DailyDose

ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!

ఈ యూట్యూబర్ల నెలవారీ సంపాదన తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది!

మీరెప్పుడైనా నిద్రపోతున్నా.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? కానీ వీళ్లు మాత్రం అలాగే అనుకున్నారు. అలా అని ఊహల్లో తేలిపోలేదు. రేయిం భవళ్లు శ్రమించారు. గంటల నిడివి గల వీడియోల్ని తీశారు. ఇష్టా ఇష్టాల్ని వదులుకున్నారు. మేం యూట్యూబర్లం అని చెబితే తేలిగ్గా తీసి పారేసిన వాళ్ల ముందు.. శ్రీ శ్రీ చెప్పినట్లు కన్నీళ్ళు కారుస్తూ కూర్చోలేదు. చెమట చుక్కని చిందించారు. మనదేశ యూట్యూబ్‌ చరిత్రలో నిలిచిపోయేలా ఎంతో మందికి రోల్‌ మోడల్‌గా నిలిచారు. ఇప్పుడు అలాంటి వారిలో ప్రముఖులైన దేశీయ యూట్యూబర్‌ల గురించి, వారి ఆదాయం గురించి తెలుసుకుందాం.
gaurav-chaudhary

గౌరవ్‌ చౌదరి
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 30 ఏళ్ల గౌరవ్‌ చౌదరి వరల్డ్‌ లార్జెస్ట్‌ యూట్యూబర్‌గా చెలామణి అవుతున్నాడు. దుబాయ్‌ బిట్స్‌ ఫిలానీ క్యాంపస్‌లో ఎంటెక్‌ (మైక్రో ఎలక్ట్రానిక్‌) చదివాడు. దుబాయ్‌లో ఉంటూ ఆ దేశ పోలీస్‌ విభాగంలో సేవలందిస్తున్నాడు. మరో పక్క ‘టెక్నికల్‌ గూరూజీ’ యూట్యూబ్‌ ఛానల్‌ పేరుతో టెక్నాలజీపై వీడియోలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్‌ ఛానెల్‌కు 22.1 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఫోర్బ్స్‌ ఇండియా అండర్‌-30 జాబితాలో గౌరవ్‌ చోటు సంపాదించుకున్న అతని నెలవారీ సంపాదన కోటి రూపాయిలకు పైగా ఉంటుంది. అతని ఆస్తుల విలువ అక్షరాల 50 మిలియన్‌ డాలర్లు . మన దేశ కరెన్సీలో (రూ.300కోట్లుకు పై మాటే)
Carry-Minat
క్యారీ మినాటీ
పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లు హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన 23ఏళ్ల క్యారీ మినాటీ రెండు ఛానెళ్లను నిర్వహిస్తున్నాడు. క్యారీ మినాటీ పేరుతో ఉన్న యూట్యూబ్‌ ఛానెల్‌లో అదిరిపోయే కామెడీ స్కిట్‌లు చేస్తుంటే..క్యారీస్‌ లైవ్‌ పేరుతో గేమింగ్‌ ఛానెల్‌ నడుపుతున్నాడు.10ఏళ్ల వయస్సు నుంచే యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయడం మొదలు పెట్టాడు. బాలీవుడ్‌ యాక్టర్‌ సన్నిడియోల్‌ను ఇమిటేట్‌ చేయడంలో దిట్ట. అందుకే చదువు మధ్యలోనే వదిలేశాడు. చదివింది 10వ తరగతే అయినా (ఇంటర్‌ ఎగ్జామ్స్‌ భయంతో మధ్యలోనే చదువు వదిలేశాడు) 2014 నుంచి వీడియోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అతని ఆదాయం నెలకు రూ.16లక్షలకు పై మాటే. ప్రస్తుతం క్యారీ మినాటీ యూట్యూబ్‌ ఛానెల్‌కు 35.9 మిలియన్ల మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. క్యారీస్‌లైవ్‌కు 11.1మిలియన్ల మంది సబ్‌ స్క్రైబర్లతో రాణిస్తున్నాడు. ఇక ప్రస్తుతం అతని ఆస్తుల విలువ అక్షరాల 3.5 మిలియన్లు. అంతే కాదండోయ్‌ ఏప్రిల్‌ 2020 ఫోర్బ్స్‌ అండర్‌ 30 జాబితాలో ఆసియా నుంచి క్యారీ చోటు దక్కించుకున్నాడు.
Bhuvan-Bam
భువన్ బామ్
భువన్ బామ్. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన 28 ఏళ్ల భువన్ బామ్ బీవీ కి వినీష్ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ను రన్‌ చేస్తున్నాడు. ఢిల్లీలో హిస్టరీలో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేశాడు. తనదైన స్టైల్లో కామెడీ పండిస్తూ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఓవైపు వీడియోలు చేస్తూనే మరోవైపు మింత్రాతో పాటు ఇతర సంస్థలకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా పనిచేస్తున్నాడు. బిజినెస్‌ కనెక్ట్‌ ఇండియా-2021 ప్రకారం..అతని ఆస్తుల విలువ అక్షరాల 3మిలియన్లు. భారత్‌ కరెన్సీలో రూ.25 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ సంపాదన రూ.కోటి పై మాటే.
Ashish-Chanchlani
ఆశిష్ చంచలాని
ఆశిష్ చంచలాని. ప్రముఖ సోషల్‌ మీడియా ఇన్ల్ఫుయన్సర్‌. నేవి ముంబై దత్తా మేఘే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాతో పాటు యూట్యూబ్‌ ఛానెల్‌ను సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ చేస్తున్నాడు. అశిష్‌ చంచలానికి వినిస్‌ పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్‌కు 28.3 మిలియన్‌ మంది సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు. నెలకు 115,000 డాలర్ల నుంచి 180,000 డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు.
Amit-Bhadana
అమిత్ భదానా
అమిత్ భదానా 27ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌. సౌత్‌ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్‌ నివాసి.ప్రస్తుతం అమిత్ ‘అమిత్ భదానా’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో ఎంటర్‌టైన్మెంట్‌ వీడియోస్‌ను అప్‌లోడ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అతని యూట్యూబ్‌ ఛానెల్‌కు 24 మిలియన్‌ల మంది సబ్‌ స్క్రైబర్లు ఉండగా..అలా అప్‌లోడ్‌ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్‌ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్‌, డిస్‌ప్లే అయ్యే యాడ్స్‌ కారణంగా ప్రతి వీడియోకి రూ.10 లక్షలు సంపాదిస్తాడని యూట్యూబ్‌ లెక్కలు చెబుతున్నాయి. ఇక అతని ఆస్తులు అక్షరాల రూ.44కోట్లు.