Health

పూలతో అందం

పూలతో అందం

మల్లెపూలు:
గుప్పెడు మల్లెపూల రేకులు, ఒక పెద్ద చెంచా పెరుగు, ఒక టీస్పూను చక్కెర తీసుకోవాలి. ముందుగా మల్లె రేకులను వేళ్లతో చిదిమి, పెరుగు, చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడల మీద అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

గులాబీలు: గుప్పెడు గులాబీ రేకులు తీసుకుని కప్పు నీళ్లలో మరిగించి వడకట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి ఒక టీస్పూను గంధం పొడి, ఒక టీస్పూను పాలు చేర్చి ముఖం, మెడకు అప్లై చేయాలి. పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

మందారం:
గుప్పెడు మందారం పువ్వులు, 10 గులాబీ రేకులు, ఒక టేబుల్‌ స్పూను ముల్తానీ మట్టి, ఒక టేబుల్‌స్పూను పెరుగు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.

ఈ పేస్ట్‌ను ముఖం మీద అప్లై చేసి, ఆరిన తర్వాత తడిపి, వేళ్లతో రుద్దుకోవాలి. తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి.
ఈ ఫ్లవర్‌ ప్యాక్‌లను వారానికోసారి క్రమం తప్పక వేసుకుంటే ఉంటే చర్మం మచ్చలు తొలిగి, మెరుపు సంతరించుకుంటుంది.