DailyDose

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ 2 వారాలకు వాయిదా – TNI నేర వార్తలు

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ 2 వారాలకు వాయిదా   – TNI  నేర వార్తలు

*సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై.. తెలంగాణ హైకోర్టులో మళ్లీ విచారణ మొదలైంది. పూర్తిస్థాయి విచారణ జరపాలని ఈ కేసును హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు బదిలీ చేసింది. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కేసులతోపాటు.. గతంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నీ కలిపి.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం.. విచారణ చేపట్టింది. అమికస్ క్యూరీ డి.ప్రకాష్ రెడ్డి కేసు నేపథ్యాన్ని వివరించారు. షాద్ నగర్‌లోని చటాన్ పల్లి వద్ద 2019 డిసెంబరు 6న జరిగిన దిశ అత్యాచారం, హత్య అనంతరం.. నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిషన్.. ఇటీవలే నివేదిక సమర్పించిందని తెలిపారు. కమిషన్ నివేదికను సమర్పించాలని అమికస్ క్యూరీని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

*తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఆలయంలో మైక్సెట్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృతి చెందారు. సోమవారం రాత్రి వర్షం కురవడంతో తీగల్లో విద్యుత్ ప్రవహించి అకస్మాత్తుగా కరెంట్ షాక్ కొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో మృతులు ముగ్గురు.. ఒకరికొకరు అంటుకుని ఉండటంతో విద్యుత్ షాక్‌కి గురై ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలిపారు. మృతులు సుబ్బారావు(67), మస్తాన్‌రావు(57), వెంకయ్య (55)లుగా గుర్తించారు.

*జ‌గిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండ‌లం రేచ‌ప‌ల్లిలో ఎల్ల‌మ్మ చెట్ల‌తీర్థాల‌కు వెళ్లిన గ్రామ‌స్తుల‌పై తేనెటీగ‌లు దాడి చేశాయి. తేనెటీగ‌ల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మ‌రో 50 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని చికిత్స నిమిత్తం జ‌గిత్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుడి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

*మ‌హిళ‌లు, చిన్నారుల‌పై లైంగిక దాడి ఘ‌ట‌న‌ల‌కు బ్రేక్ ప‌డ‌టం లేదు. 11 ఏండ్ల బాలిక‌ను మామిడి తోట‌లోకి తీసుకువెళ్లిన ఆమె క‌జిన్ ఆపై అత్యాచారానికి పాల్ప‌డిన ఉదంతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో ఆదివారం వెలుగుచూసింది. ఇంటికి తిరిగివ‌చ్చిన త‌ర్వాత బాలిక కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

*రోడ్డు ప్రమాదం వానపాముల అక్రమరవాణను పట్టించింది. తడ మండలంలో చోటు చేసుకున్న ఈ సంఘటన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లగా వానపాముల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. తడ ఎస్ ఐ జెపి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన వివరాల మేరకు వానపాములు అక్రమంగా తరలిస్తూ కారు చెన్నై నుండి నెల్లూరు వెళ్ళు దారిలో తడ మండలం కొండూరు గ్రామం వద్ద డివైడర్ను ఢీకొట్టింది ప్రమాదం జరిగిన వాహనమును తడ పోలీస్ వారు తనిఖీలు నిర్వహించగా సుమారు 14 కేజీ వానపాములను పట్టు పడడం జరిగింది నిందితుడు తమిళనాడు గుమ్మడిపూడి తాలూకా ఎల్లావురు గ్రామానికి చెందిన విగ్నేష్ గుర్తించారు. వాపాములు సంబంధిత అటవి శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా వానపాముల అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోంది ప్రభుత్వం వానపాములను పట్టడం తరలించడం, నిషేధించింది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పులికాట్ సరస్సు పరిసర ప్రాంతాలలో వానపాములు ఎక్కువగా దొరుకుతాయి వానపాములు బయట మార్కెట్లో మంచి గిరాకీ ఉంది కొంతమంది వ్యక్తులు అక్రమ సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అధికారుల కళ్లుగప్పి వానపాముల అక్రమంగా తరలిస్తున్నారు

*మెదక్‌: జిల్లాలోని పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లిలో దారుణం జరిగింది. మహిళను హత్య చేసి దుండగులు పాతి పెట్టారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి పరిస్థితులను గమనించారు. ఆత్యాచారం చేసి చంపినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతదేహంపై బట్టలు లేకుండా ఉండడంతో ఆత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వర్షానికి మట్టికొట్టుకుపోవడంతో బయటకు శవం తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

*సంగారెడ్డి: జిల్లాలోని పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో గల బానియాన్ ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్లాస్టిక్ స్క్రాప్ రీ సైక్లింగ్ మెటీరియల్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు.

*మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అందనాలపాడులోని రామాలయం గుడికి సౌండ్ మైకులు కడుతుండగా విద్యుత్ షాక్ తగలింది. మైకులు కట్టె పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు సుబ్బరావు(67), మస్తాన్ రావు(57), వెంకయ్య (55)గా తెలుస్తోంది. ముగ్గురు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మైకులు కట్టే సమయంలో విద్యుత్ మెయిన్ లైన్ తీగలు కిందపడి ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*రాయదుర్గం లోని పబ్ అండ్ బార్‌లో యువతిపై దాడి జరిగింది. ఐటీసీ కొహినూర్ ఒట్టినో బార్‌లో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. అసలు విషయంలోకి వెళితే.. ఆదివారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ యువతి పబ్‌కు వెళ్లింది. పబ్‌లో మయాంక్ అనే వ్యక్తికి యువతి తారసపడింది. అంతకు ముందు ఆమెతో పరిచయం ఉండటంతో మయాంక్ ఆమె ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు యువతి నిరాకరించింది. యువతిపై మయాంక్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అతనిపై యువతి స్నేహితుడు బాక్సర్ విక్రం దాడికి పాల్పడ్డాడు. పబ్‌లో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సాదద్ అబ్రార్ అనే యువకుడికి గాయాలయ్యాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు అందాయి.

*ఏపీలోని గుంటూరు జిల్లా నడికుడ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొట్టడంతో తల్లీతో ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను నల్లగొండ జిల్లాకేంద్రంలోని చైతన్యపురి కాలనీకి చెందినవారుగా గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసితో నడికుడ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. మ్య (28), ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8), హంసిక (6) మృతిచెందారు. మృతదేహాలను సత్తెనపల్లి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. నడికూడ రైల్వే పోలీసులు నల్లగొండలోని ఆమె భర్త , కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సత్తెనపల్లికి తరలివెళ్లారు. ఈ సంఘటన ప్రమాదమా? ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది. పిల్లలిద్దరూ నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులోని ప్రేరణ స్కూల్లో చదువుతున్నారు.

* ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డింది. పాట్నాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2019 ఆగ‌స్టులో ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటి నుంచి ఏకే47 గ‌న్‌ను సీజ్ చేశారు. దాంతో పాటు క్యాట్రిడ్జ్‌లు, గ్రేనేడ్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్పెష‌ల్ జ‌డ్జి త్రిలోకి దూబే ఇవాళ తీర్పును వెలువ‌రించారు. అనంత్ సింగ్‌ను చోటే స‌ర్కార్ అని పిలుస్తుంటారు. అక్ర‌మ‌రీతిలో ఏకే47 గ‌న్ క‌లిగి ఉన్న కేసులో జూన్ 14వ తేదీన ఎమ్మెల్యేను కోర్టు దోషిగా తేల్చింది. ఇంటి నుంచి గ‌న్‌ల‌ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత ఎమ్మెల్యే ప‌రారీ అయ్యారు. ఆ త‌ర్వాత న్యూఢిల్లీలో పోలీసుల‌కు లొంగిపోయారు. 2005 నుంచి మోకామా సీటు నుంచి వరుస‌గా ఆయ‌న గెలుపొందారు. సీఎం నితీశ్‌కు మంచి మిత్రుడు. కానీ 2015లో జేడీయూ నుంచి అనంత్ వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆర్జేడీలో చేరారు.

*నెల్లూరు జిల్లాలోని కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గేదెను తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలోఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కావలి నుండి కొండ బిట్రగుంట వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*మంగళం తుడా క్వార్టర్స్‌లో వ్యాపారి ఏలిరెడ్డి ఇంటిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 25 గ్రాముల బంగారం ,8 డైమండ్స్, లక్షా తొంభై రెండువేలు నగదు అపహరించారు. ఇంటిలోని బ్యాటరీ, ఇన్వెర్టర్, సిలిండర్‌తో పాటు సీసీ కెమెరా రికార్డ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈనెల 7న ఏలిరెడ్డి అమ్మకు అనారోగ్యం బారిన పడడంతో కుటుంబంతో సహా వైద్యం కోసం వేలూరు సీఎంసీ‌కి వెళ్లారు. ఇంటికి చేరుకున్న ఏలిరెడ్డి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి అలిపిరి పోలీసులు, క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న అలిపిరి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

*ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ పోలీసుస్టేషన్‌పై సోమవారం గిరిజనులు దాడి చేశారు. గురుప్రియ వంతెన నిర్మాణం తరువాత పరిసర పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ మల్కన్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గోవింద పాత్రో, కార్యదర్శి మంగు కిల్లో ఆధ్వర్యంలో గిరిజనులు చిత్రకొండలో ఆందోళన చేపట్టారు. ఏడు పంచాయతీలకు చెందిన వందలాది మంది గిరిజనులు సోమవారం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. చిత్రకొండ బ్లాక్‌ డెవలెప్‌మెంట్‌ కార్యాలయంపై కూడా దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు.

*పెట్రోల్‌ ధరలు రోజురోజుకీ పైకి ఎగబాకుతుండడంతో ప్రజలు ఎలక్ట్రిక్‌ బైక్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. కానీ.. సాంకేతిక సమస్యల వల్ల ్ఞఅవి పేలిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొడుగువారిగూడెంలో బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్‌ బైక్‌ దగ్ధమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నూజివీడులో హోంగార్డుగా పనిచేస్తున్న ఒలిగర్ల నాగమల్లేశ్వరరావు ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో ప్రతిరోజూ 50 నుంచి 60 కిలో మీటర్లు తిరుగుతుంటారు. దీంతో పెట్రోల్‌ ధరల భారం భరించలేక ఈ ఏడాది ఏప్రిల్‌లో వేద్‌ మోటార్స్‌కి చెందిన రాష్‌ ఎలక్ర్టిక్‌ బైక్‌ను కొనుగోలు చేశారు.

* నెల్లూరు: జిల్లాలోని కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గేదెను తప్పించబోయి ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కావలి నుండి కొండ బిట్రగుంట వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను 108 సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*పుల్లల చెరువు మండలం కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటు చేసుకుంది. కవలకుంట్ల చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతులను బ్రమ్మారెడ్డి (14) , దస్తగిరి (14), విష్ణు కుమార్ రెడ్డి (14), నారు సాయి కుమార్ రెడ్డి(14)గా గుర్తించారు. పిల్లల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. కన్నవారి రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి.

*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో దొంగతనం చోరీకి పాల్పడి 17 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేలు ఎత్తుకెళ్లారు. జరిగిన ఈ చోరీపై ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దుండగులు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విశ్రాంత ఉద్యోగి సుందర్ రాజన్‌గా గుర్తించారు.

*రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని దుండగులు రెచ్చిపోయారు. ఓ ఇంట్లో దొంగతనం చోరీకి పాల్పడి 17 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేలు ఎత్తుకెళ్లారు. జరిగిన ఈ చోరీపై ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దుండగులు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు విశ్రాంత ఉద్యోగి సుందర్ రాజన్‌గా గుర్తించారు.

*మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు చేధించారు. భోగినే పల్లికి చెందిన మైనర్ బాలికను చియ్యేడు గ్రామానికి చెందిన యువకుడు కారులో కిడ్నాప్ చేశాడు. అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి మైనర్ బాలిక సమీప బంధువు సదానందగా తెలియవచ్చింది. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ అపహరించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన ఇటుకలపల్లి పోలీసులు.. అనంతపురం నగరం, తపోవనంలో కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులతో పాటు మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. గంట వ్యవధిలోనే కిడ్నాపర్ల నుంచి మైనర్ బాలికను కాపాడడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో పోలీసులు స్పందించడంతోనే తమ కూతురు ప్రాణాలతో బయట పడిందని తల్లిదండ్రులు అన్నారు.

*శ్రీసత్యసాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. భోగినేపల్లికి చెందిన బాలికను కొందరు దుండగులు కారులో కిడ్నాప్ చేశారు. బాలిక సమీప బంధువే కిడ్నాపర్‌గా తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ కిడ్నాపర్ అపహరించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతోపోలీసులు అప్రమత్తమయ్యారు. అనంతపురం నగరం తపోవనంలో కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులతో పాటు మైనర్ బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.