Movies

తెలుగుకే ప్రాధాన్యతనిస్తా!

తెలుగుకే ప్రాధాన్యతనిస్తా!

‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రం తెలుగులో తనకు మంచి గుర్తింపునిస్తుందని చెప్పింది కథానాయిక మెహర్‌ చాహల్‌. ఎం.ఎస్‌.రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా మెహర్‌ చాహల్‌ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నా స్వస్థలం అస్సాం. ముంబైలో స్థిరపడ్డాం. నిర్మాత ఎం.ఎస్‌.రాజుగారు ముంబయిలో ఓసారి నన్ను చూశారట. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఆడిషన్స్‌లో పాల్గొమని అడిగారు. ఆయన అనుకున్న కథకు నేను బాగా సరిపోతానని భావించి ఎంపిక చేశారు. ఇదొక యూత్‌ఫుల్‌ మూవీ. ఇందులో నేను రతికా అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. గోవాలోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తుంటా. సుమంత్‌ అశ్విన్‌ జోడీగా నటించాను. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకునే చిత్రమిది. ఈ సినిమాలో బోల్డ్‌ సన్నివేశాలేవీ ఉండవు. గోవా నేపథ్య కథాంశం కాబట్టి సముద్రతీరంలో స్విమ్‌సూట్‌లో కనిపిస్తా. భవిష్యత్తులో తెలుగు చిత్రాలకే ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నా. ప్రస్తుతం తెలుగు నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా’ అని చెప్పింది.