Politics

కౌలురైతుల కుటుంబాలకు రేపు ఆర్థికసాయం – TNI రాజకీయ వార్తలు

కౌలురైతుల కుటుంబాలకు రేపు ఆర్థికసాయం – TNI రాజకీయ వార్తలు

* వైసీపీ పాలనలో 3 వేల మంది రైతుల ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వట్లేదన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ 80 మంది కౌలురైతుల కుటుంబాలకు రేపు పవన్ ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు.

*రైల్వే చట్టాలను కఠినతరం చేస్తాం : అశ్వినీవైష్ణవ్
అగ్నిపథ్ నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడంపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రాకపోకలకు అంతరాయం కల్గించడం సరికాదని అన్నారు.రైల్వే ఆస్తులకు నష్టం కల్గిస్తున్న నేపథ్యంలో వాటిని పరిరక్షించేలా సంబంధిత చట్టాలను కఠినతరం చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిరసనకారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు. రైల్వే మన సొంత ఆస్తి అని అర్థం చేసుకోవాలని సూచించారు. విమానాల్లో ప్రయాణించే స్థోమత లేని వారికి రైల్వేలు సేవలు అందిస్తున్నాయని వివరించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం, రైలు సేవలకు అంతరాయం కల్గించడం పరిష్కార మార్గం కాదని అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. నిరసనకారులు లేవనెత్తుతున్నఅన్ని అంశాలను కేంద్రం ఆలకించి పరిష్కరిస్తుందని తెలిపారు.సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై యువకులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం.. సికింద్రాబాద్‌లో ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైల్వేశాఖ వివిధ జోన్లలో ప్రయాణించే రైలు సర్వీసుల్లో మార్పులు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. కొన్నింటిని తాత్కాలికంగా నిలిపివేసింది. మరికొన్ని రైళ్లను మార్గం మళ్లించింది. ఇప్పటివరకు ప్రభావితమైన మొత్తం రైళ్ల సంఖ్య 340గా ఉందని అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా 200 రైళ్లను రద్దు చేశారుు..

*మోడీ స‌ర్కారు ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయింది: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి
ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింద‌ని, అన్ని రంగాల్లోను దేశాన్ని అధోగతి పాలుచేసిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమ‌ర్శించారు. నిర్మల్ మండలంలోని న్యూ పోచంపహాడ్ గ్రామంలో శ‌నివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువకులు క‌దం తొక్కారని, ఇది మరింత విస్త‌రించ‌క‌ముందే మోదీ మేలుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే రైతు ఉద్యమాలు, అగ్నిప‌థ్‌లాంటి ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఓవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామకాలు చేస్తున్న‌ద‌ని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి చెప్పారు. అదే స‌మ‌యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ భద్రతను ఫ‌ణంగా పెట్టి అగ్నిప‌థ్‌ లాంటి పథకం తెచ్చి సైన్యంలో దొడ్డిదారిన నియామకాల‌కు ప్ర‌య‌త్నిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉందని ఆరోపిస్తున్న బీజేపీ నాయ‌కులు.. బీహార్, హర్యానా, యూపీలో జరిగిన అల్లర్ల వెనుక ఎవ‌రున్నారో చెప్పాల‌ని ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వాలు కార‌ణ‌మా? అని ప్ర‌శ్నించారు. అభ్య‌ర్థులు సంయ‌మ‌నం పాటించాల‌ని, హింసకు తావు లేకుండా శాంతియుత పద్ధ‌తుల్లో నిరసనలు తెలియజేయాలని కోరారు.
*అగ్నిప‌థ్ నిర‌స‌న‌ల‌కు మోదీ సర్కారే బాధ్య‌త వ‌హించాలి : ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్
అగ్నిప‌థ్‌కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న నిర‌స‌న‌ల‌కు పూర్తి బాధ్య‌త మోదీ స‌ర్కారే వ‌హించాల‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో చేర‌డాన్ని యువ‌త దైవ‌కార్యంగా భావిస్తుంది. కానీ యువ‌తను మోదీ విస్మ‌రించ‌డం బాధ్యతరాహిత్య‌మ‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా మోదీ ఈ ప‌థ‌కాన్ని పున‌:స‌మీక్షించుకోవాల‌ని డిమాండ్ చేశారు. మోదీ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు రోడ్‌నపైకి వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు. మోదీ అదానీ సేవ‌లో త‌రిస్తూ.. దేశ ప్ర‌జ‌ల‌ను మ‌రిచిపోతున్నార‌ని విమ‌ర్శించారు.
*కాంగ్రెస్ నేతలను చూస్తే పోలీసులకు ఎందుకంత భయం?: సీతక్క
కాంగ్రెస్ నేతలను చూస్తే పోలీసులకు ఎందుకంత భయం? అని కాంగ్రెస్ నాయకురాలు సీతక్క ప్రశ్నించారు. రాకేష్ కుటుంబీకులను ఓదార్చేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? అని సీతక్క అన్నారు. యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలని సీతక్క డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌తో జవాన్‌లు సెక్యూరిటీ గార్డులుగా మారుతారని సీతక్క అన్నారు. కేంద్రం తక్షణమే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
*బండి సంజయ్‌ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు: మంత్రి Gangula
అగ్నిపథ్ అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ది మూర్ఖపు, దుర్మార్గపు మాటలు అని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… యువతను రెచ్చగొట్టకుండా బండి సంజయ్ ఆచితూచి మాట్లాడాలని హితవుపలికారు. అగ్నిపథ్ స్కీంను కేంద్రం పునరాలోచించాలని తెలిపారు. ఆందోళనలు జరిగిన రాష్ట్రాల మీద దుమ్మెత్తి పోయడం కరెక్ట్ కాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు జరిగాయని.. దానికి కూడా టీఆర్‌ఎస్ పార్టీ కారణమా అంటూ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు.
*అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే..: Somuveerraju
. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ధ్వంస రచన ఒక పధకం ప్రకారం జరిగిందనేది స్పష్టంగా కనపడుతోందన్నారు. అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే అని… విధ్వంసం వారి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. విదేశీ శక్తులు ఇక్కడ ఉన్న కొన్ని వర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసంగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయి అంటేనే అర్థం అవుతోందని అన్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్‌లలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని సోమువీర్రాజు అన్నారు.
*గడప గడపకూ కార్యక్రమంలో రెచ్చిపోయిన Vellampalli
గడపగడపకు మన ప్రభుత్వం ఈ కార్యక్రమంలో తాజా మాజీ మంత్రి వెల్లంపల్లికి ఎదురుదెబ్బ తగిలింది. గడప గడపకూ వెళ్లిన సమయంలో మీరు పదిహేను వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని.. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఓ ఇంజనీర్ వెల్లడించారు. దీంతో వెల్లంపల్లి రెచ్చిపోయారు. వెంటనే స్థానిక సీఐని పిలిపించి సదరు ఇంజినీర్‌ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాలు లేకుంటే కేసు పెట్టాలని హుకుం జారీ చేశారు. ఎవడో చెప్పింది విని మాట్లాడవద్దని వెల్లంపల్లి అనుచరులు సైతం ఇంజినీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్ మాటలకు కంగుతిన్న వెల్లంపల్లి అనుచరులు హంగామా సృష్టించారు. ఇంజినీర్ వ్యాఖ్యలతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పోలీసులు ఇంజనీర్‌ను ప్రశ్నిస్తున్నారు.

*ప్రజల ఆస్తులు ధ్వంసం చేసేవాళ్లు దేశరక్షణకు ఎందుకు పనికొస్తారు?: Vishnukuamr raju
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు తూట్లు పొడిచి, కేంద్రం మీద బురదజల్లే కార్యక్రమం చాలా మంది చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళు దేశ రక్షణకు ఎందుకు పనికి వస్తారని ప్రశ్నించారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని హింసవద్దన్నారు. అల్లర్లు అన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయని తెలిపారు. ‘‘గడప గడపకి ప్రభుత్వం అట్టర్ ప్లాప్.. బస్సు యాత్ర సూపర్ ఫ్లాప్.. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్లాప్’’ అంటూ యెద్దేవా చేశారు. మద్యం మీద విపరీతంగా దోచేస్తున్నారని బీజేపీ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు.

*వైసీపీ నేత విక్టర్‌బాబుపై ద‌ర్యాప్తు చేయాలి: లోకేష్
వైసీపీ నేత విక్టర్‌బాబుపై ద‌ర్యాప్తు చేయాలని ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల పేరుతో గిరిజ‌నుల‌ నుంచి వైసీపీ నేత ల‌క్షలు వ‌సూలు చేశారు. ఉద్యోగాలు రాక‌పోవ‌డంతో విక్టర్‌బాబును గిరిజ‌నులు నిల‌దీశారు. అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్టర్‌బాబు విలాసాలు చేసుకున్నారని లోకేష్‌ ఆరోపించారు. అనంత‌బాబు అండ‌తో ఏజెన్సీ ప్రాంతాల్లో విక్టర్‌బాబు అరాచ‌కాలు సృష్టించారని మండిపడ్డారు. బాధిత గిరిజ‌నుల‌కు న్యాయం చేసి.. వైసీపీ నేత విక్టర్‌బాబుపై ద‌ర్యాప్తు చేయాలని లోకేష్ డిమాండ్ చేస్తున్నారు.

*అహింసాయుతంగా నిరసనలు తెలపండి: Sonia gandhi
కేంద్ర కొత్తగా ప్రవేశపెట్టిన మిలటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ పై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో పౌరులంతా శాంతియుతంగా వ్యవహరించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. “మీ (ప్రజా) వాణిని పట్టించుకోకుండా ప్రభుత్వం పూర్తిగా దిశానిర్దేశం లేని కొత్త పథకాన్ని ప్రకటించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అహింసా పద్ధతిలో అందరూ శాంతియుతంగా నిరసనలు తెలపాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీతోనే ఉంటుంది” అని సోనియాగాంధీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
యువతతో పాటు, పలువురు మాజీ సైనికులు, రక్షణ నిపుణులు కూడా అగ్నిపథ్ పథకాన్ని ప్రశ్నిస్తున్నారని, యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని సోనియాగాంధీ అన్నారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ రిక్రూట్‌మెంట్ల విషయంలో మూడేళ్లుగా జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్ధం చేసుకోగలనని అన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో ప్రవేశానికి టెస్ట్‌లు రాసి ఫలితాలు, నియామకాల కోసం యువత ఎదురుచూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పూర్తి శక్తిసామర్థ్యాలతో యువతకు అండగా నిలుస్తుందని, వారి ప్రయోజనాల కోసం, స్కీమ్ ఉపసంహరణ కోసం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. లోయర్ రెస్పిరేటర్ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్, కోవిడ్ అనంతర సమస్యలతో ప్రస్తుతం ఢిల్లీలోని ఆసుపత్రిలో సోనియాగాంధీ చికిత్స పొందుతున్నారు.

*కాంగ్రెస్ నేతలను చూస్తే పోలీసులకు ఎందుకంత భయం?: సీతక్క
కాంగ్రెస్ నేతలను చూస్తే పోలీసులకు ఎందుకంత భయం? అని కాంగ్రెస్ నాయకురాలు సీతక్క ప్రశ్నించారు. రాకేష్ కుటుంబీకులను ఓదార్చేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? అని సీతక్క అన్నారు. యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలని సీతక్క డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌తో జవాన్‌లు సెక్యూరిటీ గార్డులుగా మారుతారని సీతక్క అన్నారు. కేంద్రం తక్షణమే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.
*అప్పులు తప్ప అభివృద్ధి ఏది?: బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నవరత్నాలలో ఎన్ని రత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రశ్నించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా జరగడం లేదన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలం అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం శ్రీశైలం క్షేత్రాన్నిఅభివృద్ధి చేయకపోగా.. భక్తులు ఇచ్చే కానుకలు, క్షేత్ర ఆదాయాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. గడపగడపకు కార్యక్రమం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.

*అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే..: Somuveerraju
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ధ్వంస రచన ఒక పధకం ప్రకారం జరిగిందనేది స్పష్టంగా కనపడుతోందన్నారు. అగ్నిపథ్ అనేది ఒక సాకు మాత్రమే అని… విధ్వంసం వారి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. విదేశీ శక్తులు ఇక్కడ ఉన్న కొన్ని వర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసంగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియా ద్వారా వస్తున్న ఆడియో పరిశీలిస్తే ఒక గంటలో మొత్తం ధ్వంసం చేయాలని ఆడియో ఆదేశాలు వచ్చాయి అంటేనే అర్థం అవుతోందని అన్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర రైల్వే స్టేషన్‌లలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. రైల్వే ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని సోమువీర్రాజు అన్నారు.
*ప్రధాని నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పాలి: Ramakrishna
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ(Ramakrishna) డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… విజయవాడలో యువజన, విద్యార్థి నేతలను నిన్నటి నుండి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. భారత సైన్యంలో కాంట్రాక్టు విధానాన్ని అమలు చేసే అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు దగ్గర నుండి నల్ల వ్యవసాయ చట్టాల వరకు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు తెరతీసిందని మండిపడ్డారు. అరెస్టు చేసిన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులను తక్షణం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
*ప్రజల ఆస్తులు ధ్వంసం చేసేవాళ్లు దేశరక్షణకు ఎందుకు పనికొస్తారు?: Vishnukuamr raju
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌కు తూట్లు పొడిచి, కేంద్రం మీద బురదజల్లే కార్యక్రమం చాలా మంది చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ప్రజల ఆస్తులు ధ్వంసం చేసే వాళ్ళు దేశ రక్షణకు ఎందుకు పనికి వస్తారని ప్రశ్నించారు. నిరసనలు శాంతియుతంగా చేయాలని హింసవద్దన్నారు. అల్లర్లు అన్నీ ప్లాన్ ప్రకారం జరిగాయని తెలిపారు. ‘‘గడప గడపకి ప్రభుత్వం అట్టర్ ప్లాప్.. బస్సు యాత్ర సూపర్ ఫ్లాప్.. ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్లాప్’’ అంటూ యెద్దేవా చేశారు. మద్యం మీద విపరీతంగా దోచేస్తున్నారని బీజేపీ నేత మండిపడ్డారు.మద్యంపైన జగన్ అండ్ కో దోచేస్తున్నారని ఆరోపించారు. మాటమీద నిలబడే వ్యక్తి జగన్ కాదని ప్రజలకు తెలిసిందన్నారు. ఎమ్మెల్సీ అనంత బాబును రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. విజన హామీలపై ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రంఫై కేంద్ర పెద్దలు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ‘‘జగన్ గారు మీ పాలనను సరి చూసుకోండి. లేదంటే సెలవు తీసుకోండి’’ అంటూ విష్ణుకుమార్ రాజు హితవుపలికారు.
*ఆందోళనలకు ప్రధానే బాధ్యుడు: నారాయణ
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి అల్లర్లకు పాల్పడడానికి దేశ ప్రధాని మోదీయే బాధ్యత వహించాలని సీపీఐ జాతీ య కార్యదర్శి నారాయణ అన్నారు. దేశ రక్షణ విభాగంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన నియామకాలు చేపడతామని ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. బిహార్‌, సికింద్రాబాద్‌ ఘటనల్లో మృతి చెందిన నిరుద్యోగులకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నారాయణ డిమాండ్‌ చేశారు.
*బీజేపీ 420 కంటే డబల్: సీపీఐ నారాయణ
ఎన్‌డీఏ ప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైనిక దళాల్లో ఖాళీల భర్తీ కోసం అగ్ని‌పథ్ పేరుతో కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఆర్మీలో కొత్తగా చేరిన యువతను నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం నుంచి తీసేస్తే వాళ్లు ఎలా బతుకుతారు? అని నారాయణ ప్రశ్నించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే ‘అగ్నిపథ్’ తీసుకువచ్చారని, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన యువకుడి కుటుంబానికి రూ. కోటి ఇచ్చి, అగ్నిపథ్‌ను తక్షణం రద్దు చేయాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు అంటూనే ప్రభుత్వ సంస్థలను మూసివేస్తుండడం బాధిస్తోందన్నారు. విపక్షాల నేతలను అరెస్టులు చేసేందుకు ఉపయోగపడే ఇంటలిజెన్స్, ఇప్పుడు ఎం చేస్తుందని ప్రశ్నంచారు. బీజేపీ తీరు పక్కా 420 కంటే డబల్ అన్న రీతిలో ఉందన్నారు.
*Jaganవి చావు తెలివితేటలు: చంద్రబాబు
ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్ధమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధరల పెంపులో జగన్‌ వి చావు తెలివితేటలని మండిపడ్డారు. ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్‌ నుంచి విముక్తి పొందండి.. ఆంధ్రాను రక్షించండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్ చేశాకే పోలీసుల టీఏ, డీఏకు నిధులు విడుదల చేశారని తెలిపారు. సారా వ్యాపారం చేసే బొత్స సత్యనారాయణకు విద్యాశాఖా కట్టబెట్టారని విమర్శించారు. అమ్మ ఒడి కాదు.. అర ఒడి కూడా దక్కలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఘటన దురదృష్టకరం: Pawan
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమైనవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంపై చేపట్టిన ఈ నిరసనల నేపథ్యంలో జరిగిన సంఘటనలు ఆవేదన కలిగించాయని తెలిపారు. పోలీసు కాల్పుల్లో మృతి చెందిన యువకుడి కుటుంబానికి జనసేనాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
*అధికారంలోకి రాగానే ‘బెల్ట్‌’ బంద్‌: షర్మిల
వైఎ్‌సఆర్‌టీపీ అధికారంలోకి వచ్చిన వెంట నే బెల్ట్‌ షాపులు బంద్‌ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ముదిగొండ మండలంలో ఆమె పర్యటించారు. ముదిగొండ మండలం మేడేపల్లిలో నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడారు. ఎనిమిదేళ్లలో 8 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలను పట్టించుకున్న వారేలేరని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. రాష్ట్రం కోసం త్యాగా లు ఒకరు చేస్తే, భోగాలు మరొకరు అనుభవిష్తున్నారని కేసీఆర్‌ కుటుంబంపై నిప్పులు చేరిగారు.
*సికింద్రాబాద్ దుర్ఘటన ఘటన వెనక ఈ మూడింటి కుట్ర: విజయశాంతి
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దుర‌దృష్ట‌క‌రమని, దీని వెనక టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. ఆమె తన ఫేస్‌బుక్‌లో ఇలా పోస్టు చేశారు. ‘‘తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ విధ్వంసాల పేరుతో రాజ‌కీయం చేస్తుంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన దుర‌దృష్ట‌క‌రం. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం లేదు. టీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డాయి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదు. ప్లాన్ ప్రకారమే జరిగింది. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది. ఆర్మీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదు. ప్రధాని మోదీ అలాంటి వ్యక్తి కాదు. కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు వినొద్దని బీజేపీ త‌రుపున విజ్ణ‌ప్తి చేస్తున్నా.. రాష్ట్రంలో శాంతిభద్రతాలు క్షీణించాయి. ప్రభుత్వమే విధ్వంసాలను పెంచి పోషిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామ‌నే లక్ష్యంతోనే కేసీఆర్ స‌ర్కార్ వ్యవహరిస్తుంది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. వాటి దృష్టి మరల్చేందుకే ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. కేసీఆర్ ఈ విధ్వంస రాజ‌కీయాలు చేయాలని చూస్తే ప్ర‌జ‌లు ఊరుకోరు. తెలంగాణ ప్ర‌జానీకమే నీ స‌ర్కార్‌ను బొంద పెట్టడం ఖాయం. ’’ అని విజయశాంతి పేర్కొన్నారు.
*అగ్నిప‌థ్ ను వెన‌క్కి తీసుకోవాలి:మంత్రి Indrakaran
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అనాలోచిత చ‌ర్య అని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.దేశ వ్యాప్త ఆందోళ‌న‌తోనైనా మోదీ ప్ర‌భుత్వం క‌ళ్ళు తెర‌వాల‌ని, ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.లేదంటే ప్ర‌జాగ్ర‌హానికి గురి కావాల్సి ఉంటుంద‌న్నారు.సికింద్ర‌బాద్ అల్ల‌ర్ల వెనుక టీఆర్ఎస్ ఉంద‌ని బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్యాల‌ను ఆయ‌న ఖండించారు.టీఆర్ఎస్ పాల‌న‌లో హింస‌కు తావులేద‌ని,హింస‌కు పాల్ప‌డ‌టం త‌మ నైజం కాద‌ని స్ప‌ష్టం చేశారు.
*ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?: బండి సంజయ్‌
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తుంటే వారిని ఉగ్రవాదులు మాదిరిగా ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అనడం దుర్మార్గమని అన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా?అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు.శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవిద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారు.
*వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు: పువ్వాడ
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ అరాచకాలను తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.షర్మిల చెప్పే సినిమా డైలాగ్‌లను ప్రజలు పట్టించుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల చేసిన విమర్శలకు మంత్రి స్పందించారు.షర్మిలకు దమ్ముంటే నాపై పోటీచేసి గెలవాలని పువ్వాడ సవాల్ విసిరారు.రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందన్నారు.వైఎస్‌ హయాంలో భూములెవరు కబ్జా చేశారో అందరికీ తెలుసునని, నేను ఉత్త పుణ్యానికి మంత్రి అయ్యాని పువ్వాడ పేర్కొన్నారు.మీ అన్న, నాన్నలా డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే టికెట్లు, మంత్రి పదవులివ్వడం కేసీఆర్‌కు తెలీదని అన్నారు.
*తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తెచ్చింది కేసీఆర్:Errabelli
తెలంగాణలో సాహిత్యానికి గుర్తింపు తీసుకు వచ్చింది సీఎం కేసీఆర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ కళల పట్ల మమకారంతో ఉన్నారని, కేసీఆర్ చొరవతో సాహిత్యానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు.ర‌వీంద్ర భార‌తిలో గోపాల్ రెడ్డి, సురేంద‌ర్ నిర్వ‌హిస్తున్న శిల్పకళా ప్రదర్శనను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారితో క‌లిసి మంత్రి ఎర్ర‌బెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కళలు,సాహిత్యానికి ఎంతో గుర్తింపు లభిస్తోందన్నారు.
*ప్రజారోగ్యానికి పెద్దపీట: మంత్రి Indrakaran reddy
ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పేదలకు మరింత దగ్గరగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు.దీంతో ఇక్కడి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు.బస్తీ దవాఖానాల్లో అవుట్ పేషెంట్ సేవలు అందించడం పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తారన్నారు.
*తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోంది: Bandi sanjay
రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్తున్న బండిని బిక్కనూర్ టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను సిల్లీ అని తీసేసిన సిల్లి సీఎం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ట్రిపుల్ ఐటీని మెయింటెన్ చేయని సీఎం మిగతా విద్యాసంస్థలను ఏం మెయింటెన్ చేస్తారని ఆయన నిలదీశారు.ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏమైనా ఉగ్రవాదులా.. టెర్రరిస్టులా అని అన్నారు. నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు భరోసా కల్పించేందుకే తాము ట్రిపుల్ ఐటికి వెళ్తున్నామని తెలిపారు. అక్కడ ఆందోళనలు, ధర్నాలు చేయడానికి మాకేమైన సీఎం మాదిరిగా పనిపాట లేదా అని అన్నారు. పోలీసుల నిర్బంధంతో అడ్డుకుంటున్నారని… బీజేపీని ఆపడం సీఎం తాతతరం కూడా కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు.