DailyDose

‘ గిరిజనుల్ని మోసం చేస్తోన్న.. విక్టర్బాబును అరెస్టు చేయాలి’ – TNI తాజా వార్తలు

‘ గిరిజనుల్ని మోసం చేస్తోన్న.. విక్టర్బాబును అరెస్టు చేయాలి’  –  TNI  తాజా వార్తలు

*గిరిజ‌నుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత‌బాబు అనుచ‌రుడైన దూడ విక్టర్‌బాబు దందాల‌పై.. ద‌ర్యాప్తు చేయాల‌ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్‌ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చెట్లవాడ గ్రామానికి చెందిన దూడ విక్టర్ బాబు.. అధికార పార్టీని అడ్డుపెట్టుకుని గిరిజ‌నుల్ని మోస‌గిస్తున్నార‌ని ట్విట్టర్‌లో ఆరోపించారు. పాఠశాలల్లో అటెండ‌ర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ..ఏడుగురు గిరిజ‌నుల వ‌ద్ద విక్టర్ బాబు ప‌ది ల‌క్షలు వ‌సూలు చేశారని నారా లోకేశ్ ఆరోపించారు.అమాయ‌క గిరిజ‌నుల్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మోసం చేస్తోన్న వైకాపా ఎమ్మెల్సీ అనంత‌బాబు అనుచ‌రుడు దూడ విక్టర్‌బాబు దందాల‌పై ద‌ర్యాప్తు చేయాల‌ని తెదేపా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దూడ విక్టర్ బాబు ఎమ్మెల్సీ అనంత‌బాబు కీల‌క అనుచ‌రుల్లో ఒక‌ర‌ని, అనంత‌బాబు, వైకాపా పేరు చెప్పుకుని గిరిజ‌నుల్ని మోస‌గిస్తున్నార‌ని ఆరోపించారు.

*అస్సాం, మేఘాల‌యాలో భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌రద‌లు బీభ‌త్సం సృష్టించాయి. గ‌త రెండు రోజుల నుంచి వ‌ర‌ద‌ల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మ‌ర‌ణించారు. అస్సాంలోని 28 జిల్లాల్లో దాదాపు 19 ల‌క్ష‌ల మంది ప్ర‌భావానికి గుర‌య్యారు. ల‌క్ష మంది రిలీఫ్ క్యాంపులో ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. అస్సాంలో 12 మృతిచెంద‌గా, మేఘాల‌యాలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌లాలో భారీ స్థాయిలో వ‌రద‌లు వ‌చ్చాయి. ఆ న‌గ‌రంలో సుమారు 6 గంట‌ల్లోనే 145 మిల్లీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం కురిసింది. దీంతో త్రిపుర ఉప ఎన్నిక ప్ర‌చారంపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. మేఘాల‌యాలోని చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వ‌ర్షం ప‌డింది. అగ‌ర్తలాలో 60 ఏళ్ల త‌ర్వాత మూడ‌వ అత్య‌ధిక వ‌ర్షం పాతం న‌మోదైంది. ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వ‌ల్ల స్కూళ్ల‌ను మూసివేశారు. వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన బాధిత కుటుంబాల‌కు మేఘాల‌యా సీఎం 4 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. అస్సాం వ‌ర‌ద‌ల్లో మూడు వేల గ్రామాలు మునిగాయి. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది. క‌ల్వ‌ర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.

*అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శ‌నివారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 9.15 నుంయి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, చక్రత్తాళ్వార్‌వారికి పుష్కరిణి ఎదురుగా వేడుకగా స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు.సాయంత్రం 6 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు న‌వ‌సంధి, మాడ‌వీధి ఉత్సవం నిర్వహిస్తామని, రాత్రి 7 నుంచి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వేదపండితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, ఏఈవో ప్రభాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్రధాన అర్చకులు,కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, భ‌క్తులు పాల్గొన్నారు.

*సికింద్రాబాద్ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… అగ్నిపథ్ ప్రకటన తర్వాత దేశం అగ్నిగుండంగా మారిందని తెలిపారు. నాలుగేళ్ల తర్వాత పరిస్థితేంటని యువకులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వానివి అనాలోచిత నిర్ణయాలని విమర్శించారు. దేశ యువకులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నాగేందర్ పేర్కొన్నారు.

*తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. ఈ నెల 19న ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రులకు ఓ ఆఫర్ ప్రకటించారు. ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల తల్లిదండ్రులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో ఐదేళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆర్టీసీలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణించవచ్చు. టికెట్ లేకుండా వారంతా ఆర్టీసీ ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

*గాంధీ ఆసుపత్రికి నిన్న 14 మంది క్షతగాత్రులు వచ్చారని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం ఐదుగురికి బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. వారిలో ఒకరు చనిపోయారని వెల్లడించారు. మిగతా నలుగురికి సర్జరీ జరిగిందన్నారు. ఒకరికి చెస్ట్ దగ్గర బుల్లెట్ గాయమవడంతో మేజర్ సర్జరీ జరిగిందన్నారు. మరొకరికి తొడ భాగంలో గాయమైతే సర్జరీ చేశామని రాజారావు తెలిపారు. మరొకరి కాలికి బుల్లెట్ గాయమవడంతో సర్జరీ జరిగిందన్నారు. చెస్ట్, తొడ వద్ద బుల్లెట్ గాయం అయినవారు కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. మిగతా 9 మందికి సాధారణ గాయాలయ్యాయన్నారు. రాళ్లు, కర్ర దెబ్బలు తగలడం, చర్మం లేవడం వంటి గాయాలయ్యాయన్నారు. 9 మందిని 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచామని.. ఆ తరవాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. కుటుంబ సభ్యులను ఒక్కొక్కరికి లోపలికి అనుమతి ఇస్తున్నామని రాజారావు తెలిపారు.

*‘అగ్నిపథ్’ ఆందోళనలకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్‌ స్కీమ్‌ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న రిక్రూట్‌మెంట్‌ విధానాన్ని కొనసాగించాలన్నారు. నిన్నటి ఘటనలకు టీఆర్ఎస్కా రణమైతే.. వారణాసి, కాన్పూర్‌లో ఘటనలకు కూడా టీఆర్ఎస్సే కారణమా? అని ప్రశ్నించారు. బీజేపీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యాడని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.

*సికింద్రాబాద్ అల్లర్లలో ప్రత్యక్షంగా రూ.12కోట్లు ఆస్తి నష్టం జరిగిందని సికింద్రాబాద్ రైల్వే డివిజినల్ మేనేజర్ గుప్తా తెలిపారు. రైళ్ల రద్దు నష్టంపై అంచనా వేస్తున్నామని తెలిపారు. రైళ్లలో తరలిస్తున్న ప్రయాణికుల సామగ్రి భారీగా ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపారు. 5 రైల్ ఇంజన్లు, 30 బోగీలు ధ్వంసమయ్యాయని గుప్తా వివరించారు. అయితే డీజిల్ ట్యాంకర్‌కు భారీ ప్రమాదం తప్పిందని, పవర్‌కార్‌కు మంటలంటుకుంటే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగేదన్నారు. ప్రస్తుతం అన్ని రైల్వే గూడ్స్‌ను పునరుద్ధరించామని ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గుప్తా తెలిపారు.

*వైసీపీ నేత దౌర్జన్యంతో న్యాయం కోసం దళిత టీచర్ కుటుంబం రోడ్డున పడింది. తమ ఇంటికి దారి లేకుండా వైసీపీ నేత గోడ కట్టించాడు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అందరు అధికారులకు కుటుంబసభ్యులు విన్నకుంచుకున్నా ఫలితం శూన్యంగా మారింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ముగ్గురు పిల్లలతో కలసి వీల్ చైర్‌లో టీచర్ సుధారాణి నడక ప్రారంభించారు. ప్రకాశం జిల్లా బొడ్డువానిపాలెం నుంచి తాడేపల్లి సీఎం ఆఫీస్ వరకు నడకగా వెళ్లనున్నారు.

* అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైల్వేస్టేషన్‌లకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం రైల్వేస్టేషన్‌లలో భారీగా పోలీసులు మోహరించారు. రైల్వేస్టేషన్ లోపలకి వెళ్లే అన్ని రహదారులను ముళ్ల కంచెతో మూసివేశారు. పలు రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒడిసాకి చెందిన ఓ పెళ్లి బృందం పార్వతీపురంలో చిక్కుకుంది.

*గుంతకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అంధకారం రాజ్యమేలుతోంది. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రోగులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్లాలని గర్భిణులకు ఆస్పత్రి సిబ్బంది సలహా ఇస్తున్నారు. 15 గంటలు కావస్తున్నా కరెంటును అధికారులు పునరుద్ధరించలేదు.
*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్‌లో టీబీ కౌంటర్ వరకూ భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 76,407 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 39,938 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.

*అధికార పార్టీ వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ వాహనాన్ని శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో తోపుడు బండి వ్యాపారి మల్లయ్య కుటుంబీకులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇదే వాహనం ఎమ్మెల్సీ ప్రయాణించే సమయంలో గతేడాది డిసెంబరు 31న లేపాక్షి బస్టాండు వద్ద కొండూరుకు చెందిన మల్లయ్యను ఢీకొంది. ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తాజాగా ఆయన కుటుంబం తమకు న్యాయం చేయలేదంటూ ఆరోపించింది. ప్రమాదంపై కేసు నమోదు చేశామని, బీమా సొమ్ము రావడం కాస్త ఆలస్యం అవుతుందని పోలీసులు తెలిపారు. కొందరు వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని, ఎమ్మెల్సీ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని కంచికచర్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలం వద్ద సీపీఎం నేత మధు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, సీపీఎం నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలో నిరసన చేస్తున్న సీపీఎం నాయకులను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి కంచికచర్ల రూరల్ కార్యలయానికి తరలించారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన సీపీఎం నాయకుడు మధు, పార్టీ నాయకులు అరెస్టు చేసి వీరులపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

*పుంగనూరులో ఉద్రిక్తత కొనసాగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ నిరుద్యోగుల ర్యాలీ చేశారు. పుంగనూరు ఆర్సీవై మెగా జాబ్మేళాకు అనుమతి లేదంటూ పోలీసుల అభ్యంతరం తెలిపారు. జాబ్ మేళా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జాబ్ మేళాకు వస్తున్న నిరుద్యోగులను అడ్డుకుని బస్సుల నుంచి అధికారులు దింపివేశారు. నిరుద్యోగులు కోర్టు ముందు ధర్నా నిర్వహించి… జడ్జికి వినతిపత్రం అందజేశారు. పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ తలపెట్టిన మెగా జాబ్‌ మేళాను పథకం ప్రకారం పోలీసులు శుక్రవారం రాత్రి భగ్నం చేశారు. పుంగనూరులో శనివారం ఆర్‌సీవై మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్రిశామికవేత్త రామచంద్రయాదవ్‌ కు పైగా పరిశ్రమల ప్రతినిధులను రప్పించి వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు. దీనికోసం రాయలసీమ వ్యాప్తంగా నిరుద్యోగ యువత నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మందికి పైగా అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నారు. మేళా నిర్వహణకు ప్రభుత్వ విద్యా సంస్థల మైదానాలు వినియోగించుకునేందుకు అనుమతులు దక్కలేదు. విద్యుత్‌ సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్నా అనుమతి రాలేదు. ఈ క్రమంలో తన సొంత స్థలంలో రామచంద్రయాదవ్‌ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.

*ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. వైసీపీ తరుపున రోజా ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. జనం కనిపించలేదు. రోడ్ షోలు వెలవెలబోయాయి. ప్రజలు లేకపోయినా రోజా ప్రసంగించారు. మరికొన్ని చోట్ల జనం లేకపోవడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.

*రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని సీపీ కాంతి రాణా టాటా అన్నారు. శనివారం ఉదయం రైల్వేస్టేషన్‌లో బధ్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ.. పోలీసులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆందోళనల్లో భాగంగా విజయవాడ‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్‌తో పాటు అదనపు బలగాలను మోహరింపజేశామన్నారు. రౌడీషీటర్స్‌తో పాటు అనుమానితులను ముందస్తు అరెస్ట్‌లు చేసినట్లు సీపీ చెప్పారు. యువత ఎవరూ హింసకు పాల్పడవద్దన్నారు.

* తాలూకాలోని దిబ్బూరహళ్ళిలో గురువారం రాత్రి భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్డుపైకి చేరారు. చిక్కబళ్ళాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకాలోని దిబ్బూ రహళ్ళి ప్రాంతంలో వర్షాల ప్రభావంతో భూగర్భజలాలు క్రమేపీ పెరుగుతుండడంతో వీటి ప్రభావమే శబ్ధం రూపంలో వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం గనులు భూవిజ్ఞానశాఖ అధికారులు గ్రామాన్ని పరిశీలించినట్టు తహసీల్దార్‌ బీఎస్‌ రాజీవ్‌ వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాక అర్ధరాత్రి గంటలకు తాలూకాలోని ద్యావరహళ్ళి అమ్మగారనహళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలలో పెద్దగా శబ్దాలు రావడాన్ని విన్నట్టు గ్రామస్తులు వెల్లడించారు.

*అధికార పార్టీ వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ వాహనాన్ని శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో తోపుడు బండి వ్యాపారి మల్లయ్య కుటుంబీకులు శుక్రవారం అడ్డుకున్నారు. ఇదే వాహనం ఎమ్మెల్సీ ప్రయాణించే సమయంలో గతేడాది డిసెంబరు 31న లేపాక్షి బస్టాండు వద్ద కొండూరుకు చెందిన మల్లయ్యను ఢీకొంది. ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో తాజాగా ఆయన కుటుంబం తమకు న్యాయం చేయలేదంటూ ఆరోపించింది. ప్రమాదంపై కేసు నమోదు చేశామని, బీమా సొమ్ము రావడం కాస్త ఆలస్యం అవుతుందని పోలీసులు తెలిపారు. కొందరు వైసీపీ నాయకులు అక్కడికి చేరుకుని, ఎమ్మెల్సీ అందుబాటులో లేరని, ఆయన వచ్చాక మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు నిరసన విరమించారు.

*శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్‌ స్కైట్రాక్స్‌ అవార్డు దక్కిందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 100 ఎయిర్‌పోర్టుల్లో 64స్థానం నుంచి 63కి చేరుకుందని తెలిపారు. దేశంలోపాటు దక్షిణాసియాలో అత్యుత్తమ సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా కూడా పేరొచ్చిందన్నారు. బెస్ట్‌ రీజనల్‌ ఎయిర్‌పోర్టు ఆన్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా-2022లో రెండవస్థానం, క్లీనెస్ట్‌ ఎయిర్‌పోర్టు ఆన్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియాలో 4వ స్థానం అవార్డులను ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పోలో జరిగిన సమావేశంలో జీఎంఆర్‌ ప్రతినిధులు అందుకున్నట్లు తెలిపారు.

*మొహమ్మద్‌ ప్రవక్తపై ఇద్దరు బీజేపీ తాజా మాజీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని అమెరికా తెలిపింది. మానవ హక్కుల్ని గౌరవించాలని భారత్‌ను కోరుతున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఈ సందర్భంగా ఓ పాకిస్థానీ రిపోర్టర్‌ ఆయనకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని ఆయన బదులిచ్చారు.

*ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో దోషిగా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు నెలరోజుల పెరోల్‌ లభించింది. దీంతో ఆయన శుక్రవారంనాడు హర్యానాలోని రోహ్‌తక్ జైలు నుంచి విడుదలయ్యారు. డేరాబాబాకు సంబంధిత అధికారుల సిఫారసుతో రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ 30 రోజుల రిమాండ్‌ మంజూరు చేసినట్టు హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ చౌతాలా తెలిపారు. ఉత్తరప్రదేశ్ భాగ్‌పట్‌లోని బర్నావాలో ఉన్న డేరా సచ్చా సౌదా ఆశ్రమానికి డేరాబాబా వెళ్లాలనుకుంటున్నారని చెప్పారు.

*శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెస్ట్‌ స్కైట్రాక్స్‌ అవార్డు దక్కిందని జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ 100 ఎయిర్‌పోర్టుల్లో 64స్థానం నుంచి 63కి చేరుకుందని తెలిపారు. దేశంలోపాటు దక్షిణాసియాలో అత్యుత్తమ సిబ్బంది కలిగిన విమానాశ్రయంగా కూడా పేరొచ్చిందన్నారు. బెస్ట్‌ రీజనల్‌ ఎయిర్‌పోర్టు ఆన్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా-2022లో రెండవస్థానం, క్లీనెస్ట్‌ ఎయిర్‌పోర్టు ఆన్‌ ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియాలో 4వ స్థానం అవార్డులను ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ ప్యాసింజర్‌ టెర్మినల్‌ ఎక్స్‌పోలో జరిగిన సమావేశంలో జీఎంఆర్‌ ప్రతినిధులు అందుకున్నట్లు తెలిపారు.

*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే కాకినాడ ఎక్స్ ప్రెస్ మొదలైంది. మరోవైపు రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అంతకుముందే రైల్వే స్టేషన్‌ను శుభ్రపరిచి పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. రైల్వే పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ఆ తర్వాతే రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ ఉద్యోగ నియామకాల్లో నిబంధనలపై ఆందోళనకారులు మండిపడుతూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన రాకేశ్ అనే యువకుడు చనిపోయాడు.

*ఎప్పటికప్పుడు వాట్సాప్‌ వినూత్న ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ‘డూ నాట్‌ డిస్ట్రబ్‌’ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ఐఓఎస్‌ వెర్షన్‌(టెస్ట్‌ ఫ్లయిట్‌)కి సంబంధించి లేటెస్ట్‌ బేటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ విడుదలైనట్టు డబ్ల్యుబేటాఇన్ఫో వెల్లడించింది. ఈ మోడ్‌లో ఒకసారి ఏ కాంటాక్టునైనా బ్లాక్‌ చేస్తే చాలు, మళ్ళీ టర్నాఫ్‌ చేసేంతవరకు కాల్స్‌ నుంచి మెసేజ్‌ నోటిఫికేషన్స్‌ వరకు ఏవీ రావు. ఈ పద్ధతిలో డిస్ట్రబ్‌ కాకుండా మీటింగ్‌లకు హాజరుకావడం, హాయిగా డ్రైవింగ్‌, స్లీపింగ్‌ సహా అన్ని పనులను చక్కబెట్టుకోవచ్చు. ఐఓఎస్‌ 15 సాఫ్ట్‌వేర్‌, తదుపరి వెర్షన్స్‌ ఉన్న ఐఫోన్‌ల్లోనే ఇది అందుబాటులో ఉంది. ఐఓఎస్‌ 12, 13, 14 ఉన్న ఐఫోన్‌లకు వాట్సాప్‌ సపోర్టు ఉన్నప్పటికీ, ఈ ఫీచర్‌ ఉండదు.

*రాష్ట్ర భూ కేటాయింపు కమిటీ శుక్రవారం సమావేశమయింది. తొమ్మిది కంపెనీలకు భూ కేటాయింపు కోసం ఆమోదం తెలిపింది. ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా భూకేటాయింపు కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎకరాలలోపు భూముల కోసం దరఖాస్తులు ఉన్నాయి. బాపట్ల జిల్లా చీరాల పార్కులో భూముల కోసం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం స్పెషల్‌ జోన్‌ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించాక… తొమ్మిదింటిని కమిటీ ఆమోదించింది.

*రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు ఆవరణల్లో ఈ నెల లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. కోర్టులో పెండింగ్‌ ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు క్కు బౌన్స్‌ కేసులు మోటారు ప్రమాద పరిహార కేసులు లేబర్‌ కేసులు సివిల్‌ కేసులు అలాగే కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగిన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. లోక్‌ అదాలత్‌ సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ప్రజలు/కక్షిదారులు తమ దగ్గర్లోని కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కోరారు. అదే రోజున హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలోనూ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు.

*జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి నోటీసు జారీచేసింది. చిత్తూరులో ఒక పని మనిషిని పోలీసులు చితకబాదడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నోటీసు పంపింది. ఈ సంఘటనపై ఐజీకి తక్కువ కాని అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి ఐదు వారాల్లో తమకు నివేదిక పంపాలని లేని పక్షంలో తమ అధికారాల పరిధిలో తామే చర్యలు తీసుకొంటామని ఈ నోటీసులో పేర్కొంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా మానవ హక్కుల సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది. చిత్తూరులో ఉమా మహేశ్వరి అనే దళిత మహిళను చిత్తూరు పోలీసులు చిత్ర హింసలు పెట్టడంపై వర్ల ఈ ఫిర్యాదు పంపారు. ఫిర్యాదుపై ఈ నెల న మానవ హక్కుల కమిషన్‌ స్పందించి నోటీసు జారీ చేసింది. ఇటువంటి సంఘటనలను కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేసింది.

*రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ మంత్రి పి.నారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు తీర్పు వాయిదాపడింది. సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్‌, వైవీ రవిప్రసాద్‌, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. శుక్రవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రకటించారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌, ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ తయారీలో అవకతవకలు, అవినీతి చోటు చేసుకున్నట్లు మంగగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గత నెల 9న సీఐడీ అధికారులు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 120(బి),420, 166, 167, 217, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ 13(1)(ఎ) తదితరాల కింద కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కేవీపీ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు.

*కృష్ణ జిల్లా ఎస్పీగా జాషువా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు..‘‘ కృష్ణాజిల్లాలో వివిధ ప్రాంతాలలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఎంతో చరిత్ర ఉన్న కృష్ణాజిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. జిల్లాలో శాంతి భధ్రతలపై ప్రత్యేక దృష్టి పెడతాం. చట్టాన్ని ఉల్లంఘించే శక్తుల‌పై నిఘా పెడతాం. మహిళా భద్రతకు ప్రాధాన్యతనిస్తూ..తగిన చర్యలు తీసుకుంటాం. నాకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేరుస్తా.’’ అని చెప్పారు.

*అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి రెండ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలకు మూడు రోజుల్లోనే సిఫారసులు పంపాలని విజిలెన్స్‌ కమిషన్‌కు ప్రభుత్వం గడువు నిర్దేశించింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇటువంటి కేసుల్లో చర్యలకు మూడు వారాలు(21రోజులు) గడువు ఉండేది.

* రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు ఆవరణల్లో ఈ నెల 26న లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. కోర్టులో పెండింగ్‌ ఉన్న అన్ని రకాల రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, చెక్కు బౌన్స్‌ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, లేబర్‌ కేసులు, సివిల్‌ కేసులు, అలాగే కోర్టుల వరకు వెళ్లని రాజీపడదగిన కేసులను లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చు. లోక్‌ అదాలత్‌ సేవలను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. ప్రజలు/కక్షిదారులు తమ దగ్గర్లోని కోర్టు ఆవరణలో న్యాయసేవాధికార సంస్థను సంప్రదించి లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎం.బబిత కోరారు. అదే రోజున హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలోనూ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు.

* జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి నోటీసు జారీచేసింది. చిత్తూరులో ఒక పని మనిషిని పోలీసులు చితకబాదడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నోటీసు పంపింది. ఈ సంఘటనపై ఐజీకి తక్కువ కాని అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి ఐదు వారాల్లో తమకు నివేదిక పంపాలని, లేని పక్షంలో తమ అధికారాల పరిధిలో తామే చర్యలు తీసుకొంటామని ఈ నోటీసులో పేర్కొంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా మానవ హక్కుల సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది. చిత్తూరులో ఉమా మహేశ్వరి అనే దళిత మహిళను చిత్తూరు పోలీసులు చిత్ర హింసలు పెట్టడంపై వర్ల ఈ ఫిర్యాదు పంపారు. ఫిర్యాదుపై ఈ నెల 14న మానవ హక్కుల కమిషన్‌ స్పందించి నోటీసు జారీ చేసింది. ఇటువంటి సంఘటనలను కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేసింది.

*రాష్ట్రవ్యాప్తంగా వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌(ఓటీఎస్‌) కింద వసూలు చేసిన రూ.82.46 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాల వద్దే ఉందని.. ఆ సొమ్మును సర్కారుకు జమ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ నిధులు ప్రభుత్వానికి చెల్లిస్తేనే గ్రామ, వార్డు సచివాలయాల్లోని సిబ్బందిని క్రమబద్ధీకరించాలని(రెగ్యులరైజ్‌) నిర్దేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో ఆయన సచివాలయాలకు సంబంధించి వెబ్‌కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించారని, రిజిస్ట్రేషన్లపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. నాలుగో విడత ‘జగనన్న తోడు’ను జూలైలో అమలు చేయాలని తెలిపారు. కాపు నేస్తం, వాహనమిత్ర దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను సీఎస్‌ ఆదేశించారు. 5,903 వలంటీర్‌ పోస్టులు ఖాళీలున్నాయని, వాటిని భర్తీ చేయాలన్నారు. గ్రామాల్లో ఘనవ్యర్థాల షెడ్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

*డీసెట్‌-2022 సార్వత్రిక ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19లోగా నిర్దేశించిన రుసుము చెల్లించి, 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని డీసెట్‌ కన్వీనర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను హెచ్‌టీటీపీఎ్‌స://సీఎ్‌సఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ లేదా హెచ్‌టీపీఎ్‌స:// ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎ్‌సఎ్‌స.ఐఎన్‌ ద్వారా అందజేయాలని కోరారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాక ఉత్తీర్ణత ఆధారంగా వారిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

*జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆంధ్రప్రదేశ్‌ డీజీపీకి నోటీసు జారీచేసింది. చిత్తూరులో ఒక పని మనిషిని పోలీసులు చితకబాదడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నోటీసు పంపింది. ఈ సంఘటనపై ఐజీకి తక్కువ కాని అధికారితో స్వతంత్ర దర్యాప్తు జరిపి ఐదు వారాల్లో తమకు నివేదిక పంపాలని, లేని పక్షంలో తమ అధికారాల పరిధిలో తామే చర్యలు తీసుకొంటామని ఈ నోటీసులో పేర్కొంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా మానవ హక్కుల సంస్థ ఈ నిర్ణయం తీసుకొంది. చిత్తూరులో ఉమా మహేశ్వరి అనే దళిత మహిళను చిత్తూరు పోలీసులు చిత్ర హింసలు పెట్టడంపై వర్ల ఈ ఫిర్యాదు పంపారు. ఫిర్యాదుపై ఈ నెల 14న మానవ హక్కుల కమిషన్‌ స్పందించి నోటీసు జారీ చేసింది. ఇటువంటి సంఘటనలను కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తుందని స్పష్టం చేసింది.

*1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే ఫైలుపై సీఎం జగన్‌ సంతకం చేశారు. నాటి డీఎస్సీలో పలువురు ఉద్యోగాలు పొందినా దాదాపు 4,534 మంది అభ్యర్థులు పలు కారణాలతో ఉద్యోగాలు పొందలేదు. అప్పటినుంచీ వారు పోరాడుతున్నారు. వారికి కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తామని గతంలోనే వాగ్దానం చేశారు. ఇప్పుడు వారికి ఆ మేరకు కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం ఇస్తూ సీఎం సంతకం చేశారు. వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేలు(రూ.33 వేలు)ను వర్తింపజేయనున్నారు. సీఎం నిర్ణయంపై పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్‌. లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఐ. వెంకటేశ్వర్‌రావు, షేక్‌ సాబ్జీలు హర్షం వ్యక్తంచేశారు.

*డీసెట్‌-2022 సార్వత్రిక ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 19లోగా నిర్దేశించిన రుసుము చెల్లించి, 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని డీసెట్‌ కన్వీనర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను హెచ్‌టీటీపీఎ్‌స://సీఎ్‌సఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ లేదా హెచ్‌టీపీఎ్‌స:// ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్‌ఎ్‌సఎ్‌స.ఐఎన్‌ ద్వారా అందజేయాలని కోరారు. ఇంటర్‌ ఫలితాలు వెలువడ్డాక ఉత్తీర్ణత ఆధారంగా వారిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.