Movies

చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు

చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు

‘ఇదొక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్టైనర్‌. హిందీలో ‘హౌస్‌ఫుల్‌’ తరహాలో ప్రేక్షకులను అలరిస్తుంది. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’ అని మెహర్‌ చాహల్‌ అన్నారు. ఆమె సుమంత్‌ అశ్విన్‌కు జోడీగా నటించిన చిత్రం ‘సెవెన్‌ డేస్‌ సిక్స్‌ నైట్స్‌’. ఎం.ఎస్‌. రాజు దర్శకుడు. జూన్‌ 24న విడుదలవుతున్న సందర్భంగా సినిమా గురించి మెహ ర్‌ చాహల్‌ మాట్లాడుతూ… ఇదొక ఫన్‌ ఫిల్మ్‌. టీనేజ్‌ యువత కథ ఇది. నా పాత్ర పేరు రతిక. గోవాలో రెస్టారెంట్‌లో పనిచేస్తుంటాను. సుమంత్‌ అశ్విన్‌కు జోడీగా కనిపిస్తా. కథానుసారం కొన్ని సన్నివేశాల్లో బోల్డ్‌గా కనిపిస్తానే తప్ప సినిమాలో ఎక్కడ అశ్లీలత లేదు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. ఇంతకు ముందు ఎం.ఎస్‌. రాజు గారు చేసిన సినిమాలు చూశాను. ఆయనతో సినిమా అనగానే చాలా ఎగ్జైట్‌ అయ్యా. వెంటనే ఓకే చెప్పాను. ‘సతి’ చిత్రంలోనూ సుమంత్‌ అశ్విన్‌ సరసన నటిస్తున్నాను. ఒక వెబ్‌సిరీస్‌ అంగీకరించాను.