DailyDose

మైసూర్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు

మైసూర్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు

ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్‌ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, మంగళవారం వేకువజామున మైసూర్‌ ప్యాలెస్‌(కర్ణాటక) గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా డే వేడుకలకు నేతృత్వం వహించి.. ప్రసంగించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, కేంద్రమంత్రి సోనోవాల్‌ తదితర ప్రముఖులతో పాటు సుమారు పదిహేను వేల మందికిపైగా ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నట్లు సమాచారం. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగా ప్రస్తావన ఉంది. యోగా ఫర్‌ హ్యూమానిటీ థీమ్‌తో ఈసారి వేడుకలను, గార్డియర్‌రింగ్‌ పద్ధతిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. మైసూర్‌ అధ్యాత్మికానికి కేంద్రం. ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. ..ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రమే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. ఇలా.. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని ప్రధాని పేర్కొన్నారు.విశ్వ మానవాళి ఆరోగ్యమే లక్ష్యం.. ఇదే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉద్దేశం. మనసు, శరీరం అదుపు చేసే శక్తి యోగాకు ఉంది సూర్యుడి కదలికలను అనుసరిస్తూ యోగాసనాలు వేయాలి. ప్రపంచవ్యాప్తంగా 25కోట్ల మంది.. ఈ దఫా వేడుకల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
https://twitter.com/ANI/status/1539061325263151104/photo/1