NRI-NRT

పెదనందిపాడులో NATS ఉచిత కంటి వైద్య శిబిరం

పెదనందిపాడులో NATS ఉచిత కంటి వైద్య శిబిరం

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్).. పెదనందిపాడులో(గుంటూరు) ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి నూతి(బాపు), నాట్స్ బీఓడీ చైర్‌వుమన్ అరుణ గంటి నేతృత్వంలో ఏర్పాటైన ఈ శిబిరానికి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెదకాకానీలోని శంకర ఐ హాస్పిటల్, గుంటూరు డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ సహకారంతో నాట్స్ బృందం..పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో వైద్య శిబిరాన్ని నిర్వహించింది. కాగా.. ఈ శిబిరంలో పాల్గొన్న పురప్రముఖులు నాట్స్ అధ్యక్షుడి కృషిని ప్రశంసించారు.
ts2
ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరిపై ప్రశంసల వర్షం కురిపించారు. కంటి సమస్యలున్న వారికి కళ్లద్దాలను కూడా ఈ శిబిరంలో ఉచితంగా ఇవ్వడం ముదావహమన్నారు. ఇటువంటి కార్యక్రమాలను నాట్స్ మరిన్ని నిర్వహించాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. దేశం కోసం పాటుపడ్డ ఎందరో మహనీయుల స్ఫూర్తితోనే తాము ఈ శిబిరం ఏర్పాటుకు సంకల్పించినట్టు బాపయ్య చౌదరి పేర్కొన్నారు. పెదనందిపాడులో పుట్టి దేశానికే గర్వకారణంగా నిలిచిన పలువురు ప్రముఖుల గురించి ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.