Food

ఆవకాయకు ఆఖరి అవకాశం

ఆవకాయకు ఆఖరి అవకాశం

వేసవి ముగింపునకు వచ్చింది. తొలకరి మొదలైంది. పచ్చళ్లు పెట్టు కొనేందుకు ఇదే చివరి అవకాశం. కొత్త పచ్చళ్లను ఆవురావురుమంటూ తింటున్నప్పుడు కలిగే అనుభూతే వేరు. దేశవ్యాప్తంగా ఎన్నో రకాల నిల్వ పచ్చళ్లు ఉన్నాయి. కానీ, దక్షిణ భారతదేశంలో.. అందులోనూ తెలుగు రాష్ర్టాల్లో నోరూరించే ఆవకాయల జాబితా పెద్దదే!

వేసవి పచ్చడి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆవకాయే. దీనిని ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవచ్చు, అతి తక్కువ దినుసులతో పెట్టుకోవచ్చు. కాబట్టే, మామిడికాయ పచ్చడికి అంత ఆదరణ. శనగపప్పు కూడా ఆవకాయకు కొత్త రుచిని తీసుకొస్తుంది.బెల్లం ఆవకాయ.. మరో వైవిధ్యమైన పచ్చడి. బెల్లంలోని తియ్యదనం, మామిడిలోని పుల్లదనం అందరికీ నచ్చి తీరుతుంది. కాకపోతే బెల్లం నాణ్యత బాగుండాలి. అప్పుడే బెల్లం ఆవకాయ అదుర్స్‌.

నువ్వుల మామిడి పచ్చడి. దీన్నే ‘నువ్వు ఆవకాయ’ అనీ అంటారు. నువ్వుల పొడి జోడించడంతో ఈ ఆవకాయకు కొత్త రుచి వస్తుంది.అల్లం ఆవకాయ. అల్లం, వెల్లుల్లితో కలిపి పెట్టుకునే ఈ ఆవకాయకు పెరుగన్నం అత్యుత్తమ కాంబినేషన్‌.పల్లీ ఆవకాయ. ఇది నిల్వ పచ్చడి కాదు. కానీ, ఫ్రిజ్‌లో ఉంచితే వారం వరకూ బాగానే ఉంటుంది. నాణ్యమైన పల్లీలు వాడితే.. పచ్చడి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

ఎండు మామిడి పచ్చడి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కోరుకునేవారు ఇంట్లోపెట్టుకునే పచ్చడి ఇది. ఆవకాయ ప్రియులు ఇప్పటికే మామిడికాయలు ఆరబెట్టి ఉంటారు. ఇవి గాక.. పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ వంటివి కూడా ఈ సీజన్‌లో ప్రయత్నించవచ్చు.‘వేసవి అంటేనే పచ్చళ్లు. ఇంట్లో పచ్చళ్లు పెడుతున్నప్పుడు పండుగ వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కళకళ లాడుతుంది. భోజన సమయంలో ఆవకాయ కానీ, మరేదైనా పచ్చడి కానీ వడ్డిస్తే ఎక్కడ లేని ఆనందం’ అంటారు గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా.