DailyDose

జగమంతా రాగమయం..- జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ

జగమంతా రాగమయం..- జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ

అంతా రామమయం– జగమంతా రామమయం’ అన్నాడు భక్త రామదాసు. తూర్పు పడమరల ఎల్లలు చెరిగిపోతున్న నేటి సంగీత ప్రపంచాన్ని గమనిస్తుంటే ‘అంతా రాగమయం– జగమంతా రాగమయం’ అని తన్మయంగా పాడుకోవచ్చు సంగీతాభిమానులు. ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై కూర్చుని జుగల్‌బందీ కచేరీలతో శ్రోతలను అలరించిన సందర్భాలు నిన్నటితరం సంగీతాభిమానులకు తెలిసిన ముచ్చటే! ఇప్పటికీ తరచుగా జుగల్‌బందీ కచేరీలు దేశ విదేశాల్లో విరివిగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవలి కాలంలో దేశంలోని భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు మాత్రమే కాదు, విదేశీ విద్వాంసులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలు కూడా పెరుగుతున్నాయి. ఫ్యూజన్‌ ఆల్బమ్స్‌కు అన్ని ప్రాంతాల్లోనూ శ్రోతల ఆదరణ పెరుగుతోంది. ఫ్యూజన్‌ ప్రయోగాలు సంగీతం విశ్వజనీనమని చాటుతున్నాయి.
జూన్‌ 21 ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం…

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.

ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు.

హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్‌బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్‌ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్‌ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అలీ అక్బర్‌ఖాన్‌ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్‌ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్‌ ఎన్‌ రోల్‌ బృందాలతో కలసి ఫ్యూజన్‌ కచేరీలు చేశారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది. ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి.

ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ ‘బీటిల్స్‌’ బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, ‘బీటిల్స్‌’ పాట ‘నార్వేజియన్‌ వుడ్‌’లో సితార్‌ స్వరాలను పలికించాడు. పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది.

తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్‌ కజిన్స్‌’ పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.

కూత ఘనం పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

నాలుగేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతాభ్యాసం మొదలుపెట్టిన లిడియన్‌ నాదస్వరం తన పదమూడేళ్ల వయసులోనే ఒక సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు. కేరళకు చెందిన శ్రేయా జయదీప్‌ శాస్త్రీయ సంగీతం అభ్యసించి, రియాలిటీ షోలలోను, సినిమాల్లోనూ రాణిస్తోంది. ఆమె ఇప్పటికే రెండువందలకు పైగా ఆల్బమ్స్‌ కూడా విడుదల చేసింది. కేరళలో పుట్టి చెన్నైలో స్థిరపడిన కులదీప్‌ పాయ్‌ ఎందరో బాలలను సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు.

ఆయన వద్ద శిష్యరికం పొందుతున్న వారిలో రాహుల్‌ వెల్లాల్, సూర్యగాయత్రి, సూర్యనారాయణన్, రఘురామ్‌ మణికంఠన్, భవ్య గణపతి తదితరులు విశేషంగా రాణిస్తున్నారు. ‘యూట్యూబ్‌’ను మాధ్యమంగా చేసుకున్న తొలి శాస్త్రీయ సంగీతకారుడైన కులదీప్‌ పాయ్‌ తన శిష్యులను కూడా ఇదే మాధ్యమం ద్వారా శ్రోతలకు చేరువ చేస్తున్నారు. పాయ్‌ శిష్యుల్లో కొందరు అంతర్జాతీయ వేదికలపైనా మెరుపులు మెరిపిస్తుండటం విశేషం. ఇటీవలి కాలంలో సంగీతంలో రాణిస్తున్న బాల కళాకారులు సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్నా, ఏదో ఒకే సంప్రదాయానికి పరిమితమైపోకుండా, వేర్వేరు సంప్రదాయ శైలులనూ ఆకళింపు చేసుకుంటూ కొత్త కొత్త ప్రయోగాలతో సంగీతానికి గల విశ్వజనీనతను చాటుతున్నారు.

మన సంగీతంలో పాశ్చాత్యవాద్యాలు
మన సంగీత కచేరీల్లోకి పాశ్చాత్యవాద్య పరికరాలు బ్రిటిష్‌ హయాంలోనే ప్రవేశించాయి. కర్ణాటక సంగీత కచేరీలకు క్లారినెట్‌ను తొలిసారిగా మహాదేవ నట్టువనార్‌ పరిచయం చేశారు. తర్వాతి కాలంలో ఎ.కె.సి. నటరాజన్‌ వంటివారు క్లారినెట్‌ను కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువ చేశారు. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మహాదేవ నట్టువనార్‌ తంజావూరు మరాఠా రాజుల ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. అప్పట్లోనే ఆయన పాశ్చాత్య పరికరమైన క్లారినెట్‌పై ఆయన అద్భుతమైన స్వరవిన్యాసాలు చేసి, పండిత పామరులను అలరించారు. తర్వాతి కాలంలో క్లారినెట్‌ కర్ణాటక సంగీతానికి మరింతగా చేరువైంది. తంజావూరు ఆస్థానానికి చెందిన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితార్‌ సోదరుడు బాలస్వామి దీక్షితార్‌ పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో కర్ణాటక సంగీతానికి వయోలిన్‌ను పరిచయం చేశారు. ద్వారం వెంకటస్వామినాయుడు వయోలిన్‌ను కర్ణాటక సంగీతంలో అవిభాజ్య వాద్యం స్థాయికి చేర్చారు.

ద్వారం వెంకటస్వామినాయుడు ప్రభావంతో కర్ణాటక సంగీత కచేరీలలో వయోలిన్‌ ఒక తప్పనిసరి పక్కవాద్యం స్థాయికి చేరుకుంది. అంతేకాదు, వయోలిన్‌తో సోలో కచేరీలిచ్చే ఉద్దండులు కర్ణాటక సంగీతంలో చాలామందే ఉన్నారు. కదిరి గోపాలనాథ్‌ తొలిసారిగా శాక్సోఫోన్‌ను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో మరికొన్ని పాశ్చాత్య వాద్యపరికరాలు కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలకు పరిచయమయ్యాయి. పాశ్చాత్య వాద్యపరికరమైన శాక్సోఫోన్‌కు కొద్దిపాటి మార్పులు చేసి, దానిని కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని గమకాలన్నీ పలికేలా తీర్చిదిద్దారు.

మాండోలిన్‌ను శ్రీనివాస్‌ బాలుడిగా ఉన్నప్పుడే కర్ణాటక సంగీతానికి పరిచయం చేసి, ‘మాండోలిన్‌ శ్రీనివాస్‌’గా ప్రఖ్యాతి పొందారు. సుకుమార్‌ ప్రసాద్‌ తొలిసారిగా గిటార్‌ను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. అనిల్‌ శ్రీనివాసన్‌ పియానోను కర్ణాటక సంగీతానికి పరిచయం చేశారు. పాశ్చాత్య వాద్యపరికరమైన హార్మోనియం పంతొమ్మిదో శతాబ్దం నాటికి మన దేశంలో బాగా జనాదరణ పొందింది. పరిమాణంలో కొన్ని మార్పులకు లోనై, హిందుస్తానీ గాత్ర కచేరీలకు పక్కవాద్యంగా చక్కగా ఇమిడిపోయింది. పాశ్చాత్య వాద్యపరికాలు మన సంప్రదాయ సంగీతంలోని నిశితమైన గమకాలను, సంగతులను పలికించలేవనే విమర్శలు ఉన్నా, వాటిని తమవిగా చేసుకుని కచేరీలు చేసిన కళాకారులు ఆ విమర్శలన్నింటినీ వమ్ము చేశారు.

ఆధునిక కాలంలో మన భారతీయ సంగీత విద్వాంసులు పలువురు ప్రపంచ స్థాయిలో మన్ననలు అందుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై కచేరీలు చేసి, శ్రోతలను ఉర్రూతలూపారు. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన వారిలో అటు హిందుస్తానీ, ఇటు కర్ణాటక సంగీత విద్వాంసులు ఉన్నారు. శైలీ సంప్రదాయాలు వేర్వేరు అయినా, సంగీతం అంతా ఒక్కటేననే భావనతో భిన్న సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు జుగల్‌బందీ కచేరీలతో భారతీయ సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. భీమ్‌సేన్‌ జోషి, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, పండిట్‌ జస్‌రాజ్, ఎల్‌.సుబ్రమణ్యం తదితరుల జుగల్‌బందీలు భారతీయ సంగీతానికే వన్నె తెచ్చేవిగా నిలుస్తాయి. హిందుస్తానీ సంగీతకారుల్లో సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్, షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్, సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అమ్జద్‌ అలీ ఖాన్, వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్‌ చౌరాసియా, సంతూర్‌ విద్వాంసుడు శివకుమార్‌ శర్మ, తబలా విద్వాంసుడు ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

ఆధునిక కర్ణాటక సంగీతకారుల్లో చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మధురై మణి అయ్యర్, డాక్టర్‌ శ్రీపాద పినాకపాణి, జి.ఎన్‌.బాలసుబ్రమణ్యం, టి.ఎన్‌.శేషగోపాలన్‌ తదితర గాయకులు చెరగని ముద్ర వేశారు. ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, ఎం.ఎల్‌.వసంతకుమారి కర్ణాటక సంగీతంలో మహిళా త్రిమూర్తులుగా గుర్తింపు పొందారు.

ద్వారంవారి తర్వాత వయొలినిస్టుల్లో లాల్గుడి జయరామన్, కన్నకుడి వైద్యనాథన్, ఎం.ఎస్‌.గోపాలకృష్ణన్, అన్నవరపు రామస్వామి, ఎల్‌.వైద్యనాథన్, ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌. శంకర్, అవసరాల కన్యాకుమారి, వైణికుల్లో ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, దొరైస్వామి అయ్యంగార్, ఇ.గాయత్రి, జయంతి కుమరేశ్, వేణుగానంలో టి.ఆర్‌.మహాలింగం, ఎన్‌.రమణి, ప్రపంచం సీతారాం, నాదస్వరంలో షేక్‌ చినమౌలానా, టి.ఎన్‌.రాజరత్నం పిళ్లె తదితరులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించిన వారిలో ప్రముఖులు. ఇప్పటి తరంలో టి.ఎం.కృష్ణ, సిక్కిల్‌ గురుచరణ్, పాల్ఘాట్‌ రామ్‌ప్రసాద్, అక్కారయ్‌ శుభలక్ష్మి, అమృతా మురళి, విద్యా కళ్యాణరామన్‌ తదితరులు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాణిస్తున్నారు.

మనుషులకు మాటల కంటే ముందే సంగీతం తెలుసు. దాదాపు లక్షన్నర ఏళ్ల కిందట భాషల పుట్టుక జరిగితే, దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షల ఏళ్ల కిందటే పాతరాతి యుగం మానవులకు సంగీతం తెలుసుననడానికి ఆధారాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో దొరికిన ఎముకలతో చేసిన వేణువులు, తాళవాద్య పరికరాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. భాషలు, లిపులు ఏర్పడిన తర్వాత ప్రపంచం నలుమూలలా సంగీతాన్ని లిపిబద్ధం చేసే ప్రక్రియ కూడా మొదలైంది. ప్రపంచంలోని ఏ సంప్రదాయానికి చెందిన సంగీతంలోనైనా ఉండేవి ఆ సప్తస్వరాలే! ప్రకృతిలోని ధ్వనులే సప్తస్వరాలకు, రకరకాల తాళాలకు మూలం. మన దేశంలో సంగీతం చిరకాలంగా ఉంది.

ప్రణవనాదమైన ఓంకారమే అనాదినాదమని పురాణాలు చెబుతాయి. భారతీయ సంప్రదాయ సంగీతానికి మూలాలు సామవేదంలో ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్ది మధ్యకాలంలో భారతీయ సంగీతం శాస్త్రీయతను సంతరించుకుంది. ఆ కాలంలోనే సంస్కృతంలో సంగీతానికి సంబంధించిన పలు గ్రంథాలు వెలువడ్డాయి. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది తర్వాత ఉత్తర భారత, దక్షిణ భారత ప్రాంతాల్లో సంగీత శైలీభేదాలు ప్రస్ఫుటంగా ఏర్పడుతూ వచ్చాయి. ఉత్తరాది సంగీతం హిందుస్తానీ సంగీతంగా, దక్షిణాది సంగీతం కర్ణాటక సంగీతంగా అవతరించాయి. బ్రిటిష్‌కాలంలో పాశ్చాత్య సంగీతం ఇక్కడి ప్రజలకు చేరువైంది. పలు పాశ్చాత్య వాద్య పరికరాలు మన సంగీతకారులను ఆకట్టుకున్నాయి. క్లారినెట్, వయోలిన్, గిటార్, మాండోలిన్, పియానో వంటి పాశ్చాత్య వాద్య పరికరాలను భారతీయ సంప్రదాయ సంగీతకారులు అక్కున చేర్చుకున్నారు.

హిందుస్తానీ, కర్ణాటక సంగీత శైలీ సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడిన తర్వాత చాలాకాలం పాటు సంగీతకారులు ఎవరికి వారు గిరిగీసుకుని, తమ తమ శైలీ సంప్రదాయాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇరవయ్యో శతాబ్దిలో పాశ్చాత్య సంగీతం కూడా పరిచయమయ్యాక సంగీతం విశ్వజనీనమైనదనే ఎరుక కలిగి, వేర్వేరు సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు ఒకే వేదికపై జుగల్‌బందీలు నిర్వహించే స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించుకున్నారు. ఇటీవలి కాలంలోనైతే పాశ్చాత్య విద్వాంసులతోనూ కలసి ఫ్యూజన్‌ కచేరీలతో మన సంగీతకారులు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నారు. నిజానికి ఫ్యూజన్‌ ప్రయోగాలు నిన్న మొన్నటివి కావు. హిందుస్తానీ సరోద్‌ విద్వాంసుడు ఉస్తాద్‌ అలీ అక్బర్‌ఖాన్‌ 1955లోనే పాశ్చాత్య సంగీతకారులతో కలసి అమెరికాలో తొలి ఫ్యూజన్‌ కచేరీ చేశారు. ఆ తర్వాత 1960లలో కొందరు భారతీయ విద్వాంసులు రాక్‌ ఎన్‌ రోల్‌ బృందాలతో కలసి ఫ్యూజన్‌ కచేరీలు చేశారు.

సంప్రదాయ సంగీతంపై పాశ్చాత్య ప్రభావం
భారతీయ సంగీతంలో హిందుస్తానీ, కర్ణాటక సంగీత సంప్రదాయాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. హిందుస్తానీ సంగీతంపై పర్షియన్, అరబిక్‌ సంగీత శైలుల ప్రభావం ఉంటే, కర్ణాటక సంగీతంపై యూరోపియన్‌ సంగీత ప్రభావం కనిపిస్తుంది. పదహారో శతాబ్దికి చెందిన పురందరదాసు కర్ణాటక సంగీత పితామహుడు. ఆయన తర్వాత పద్దెనిమిది పంతొమ్మిదో శతబ్దాలకు చెందిన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్‌లు కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా ప్రఖ్యాతి పొందారు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల కాలంలోనే కర్ణాటక సంగీతంపై పాశ్చాత్య ప్రభావం మొదలైంది.

ముత్తుస్వామి దీక్షితార్‌ శంకరాభరణ రాగంలో రచించిన ‘నోట్టు స్వరాలు’ పాశ్చాత్య సంగీతానికి దగ్గరగా ఉంటాయి. ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి కర్ణాటక సంగీత విద్వాంసులను ఆదరించిన తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య బ్యాండ్‌ బృందం కూడా ఉండేది. అప్పట్లో తంజావూరు సంస్థానానికి చెందిన కర్ణాటక సంగీతకారుల్లో వరాహప్ప దీక్షిత పండితుల వంటివారు పాశ్చాత్య బ్యాండ్‌ బృందం వద్ద పాశ్చాత్య సంగీతం నేర్చుకుని, అందులోనూ ప్రావీణ్యం సాధించారు. తంజావూరు ఆస్థానంలో వయోలిన్‌పై పూర్తిస్థాయి పాశ్చాత్య సంగీత కచేరీ చేసిన ఘతన వరాహప్ప దీక్షిత పండితులకే దక్కుతుంది. ఆయనకు పియానో వాయించడంలోనూ అద్భుతమైన నైపుణ్యం ఉండేది. తెలుగువాడైన త్యాగరాజు శంకరాభరణం, సుపోషిణి వంటి రాగాల్లో కొన్ని కీర్తనలకు చేసిన స్వరకల్పనలు పాశ్చాత్య సంగీత శైలికి దగ్గరగా ఉంటాయి.

ఫ్యూజన్‌ ప్రయోగాలు
హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల జుగల్‌బందీ కచేరీలు ఒకరకంగా ఫ్యూజన్‌ కచేరీలుగానే చెప్పుకోవచ్చు. ఈ జుగల్‌బందీలకు భిన్నంగా పూర్తిగా పాశ్చాత్య సంగీతకారులతో కలసి చేసే ఫ్యూజన్‌ కచేరీలకు గత శతాబ్ది ద్వితీయార్ధంలో పునాదులు పడ్డాయి. ఇంగ్లిష్‌ రాక్‌బ్యాండ్‌ ‘బీటిల్స్‌’ బృందానికి చెందిన గిటారిస్ట్‌ జార్జ్‌ హారిసన్, అమెరికన్‌ వయోలినిస్ట్‌ యెహుది మెనుహిన్‌ వంటి వారితో కలసి పండిట్‌ రవిశంకర్‌ 1960 దశకంలోనే ఫ్యూజన్‌ కచేరీలు చేశారు. అప్పటి నుంచే భారతీయ సంగీతకారుల్లో ఫ్యూజన్‌ ప్రయోగాలపై ఆసక్తి పెరిగింది. పాశ్చాత్య సంగీతకారుల్లోనూ భారతీయ సంగీతంపై ఆసక్తి మొదలైంది. జార్జ్‌ హారిసన్‌ స్వయంగా పండిట్‌ రవిశంకర్‌ వద్ద సితార్‌ నేర్చుకుని, ‘బీటిల్స్‌’ పాట ‘నార్వేజియన్‌ వుడ్‌’లో సితార్‌ స్వరాలను పలికించాడు.

పండిట్‌ రవిశంకర్‌ కృషి ఫలితంగా ప్రాక్‌ పాశ్చాత్య సంగీతాల మధ్య వారధి ఏర్పడింది. తర్వాతి కాలంలో హరిహరన్, లెస్లీ లెవిస్‌లు కలసి ‘కలోనియల్‌ కజిన్స్‌’ పేరుతో ఫ్యూజన్‌ కచేరీలు చేయడమే కాకుండా, ఆల్బమ్స్‌ కూడా విడుదల చేశారు. మన దేశంలో ఇప్పుడు పలు ఫ్యూజన్‌ బ్యాండ్స్‌ క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. దేశ విదేశాల్లో పర్యటిస్తూ శ్రోతలను అలరిస్తున్నాయి. శాస్త్రీయ సంగీతంలో సుస్థిరస్థానం సాధించి, ఫ్యూజన్‌ ప్రయోగాలతో అలరించిన వారిలో ఎల్‌.సుబ్రమణ్యం, ఎల్‌.శంకర్, మాండోలిన్‌ శ్రీనివాస్, రాజేష్‌ వైద్య, విక్కు వినాయకరామ్, ఉస్తాద్‌ షాహిద్‌ పర్వేజ్, సితారా దేవి, జాకీర్‌ హుస్సేన్‌ వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఎన్ని రకాల శైలీ భేదాలు, మరెన్ని రకాల సంప్రదాయాలు ఉన్నా సంగీతమంతా ఒక్కటేనని ఫ్యూజన్‌ కళాకారులు తమ కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నారు. ప్రపంచ దేశాల నడుమ సాంస్కృతిక సామరస్యాన్ని పెంపొందించడంలో ఫ్యూజన్‌ కళాకారులు సాగిస్తున్న కృషి నిరుపమానం.

కూత ఘనం
పిట్ట కొంచెం కూత ఘనం అనే రీతిలో పసితనం వీడని కొందరు బాలలు శాస్త్రీయ సంగీతంలో అద్భుతంగా రాణిస్తూ, అంతర్జాతీయ స్థాయిలోనూ మన్ననలు పొందుతున్నారు. గురుగ్రామ్‌కు చెందిన గౌరీ మిశ్రా అతి పిన్నవయస్కురాలైన పియానిస్టుగా రికార్డులకెక్కింది. తొమ్మిదేళ్ల వయసులోనే 2015లో తొలి సోలో కచేరీ చేసి ఈ అరుదైన ఘనత సాధించింది. హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య స్వరాలను పియానోపై అలవోకగా పలికించే గౌరీ మిశ్రా ప్రతిభకు ఎ.ఆర్‌.రెహమాన్, అద్నాన్‌ సమీ వంటి దిగ్గజాలు సైతం ముగ్ధులవడం విశేషం. అతి పిన్నవయస్కుడైన తబలా వాద్యకారుడిగా గిన్నిస్‌ రికార్డు సాధించిన తృప్త్‌రాజ్‌ పాండ్య అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. పాండ్య తన మూడేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో ద్వారా తన వాద్యనైపుణ్యాన్ని ప్రదర్శించి, ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్, హరిప్రసాద్‌ చౌరాసియా వంటి దిగ్గజాల ప్రశంసలు పొందాడు. చెన్నైకి చెందిన లిడియన్‌ నాదస్వరం పియానో వాద్యకారుడిగా, సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.