్రామాల్లోని 16 వేల కుటుంబాల్లో కేంద్ర ప్రభుత్వం, 1,000 గ్రామాల్లోని 32 వేల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. మొదటి అంశంగా విద్యలో యువత భాగస్వామ్యం, మధ్యలో చదువు మానేసిన వారి నిష్పత్తి, ఉపాఽధి అవకాశాలు.. రెండో అంశంగా ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం(నేరురోపతి), యునాని, సిద్ధ, సోవారిగ్పా/అమ్చి, హోమియోపతిపై ప్రజల్లో అవగాహనపై సర్వే నిర్వహించనున్నట్టు చెప్పారు.

* దేశవ్యాప్తంగా వచ్చేనెల 1 నుంచి 2023 జూన్‌ 30 వరకు జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎ్‌సవో) రెండు అంశాలపై సమగ్ర వార్షిక మాడ్యులర్‌ సర్వే నిర్వహిస్తుందని ఎన్‌ఎ్‌సవో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డి.సతీశ్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో సర్వేలో పాల్గొనే క్షేత్రస్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 500 గ్రామాల్లోని 16 వేల కుటుంబాల్లో కేంద్ర ప్రభుత్వం, 1,000 గ్రామాల్లోని 32 వేల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్వహిస్తుందని తెలిపారు. మొదటి అంశంగా విద్యలో యువత భాగస్వామ్యం, మధ్యలో చదువు మానేసిన వారి నిష్పత్తి, ఉపాఽధి అవకాశాలు.. రెండో అంశంగా ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యం(నేరురోపతి), యునాని, సిద్ధ, సోవారిగ్పా/అమ్చి, హోమియోపతిపై ప్రజల్లో అవగాహనపై సర్వే నిర్వహించనున్నట్టు చెప్పారు.

*దక్షిణాఫ్రికాతో సిరీ్‌సలో నిలకడగా రాణిస్తున్న భారత ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ లో టాప్‌-10లోకి దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకుల జాబితాలో బ్యాటర్లలో ఇషాన్‌ 68 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌లో నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ 14, రోహిత్‌ శర్మ 16, శ్రేయాస్‌ అయ్యర్‌ 17, కోహ్లీ 21వ స్థానాల్లో నిలిచారు. బౌలర్లలో భువనేశ్వర్‌ 11వ, చాహల్‌ 26వ స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ బౌలర్ల జాబితాలో బుమ్రా మూడో ర్యాంక్‌కు ఎగబాకగా.. అశ్విన్‌ రెండులో కొనసాగుతున్నాడు. కమిన్స్‌ టాప్‌లో ఉన్నాడు. బ్యాటర్లలో రోహిత్‌, విరాట్‌ 8, 10వ ర్యాంక్‌ల్లో ఉండగా.. ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్లలో జడేజా, అశ్విన్‌ టాప్‌-2లో ఉన్నారు.

*ఫ్రాన్స్‌ లో పన్ను వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో… సుమారు 1.245 బిలియన్ యూరోల(1.29 బిలియన్ డాలర్లు) జరిమానా సహా మళ్ళీ పన్నులు చెల్లించేందుకు McDonalds అంగీకరించింది. US బర్గర్ చైన్ ఫ్రాన్స్‌లో వచ్చిన లాభాలను… తక్కువ పన్నులు చెల్లించడానికి లక్సెంబర్‌్aకు మళ్లించిందని 2014 లో ఈ ఆరోపణలు మొదటిసారిగా తెరమీదకొచ్చాయి. లక్సెంబర్గ్ అనుబంధ సంస్థకు పంపిన రాయల్టీలను అధికారులు పరిశీలిస్తున్నట్లు ఫ్రెంచ్ మీడియా అప్పట్లో నివేదించింది. విచారణలో భాగంగా McDonalds ఫ్రెంచ్ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారు. ఆ క్రమంలోనే… McDonalds చెల్లించాల్సిన పన్నులకు సంబంధించి అధికారులు విచారణ జరిపారు. కాగా… McDonalds కూడా ఈ విషయమై పోరాడుతూ వచ్చింది. ఇక అప్పటినుంచి ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది. చివరకు… 1.245 బిలియన్ యూరోలను చెల్లించేందుకు McDonalds అంగీకరించింది.

*బాసర ఆర్జీయూకేటీ దగ్గర సీపీఐ నేత నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువురాని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిని చేశారని దుయ్యబట్టారు. విద్యార్థుల సమస్యలు విద్యామంత్రికి సిల్లీగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థులను నక్సల్స్‌తో పోల్చడం దుర్మార్గమన్నారు. సమస్యను పరిష్కరించడం చేతగాకే వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా లేదని నారాయణ మండిపడ్డారు.