Devotional

తితిదే కళ్యాణమస్తు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

తితిదే కళ్యాణమస్తు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కళ్యాణమస్తుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న ఉదయం 8 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల15 నిమిషాల మధ్య సమయాన్ని వివాహ ముహూర్తంగా నిర్ణయించామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కళ్యాణమస్తుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7న ఉదయం 8 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల15 నిమిషాల మధ్య సమయాన్ని వివాహ ముహూర్తంగా నిర్ణయించామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల బేడి అంజనేయస్వామి ఆలయంలో ముహుర్త పత్రికకు ఉదయం పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఈవో వెల్లడించారు. పెళ్లి చేసుకోవాలనుకునే జంటలు జులై 21 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. తితిదే తరఫున దుస్తులు, పుస్తెలు అందిస్తామని చెప్పారు. కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించే కేంద్రాల్లో భోజన సదుపాయం ఉంటుందని అన్నారు. ఎవరైతే వివాహాలకు ఖర్చు భరించలేరో అలాంటి వారికి కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా జరిపిస్తున్నారని తెలియజేశారు.