Health

బరువు తగ్గించే పానీయాలు!

బరువు తగ్గించే పానీయాలు!

బరువు తగ్గాలనుకుంటే నిద్ర మీద కూడా దృష్టి పెట్టాలి. కంటి నిండా నిద్ర లోపిస్తే, ఇన్సులిన్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు, ఎమోషనల్‌ ఈటింగ్‌ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ శరీర బరువును పెంచేవే! కాబట్టి కంటి నిండా నిద్రకు తోడ్పడే ఈ పానీయాలను నిద్రకు ముందు తాగుతూ ఉండాలి.

పాలు:
పాలలోని ట్రిప్టోఫాన్‌, క్యాల్షియం, కెసీన్‌ ప్రొటీన్‌లు గాఢ నిద్రలోకి జారుకునేటందుకు దోహదపడతాయి. కెసీన్‌ జీర్ణప్రక్రియను నెమ్మదింపజేసి గాఢ నిద్రలో ఉండగా కండరాల నిర్మాణానికి తోడ్పడతుంది. ఫలితంగా పరోక్షంగా కండరాలు బలపడి, ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది.

ద్రాక్ష రసం:
గాఢ నిద్ర పట్టడంతోపాటు, నిద్రావస్థలో కొవ్వు కరిగేలా చేసే గుణం ద్రాక్ష రసానికి ఉంది. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో ఇన్సులిన్‌ స్రావాన్ని క్రమపరిచి, శరీర గడియారం కరెక్టుగా పని చేసేలా తోడ్పడతాయి.

దాల్చిన చెక్క తేనీరు:
దాల్చిన చెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లు ఉంటాయనే విషయం మనకు తెలుసు. నిద్రకు ముందు ఈ చెక్క పొడితో తయారుచేసిన తేనీరు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. అలాగే శరీరంలోని మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. దాంతో కూడా శరీర బరువు తగ్గుతుంది.

మెంతుల నీళ్లు:
మెంతులు నానబెట్టిన నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరిగి, బరువు పెరగకుండా ఉంటాం! బరువు తగ్గడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థ మెరుగైన పనితీరు కోసం కూడా మెంతుల నీళ్లు తాగాలి. అయితే నిద్రకు అరగంట ముందు తాగినప్పుడే ఈ ప్రయోజనాలు దక్కుతాయి.