Politics

జేసీ నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు

జేసీ నివాసంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కుటుంబ సభ్యులు మినహా ఇతరులను ఇంట్లోకి అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించారు. జేసీ నివాసంలో ఉన్న వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లనీయకుండా సోదాలు చేస్తున్నారు. వాహనాల కొనుగోలుతో పాటు ఇతర వ్యాపార లావాదేవీలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దృష్టి సారించారు. బీఎఫ్‌త్రీ వాహనాలను బీఎఫ్‌ఫోర్‌గా మార్చారంటూ గతంలో అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు సృష్టించారంటూ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డిపై కూడా నమోదు అయ్యింది. వాహనాల కొనుగోలుకు సంబంధించిన కేసు ఇప్పటికే విచారణ దశలో ఉంది. ఈ కేసు విచారణలో ఉండగానే జేసీ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది.