DailyDose

28న ఫ్రాన్స్‌కు సీఎం జగన్

28న ఫ్రాన్స్‌కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 28న ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్నారు. తన పెద్ద కుమార్తె హర్ష.. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (ఎంబీఏ) పూర్తి చేసుకోవడంతో.. గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని సీఎంవో తెలియజేసింది. 28వ తేదీ రాత్రి సీఎం జగన్‌ బయల్దేరనున్నారు. 29న ప్యారిస్‌కు చేరుకుంటారు. కుమార్తె గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న తర్వాత.. జులై 2న తిరుగు ప్రయాణమవుతారు.