DailyDose

కెనడాలో కారు ఢీకొని ఒంగోలు వాసి దుర్మరణం – TNI నేర వార్తలు

కెనడాలో కారు ఢీకొని ఒంగోలు వాసి దుర్మరణం  – TNI  నేర వార్తలు

* కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రవాసాంధ్రుడు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ నెల 16 తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
*ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో విషాదం నెలకొంది. వాగులో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన వారి కుటుంబాల్లో విషాదం నింపింది. మండపేట గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు బయలు దేరారు. వీరు మారేడుమిల్లి మండలం వాలమూరు వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవాశాత్తు సందీప్‌, అరుణ్‌ అనే యువకులు వాగులో గల్లంతయ్యారు
*బాపట్ల: జిల్లాలోని ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైతు వినోద్ కుమార్ మృతి చెందారు. భార్య అపర్ణ ప్రియ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*కుమురంబీం: జిల్లాలోని వాంకిడి మండలం ఇందానిలో విషాదం చోటుచేసుకుంది. ఇందానిలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సెందె నాకు బాయి(35), సెండెన్ విష్ణు(6)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురిని ఎస్వోటీ పోలీ్‌సలు అరెస్ట్‌ చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీఎన్‌రెడ్డినగర్‌ డివిజ న్‌ పరిధిలోని సచివాయలనగర్‌ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ఇంటిపై దాడిచేసి గడ్డికొప్పుల రాములు(35), గుడ్డు ప్రభాకర్‌(42), వై.అఖిల్‌(37), కుర్మయ్య (25), సుధాకర్‌ రెడ్డి(42), సామ జంగారెడ్డి(58)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.34,270 నగదు, 5 ఫోన్లు, 1 కార్డు సెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
* సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్‌తో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టన్నెల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే రైతు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* ఉన్మాదుల చేతుల్లో బంధుత్వాలు బలైపోతున్నాయి. కనీపెంచినా తల్లిదండ్రులపై కనికరం
లేకుండా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చంటిపాపల్లా కాపాడాల్సిన ఓ తనయుడు ఉన్మాదిలా మారి ఆమె గొంతుకోసి హత్య చేయడం పల్నాడు జిల్లాలో కలకలం రేపుతుంది. జిల్లాలోని చిలకలూరిపేట మండలం రాజాపేటలో జరిగిన దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
*బాపట్ల: జిల్లాలోని ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రైతు వినోద్ కుమార్ మృతి చెందారు. భార్య అపర్ణ ప్రియ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
*అశ్వారావుపేట పట్టణంలోని అంబేడ్కర్ నగర్ (దొంతికుంట)లో దాసరి శాంతి కుమారి(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఆమె సూసైడ్ చేసుకుంది. వరుడికి అంగవైకల్యం ఉందని తెలిసి యువతి ఆత్మహత్యకి పాల్పడినట్లు సమాచారం. వివాహం ఆగితే కుటుంబం పరువుపోతుందని ఇంట్లో ఎవరూలేని సమయంలో శాంతి కుమారి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురిని ఎస్వోటీ పోలీ్‌సలు అరెస్ట్‌ చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బీఎన్‌రెడ్డినగర్‌ డివిజ న్‌ పరిధిలోని సచివాయలనగర్‌ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు ఇంటిపై దాడిచేసి గడ్డికొప్పుల రాములు(35), గుడ్డు ప్రభాకర్‌(42), వై.అఖిల్‌(37), కుర్మయ్య (25), సుధాకర్‌ రెడ్డి(42), సామ జంగారెడ్డి(58)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ.34,270 నగదు, 5 ఫోన్లు, 1 కార్డు సెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కార్మిక సంఘాల నాయకురాలు రమాదేవి శనివారం గుండెపోటుతో ఎల్లారెడ్డిగూడ శాలివాహననగర్‌లో మరణించారు. ఆమె అల్విన్‌ ఫ్యాక్టరీ కార్మిక నాయకురాలిగా, బీజేపీ నగర, రాష్ట్ర విభాగాల్లో అనేక సేవలందించారు. ఆమె మరణ వార్త తెలియగానే హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సంతాపాన్ని ప్రకటించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం బీజేపీ నాయకుడు అట్లూరి రామకృష్ణ తదితరులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఆదివారం ఈఎ్‌సఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

*తిరుపతిలోని స్విమ్స్‌ కొవిడ్‌ కేంద్రంలో కొవిడ్‌తో చికిత్స పొందుతూ శనివారం ఒకరు మృతి చెందినట్లు తెలిసింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన 39 ఏళ్ల వ్యక్తి స్విమ్స్‌లో చేరాడు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ వచ్చింది. దాంతో కొవిడ్‌ కేంద్రంలో ఉంచి చికిత్స అందిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. మరో ముగ్గురు బాధితులు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
*ఇల్లెందు నుంచి ఇతర ప్రాంతాలకు లారీలో తరలిస్తున్న 420 బస్తాల రేషన్‌ బియ్యాన్ని కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీసుల చాకచక్యంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఇల్లెందు నుంచి కొత్తగూడెం మీదుగా జగ్గయ్యపేటకు వెళ్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని కొత్తగూడెం ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న వన్‌టౌన్‌ పోలీసులు పరిశీలించారు. లారీలో తరలిస్తున్న బియ్యం రేషన్‌ బియ్యంగా గుర్తించి సరైన పత్రాలు లేకపోవడంతో లారీ డ్రైవర్‌ జానీ పాషాను అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. ఈ క్రమంలో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ లారీలో 210 క్వింటాల బియ్యం (420 బస్తాలు)గా గుర్తించి తహసిల్దార్‌ రామకృష్ణకు వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. సత్యనారాయణ సమాచారాన్ని అందించారు. జగ్గయ్యపేటకు చెందిన లారీ యజమాని ఇంతియాజ్‌, ముకుందాపురానికి చెందిన అనీల్‌కుమార్‌, ఖమ్మానికి చెందిన జగదీష్‌, లారీ డ్రైవర్‌ జానీ పాషా పై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో పీడీఎస్‌ బియ్యం లారీని పట్టుకున్నందుకు ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను డీఎస్పీ వెంకటేశ్వరబాబు అభినందించారు. కొత్తగూడెం తహసీల్దార్‌ సమక్షంలో అధికారులు ఈ బియ్యాన్ని సీజ్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ తనిఖీలో వన్‌టౌన్‌ ఎస్‌ఐ నర్సిరెడ్డి, కానిస్టేబుల్‌ బుచ్చిరాములు తదితరులు ఉన్నారు.
* పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. చిలకలూరిపేట మండలం రాజపేటలో తల్లి ఆదిశేషమ్మ (67)ను కొడుకు వీరయ్య హత్య చేశాడు. గొంతు కోసి చంపేశాడు. రాజాపేట – పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
*శాండల్‌వుడ్‌ యువనటుడు సతీశ్‌ వజ్ర (26) దారుణహత్యకు గురయ్యాడు. బెంగళూరు రాజరాజేశ్వరినగర్‌లోని తన నివాసంలోనే హత్యకు గురయ్యాడు. ఈ మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కొంతకాలంగా లఘుచిత్రాలలో నటించిన సతీశ్‌ ఇటీవలే ‘లగోరి’తో సినిమాకు పరిచయమయ్యాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యాడు. కొన్ని నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలల క్రితం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అక్క మృతికి సతీశ్‌ కారణమని భావించి ఆమె సోదరుడు హతమార్చి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని విక్టోరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్, క్లీనర్తో పాటుగా మరికొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పేరూరు బండ వద్ద ముందు వెళుతున్న సిమెంటు లారీని ఢీకొంది. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు.. స్థానికుల సహాయంతో బస్సుకు ఉన్న ఇనుప చువ్వలు తొలగించి డ్రైవర్, క్లీనర్తో పాటు ప్రయాణికుల్ని 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మరికొందరికి స్వల్ప గాయాలు కాగా వారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఎం.ఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.