Politics

జాతీయ పార్టీల ఆదాయం 1,300 కోట్లు

జాతీయ పార్టీల ఆదాయం 1,300 కోట్లు

ఎన్నికల సంఘం గుర్తించిన దేశంలోని 8 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రె్‌సతో పాటు నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) ఆదాయం రూ.1,373 కోట్లు అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) తెలిపింది. 2020-21లో ఈ పార్టీల ఆదాయంగా దీనిని పేర్కొంది. కాగా, ఇందులో రూ.752 కోట్ల(54ు) ఆదాయంతో బీజేపీ టాప్‌లో ఉంది. కాంగ్రెస్‌ 285 కోట్లు(20ు) తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, 2019-20లో బీజేపీ ఆదాయం రూ.3,623 కోట్లు కాగా.. ఆ తర్వాతి ఏడాదికి ఏకంగా 79ు తగ్గింది. ఇక కాంగ్రెస్‌ ఆదా యం సైతం రూ.682 కోట్ల నుంచి 58ు తగ్గి.. రూ.285 కోట్లకు పరిమితమైం ది. ఇక బీజేపీ ఎన్నికలు, సాధారణ ప్రచారానికి రూ.421 కోట్లు, నిర్వహణ వ్యయానికి రూ.145 కోట్లు ఖర్చు చేసినట్లు ఏడీఆర్‌ వివరించింది. కాంగ్రెస్‌ వరుసగా 91 కోట్లు, 88 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపింది. ఎన్నికలకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అత్యధికంగా రూ.90 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొంది.