Movies

కంగనా బాటలో శిల్పా

Auto Draft

ఇటీవల ‘ధాకద్‌’ పేరుతో బాలీవుడ్‌కు భారీ ఫ్లాప్‌ ఇచ్చింది కంగనా రనౌత్‌. ఇప్పుడామె ప్రయత్నానికి తానూ తోడున్నానంటూ ముందుకొచ్చింది మరో తార శిల్పా శెట్టి. ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘నికమ్మ’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి ప్రతికూల స్పందన తెచ్చుకుంటున్నది. తెలుగులో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘మిడిల్‌క్లాస్‌ అబ్బాయి’ సినిమా హిందీ రీమేక్‌గా ‘నికమ్మ’ తెరకెక్కింది. ఈ చిత్రానికి సబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. అభిమన్యు దాసాని, శెర్లీ సెటియా జంటగా నటించారు. తెలుగులో భూమిక పోషించిన పాత్రలో శిల్పా శెట్టి నటించింది. ఈ సినిమా ఆమెకు రీఎంట్రీ మూవీ కావడం విశేషం. ఈ సినిమాను విశ్లేషకులు తూర్పార పడుతున్నారు. 80,90 దశకాల్లో తరహా స్లో మోషన్‌ స్టంట్స్‌, లాజిక్‌ లేని సన్నివేశాలు, ఆకట్టుకోని సంభాషణలతో మొత్తంగా సినిమా విసుగెత్తించిందని రివ్యూస్‌ వస్తున్నాయి. ఈ ప్రతికూల స్పందనల మధ్య తొలిరోజు 52 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టిందీ సినిమా. ఈ మధ్య అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ సినిమా కూడా ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది.