DailyDose

‘ఆ బుక్‌ ఆధారంగా వీజీ సిద్ధార్థ బయోపిక్‌ తీస్తున్నాం’

‘ఆ బుక్‌ ఆధారంగా వీజీ సిద్ధార్థ బయోపిక్‌ తీస్తున్నాం’

‘కెఫె కాఫీ డే’ ఫౌండర్‌ వీజీ సిద్ధార్థ్‌ జీవితం త్వరలోనే తెరపైకి రానుంది. ఆయన బయోపిక్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ నిర్మాణ సం‍స్థ టీ-సిరీస్‌, ఆల్మైటీ మోషన్‌ పిక్చర్‌, కర్మ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌లు శుక్రవారం ప్రకటించాయి. ఇన్వేస్టిగేటివ్‌ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్‌, ప్రోసెంజీత్‌ దత్తా రాసిన కాఫీ కింగ్‌ పుస్తకంగా ఆధారం ఆయన బయోపిక్‌ తెరకెక్కించబోతున్నట్లు స్పస్టం చేశారు.

కాగా నిన్న సదరు నిర్మాణ సంస్థలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా ‘కాఫీ మనందరి జీవితంలో భాగం చేసి వీజీ సిద్ధార్థ్‌ వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్‌ ఘటన. సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ అయిన వీజీ సిద్ధార్థ్‌ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఒడిదుడుకులకు సంబంధించి లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే ‘కాఫీ కింగ్‌: ది స్వీఫ్ట్‌ రైజ్‌ అండ్‌ సడెన్‌ డేత్‌ ఆఫ్‌ కెఫె కాఫీ డే ఫౌండర్‌ వీజీ సిద్ధార్థ్‌’. ఇది వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ.

అందుకే ఆయన బయోపిక్‌ హక్కులను తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని టీ-సీరిస్‌ చైర్మన్‌ భూషన్‌ కూమార్‌ తెలిపాడు. కెఫె కాఫీ డే ఫౌండర్‌గా వీజీ సిద్ధార్థ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆనతి కాలంగో గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి వీజీ సిద్ధార్థ్‌ 2019 జూలైలో ఆకస్మాత్తుగా కర్ణాటకలోనే ఓ నది శవమై తేలారు. అప్పటికి ఆయనకు 59 ఏళ్లు. అయితే ఆయన ఆత్మహత్య​కు కారణాలేంటో ఇప్పటికి తెలియదు. సిద్ధార్థ మరణాంతరం ఆయన భార్య మళవిక హెగ్డే కెఫె కాఫీ డే బాధ్యతలు చేపట్టారు.