DailyDose

బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్.వి.ప్రసాద్

Auto Draft

తెలుగు సినీనిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్ధి చెందిన ఎల్.వి.ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో జనవరి 17,1908న జన్మించారు. ఎల్.వి.ప్రసాద్ గా పరిచితుడైన ఇతని పూర్తిపేరు అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు.

ఎల్వీ ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో దర్శకత్వం, నిర్మాతగా, నటుడిగా 50 చిత్రాల వరకు చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించడం విశేషంగా చెప్పవచ్చు. గృహప్రవేశం సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. ఈ చిత్రంలో భానుమతి సరసన హీరోగా నటించారు. 1950లో నాగిరెడ్డి, చక్రపాణిలు స్థాపించిన “విజయా సంస్థ” నిర్మించిన తొలిచిత్రం షావుకారుకు కూడా ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇతను దర్శకత్వం వహించిన మిస్సమ్మ, గృహప్రవేశం, షావుకారు, అప్పుచేసి పప్పుకూడు, పెళ్ళిచేసి చూడు లాంటి జనాదరణ పొందాయి. 1980లో 27వ నేషనల్ ఫిలిం అవార్డుల సెలెక్షన్ కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు.

ఆయన సినీరంగానికి చేసిన సేవలకు గాను భారత తపాలాశాఖ 2006లో ఆయన ముఖచిత్రంతో తపాలాబిళ్ళ విడుదల చేసింది. “ది క్లయింట్” లఘుచిత్రానికి 1970లో చికాగో ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు పొందారు. 1978-79లో తమిళనాడు ప్రభుత్వం నుంచి రాజాశాండో మెమోరియల్ అవార్డు, 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తొలి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. 1982లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొంది ఈ ఘనత పొందిన మూడవ తెలుగు వ్యక్తిగా కీర్తి పొందారు. 22 జూన్,1994న మరణించారు. ఆయన పేరిట హైదరాబాదులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, స్థాపించారు

ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి 1987లో హైదరాబాదులో స్థాపించబడింది.ఇది లాభాపేక్ష లేని, ప్రభుత్వేతర నేత్ర వైద్యశాల. సమాజంలోని అన్ని వర్గాలకు సమానమైన , సమర్థవంతమైన కంటి సంరక్షణ LVPEI సంస్థ యొక్క లక్ష్యం. ఈ సంస్థ 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్సిస్ట్యూట్‌గా మొదలై అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

వైద్య సేవలు

LVPEI సుమారు 23.8 మిలియన్ల ప్రజలకు తన సేవలనందించింది. అందులో 50% ఉచితంగా, సంక్లిష్టతతో సంబంధం లేకుండా అవసరమైన వైద్యాన్ని అందించింది.అనేక ప్రాంతాలలో దీని శాఖలు ప్రారంభించి సమాజానికి సేవలను అందిస్తుంది.

పరిశోధనలు
2012 జూన్ 1 న, LVPEI పరిశోధన అధిపతి ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యన్ చెప్పిన ప్రకారం జన్యు కణజాల లోపాలను సరిచేయడానికి జన్యు చికిత్స ఉంది, కంటికి జన్యు డెలివరీ 1-2 సంవత్సరాలలో జరుగుతుంది