NRI-NRT

వాషింగ్టన్ డీసీలో యోగా సెషన్.. వందల సంఖ్యలో పాల్గొన్న ఔత్సాహికులు..!

వాషింగ్టన్ డీసీలో యోగా సెషన్.. వందల సంఖ్యలో పాల్గొన్న ఔత్సాహికులు..!

భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం వాషింగ్టన్ స్మారక స్థూపానికి సమీపంలో ఏర్పాటైన యోగా సెషన్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భారతీయ సంతతి వారే కాకుండా.. అమెరికా అధికారులు, కాంగ్రెస్ సభ్యులు, వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు మీడియా వారు వందల సంఖ్యలో పాల్గొన్నారు.యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. సేతురామన్ పంచనాథన్ ఈ ఈవెంట్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు. ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన గోప్ప బహుమతి యోగా అని డా. సేతురామన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వివిధ ప్రాంతాలని ఏకీకృతం చేసే శక్తి యోగాకుందన్నారు. మనసు, శరీరం మధ్య సమన్వయం సాధించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కాగా.. ఈ యోగా సెషన్లో అనేక మంది ఔత్సాహికులు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుందని అమెరికాలోని భారతీయ రాయబారి తరణ్‌జిత్ సింగ్ పేర్కొన్నారు.