Movies

హద్దులు దాటను

హద్దులు దాటను

కుర్రకారుకు మతిపోగొట్టే ఫొటోషూట్లతో రెచ్చిపోయే బాలీవుడ్‌ భామల్లో అనన్యాపాండే ఒకరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ లాంటి ప్లాట్‌ ఫామ్‌ల ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటారు అనన్య. బికినీల్లో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటారు. అసభ్యకరంగా ఉండే దుస్తులు ధరిస్తున్నానంటూ తనపై వస్తున్న విమర్శలపై అనన్య స్పందించారు. సినిమాలు, ఫొటోషూట్లలోనే కాదు బయట కూడా తాను అలానే ఉంటానని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు అనన్య. సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా నాకు నచ్చినట్లే నా వస్త్రధారణ ఉంటుందన్నారు. అయితే ఆధునిక వస్త్రధారణ పేరుతో తానెప్పుడూ హద్దులు దాటలేదనీ, ఆత్మవిశ్వాసం పెంచే దుస్తులనే ధరిస్తానని అన్నారు. దీనిపై ఎవరు ఏమనుకున్నా ఇంటా బయటా అదే నా దారి అన్నట్లు స్పందించారు. ఇకపైనా నేను ఇలానే ఉంటాను అని ఖరాఖండిగా చెప్పారు.