NRI-NRT

వైట్​హౌజ్​ సమీపంలో కాల్పులు.. పలువురికి తూటా గాయాలు

వైట్​హౌజ్​ సమీపంలో కాల్పులు.. పలువురికి తూటా గాయాలు

అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. శ్వేతసౌధం సమీపంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పోలీస్​ అధికారి సహా పలువురికి బుల్లెట్లు తగిలాయి. అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. రాజధాని నగరమైన వాషింగ్టన్​డీసీ 14 అండ్​ యూ వీధిలోని జునెటీంత్​ మ్యూజిక్​ కన్సెర్ట్​ సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఫైరింగ్​లో ఓ పోలీస్​ అధికారి సహా.. పలువురికి తూటాలు తగిలినట్లు మెట్రోపోలిటన్​ పోలీస్​ విభాగం తెలిపింది. ఈ ఘటన అధ్యక్ష భవనమైన వైట్​హౌజ్​కు సమీపంలోనే జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.