Movies

అలా అయితేనే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్?

అలా అయితేనే కొత్త ప్రాజెక్ట్స్‌కు సైన్?

పెళ్లి తర్వాత నయనతార కొత్తగా ఒకే చేసే ప్రాజెక్ట్స్‌కు కొన్ని కండీషన్స్ పెడుతునట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ను ఈ నెల 9న వివాహం చేసుకున్న నయనతార.. వివాహం తర్వాత సినిమాల్లో నటించేందుకు కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ఉన్న ఈ దంపతులు చెన్నై తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తమ పనుల్లో బిజీ కానున్నారు. నయనతార మాత్రం తనను సంప్రదించే దర్శకులకు కొన్ని నిబంధనలు విధించి వాటికి అంగీకరిస్తేనే కొత్త ప్రాజెక్టులకు కమిట్‌ అవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు తెలుస్తోంది.