Politics

ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదు – TNI రాజకీయ వార్తలు

ప్రజా ప్రభుత్వాలు ఉండటం మోడీకి ఇష్టం లేదు  – TNI రాజకీయ వార్తలు

* ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. BJP నేతలు తమ వైఖరి, కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రపంచ దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారని విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడితన తలసాని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు.దేశం సర్వనాశం అవ్వాలని బీజేపీ కోరుకుంటుందని, ఇలాంటి పరిణామాలు దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తున్నారని, మోడీ, అమిత్ షా లు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు.

*తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి మల్లారెడ్డి
తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో రూ.75 లక్షల 30 వేలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల రోడ్లు లేకుండా గ్రామాల్లో, పట్టణాలలో సీసీ, బీటీ రోడ్లను నిర్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిని నిర్వహించి పల్లెలు, పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుకున్నామని చెప్పారు.ప్రజలు ఇబ్బందులు పడకుండా మార్కెట్‌లను, వైకుంఠధామాలను, పార్కులను అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, హరితహారంతో గ్రామాలు, పట్టణాలు పచ్చటి తోరణాలుగా దర్శనం ఇస్తున్నాయని తెలిపారు.పలు వార్డులలో మంత్రి మొక్కలను నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్‌ ఎ.వాణిరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

*ఏపీని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం: Alapatii raja
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసపూరిత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలో చేసే పనులకు పొంతన లేదన్నారు. మద్యం నిషేధంపై జగన్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పారని… మద్యపాన నిషేధం అంశం ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్‌లతో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 24/7 మద్యం ఏపీలో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందని అన్నారు. మద్యంతో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మద్యం ద్వారా మగాళ్లను దోచుకుని మహిళలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యంపై అప్పులు తేవడం సిగ్గు చేటన్నారు. రాష్టాన్ని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయంపై ప్రభుత్వం దొంగ లెక్కలు చూపుతోందని ఆలపాటి రాజా అన్నారు.

*కేసీఆర్ ను గద్దెదించేది మేమే: mla Etela
తెలంగాణలో వచ్చే బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్‌ను మేమే గద్దె దించుతామని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ శవ రాజకీయాలకు తెర లేపారని ఆయన విమర్శించారు. పంజాబ్ రైతులకు డబ్బులిచ్చారు. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్ని నాటకాలు ఆడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థతి లేదని ఆయన అన్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈటల స్పష్టం చేశారు.

*ఏపీ సీఎం మొండివైఖరి సరికాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులంటూ ఏపీ సీఎం మొండివైఖరీని అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్ విశ్వం ఆరోపించారు. అమరావతే రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరులో నిర్వహిస్తున్న ధీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్ ఆధునిక తుగ్లక్గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.అమరావతిని రాజధానిగా నిర్మించే వరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకుని అమరావతిని నిర్మించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి గౌరవించడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జగన్‌ మూడేండ్ల పాలనలలో రాయలసీమ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని ఆరోపించారు.

*అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తాం: మంత్రి Botsa
ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించామని అవసరమైతే డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్లో వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. 884 హై స్కూల్స్‌ను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామన్నారు. వాటిల్లో ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 679 మండలాల్లో ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలికల కోసం ప్రత్యేక జూనియర్ కాలేజ్ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

*ఏపీని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం: Alapatii raja
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసపూరిత పాలన చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు అధికారంలో చేసే పనులకు పొంతన లేదన్నారు. మద్యం నిషేధంపై జగన్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్పారని… మద్యపాన నిషేధం అంశం ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్‌లతో మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 24/7 మద్యం ఏపీలో అన్ని చోట్ల అందుబాటులో ఉంటుందని అన్నారు. మద్యంతో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. మద్యం ద్వారా మగాళ్లను దోచుకుని మహిళలకు సంక్షేమ పధకాలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. మద్యంపై అప్పులు తేవడం సిగ్గు చేటన్నారు. రాష్టాన్ని మద్యం మత్తులో ముంచాలని జగన్ పధకం చేస్తున్నారని ఆరోపించారు. ఆదాయంపై ప్రభుత్వం దొంగ లెక్కలు చూపుతోందని ఆలపాటి రాజా అన్నారు.

*హాఫ్ టికెట్ జగన్ ఏం చదవాడో ఎవరూ చెప్పరే: Anam
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతనిధి ఆనం వెంకటరమణారెడ్డి విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ‘‘హాఫ్ టికెట్ జగన్ మోహన్ రెడ్డి ఏం చదివాడో చెప్పమంటే ఒక్కరూ నోరు మెడపడంలేదు. జగన్ పది కూడా పాసయ్యాడో.. లేదో? ఇంటర్ ఫెయిలయ్యాడు. చదువురాని పప్పు.. జగన్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ చేసే కాకాణికి టీడీపీ నేత లోకేష్ చదువు తెలుసా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో అమెరికాలో లోకేష్‌కు ఇచ్చిన ఎంబీఏ సర్టిఫికెట్‌ను మీడియాకు ఆనం విడుదల చేశారు. ఆత్మకూరు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లేకుండానే అధికార పార్టీకి చమటలు పట్టాయన్నారు. 16 మంది మంత్రులు, 22 మంది ఎమ్మెల్యేలు ఆత్మకూరు ఉపఎన్నికలకు చమటోడ్చారని తెలిపారు. ‘‘కౌంటింగ్ రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు నెల్లూరుకి రావాలని కోరుతున్నాను. లక్ష ఓట్లు మెజార్టీ వస్తే… పొట్టేళ్లు కోసి మా ఇంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భోజనం పెడుతా’’ అంటూ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు.

*ఆ డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలి: Bandi Sanjay
యాసంగి వడ్ల కొనుగోలు డబ్బు రైతులకు వెంటనే చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లోనే రైతుల నుంచి కొన్న వడ్లకు రూ.517.16 కోట్లను ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్షించి పరష్కరించాలని, ఖరీఫ్‌లో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సకాలంలో అందజేయాలని డిమాండ్ చేశారు.

*50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదు.. ఇప్పుడేం చేస్తారు?: కేటీఆర్
జహీరాబాద్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి కేటీఆర్పే ర్కొన్నారు. జహీరాబాద్‌లోని బాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ పనిచేసిన గీతారెడ్డి కి మంత్రి పదవి వచ్చింది కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ మొన్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్స్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాడన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. 65 ఏళ్ళ నుంచి పలు పార్టీలు చేసిన గబ్బును, దరిద్రాన్ని ఇప్పుడిప్పుడే వదల గొడుతున్నామన్నారు. సాగు నీరు, తాగు నీరు, వైద్యం ఇలాంటి పనులు చేసుకుంటూ మనం పోతుంటే.. కొంతమంది కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

*నాకు భద్రత కావాలి… ఎందుకంటే…: ఎంపీ రఘురామ కృష్ణంరాజు
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కలిశారు. తన నియోజకవర్గానికి నాల్గోవ తేదీ ప్రధానమంత్రి మోడీ రాక సందర్భంగా తాను వెళ్లాల్సి ఉంటుందని ఆయన హోంశాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తనకు కావలసిన భద్రతను కల్పించే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిన్న విశాఖపట్నంలో కమిటీ మీటింగ్ కు వెళ్లాలనుకుంటే రనివ్వలేదన్నారు. ప్రధానమంత్రి సభ తన నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి అవుతారని అంబేద్కర్ ముందే ఊహించలేదని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితులు శాంతిభద్రతల అంశంలో ఇలాగే ఉంటే లా అండ్ ఆర్డర్ అంశం ఉమ్మడి జాబితాలో చేర్చాల్సి ఉంటుందన్నారు.

*ఆ భూములు రాష్ట్రానికి అప్పగించాలి: తమ్మినేని
రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వాటిని పునరుద్దరించాలని, లేదా ఆ స్థలాల్లో కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని, వీలు కాకుంటే ఆ స్థలాలను తిరిగి ఇచ్చివేయాలని కోరారు. మూసివేసిన ఐడీపీఎల్‌, హెచ్‌ఏఎల్‌, హెచ్‌ఎంటీ, హెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఎల్‌, సీసీఐ లాంటి సంస్థల ఏర్పాటుకు 7,200 ఎకరాల భూమిని రాష్ట్రం కేటాయించిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఈ సంస్థలను ఉద్దేశపూర్వకంగా మూసేసి వాటి ఆస్తులు, భూములను కారుచౌకగా అమ్ముకునేందుకు కేంద్రం సిద్ధపడుతోంందని ఆరోపించారు. ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజల సంపద అని, రూ. వేల కోట్ల విలువైన ఈ భూములను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ప్రతిఘటించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

*బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్: Harish rao
బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వైద్యం అందట్లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం మంథనిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం సభలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… బీజేపీది డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ పథకంతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఏమి లేదన్నారు. సికింద్రాబాద్ ఘటన కేసీఆర్ చేయించారని బీజేపీ నేతలు అంటున్నారని… మరి ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్ తగులబెట్టారు అక్కడ ఏ ప్రభుత్వం ఉంది అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.

*రాహుల్‌ను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారు: Uttam
కావాలనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని ఈడీ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులకు బీజేపీ దిగుతోందన్నారు. ఏ మాత్రం కూడా కాంగ్రెస్ నేతలు ఇలాంటి బెదిరింపులకు భయపడరని ఆయన పేర్కొన్నారు. ఇటీవల దేశంలో ఉత్పన్నమైన కోవిడ్ పెద్ద నోట్ల రద్దు అంశాలన్నీ రాహుల్ గాంధీ లేవనెత్తారని గుర్తు చేశారు. బీజేపీ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎంపీ ఉత్తమ్ విమర్శించారు.

*ఐటీసీ కోహినూర్ పబ్‌లో జరిగింది ఇది: విష్ణు
టీసీ కోహినూర్ పబ్ వ్యవహారంలో విచారణ కొనసాగుతుంది. రాయదుర్గం పీఎస్‌కు బాధిత యువతి, విష్ణు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడిందని విష్ణు పేర్కొంది. అలాగే తన స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొంది. ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లామని విష్ణు తెలిపింది. తమతో ఉన్న అమ్మాయి మ్యూచ్‌వల్ ఫ్రెండ్‌ తన స్నేహితులతో పబ్‌కు వచ్చిందని వెల్లడించింది. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు.. వారిని అడ్డుకున్నానని విష్ణు పేర్కొంది. తమను అడ్డుకుంటే తన ఫ్రెండ్‌ను రేప్ చేస్తామని బెదిరించారని చెప్పింది. తన తలపై బీర్ బాటిల్‌తో దాడి చేశారని విష్ణు తెలిపింది. తనపై దాడికి పాల్పడినవారు పలుకుబడి ఉన్నవారి పిల్లలని పేర్కొంది. దాడిపై పబ్ సిబ్బంది రిక్వెస్ట్‌తో ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. తమపై దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని విష్ణు పేర్కొంది.

*ఖాళీలను భర్తీ చేయాలి: వైఎస్ షర్మిల
అనంతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పడంతో యువత పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొందని, అయితే ఇప్పుడు ఉద్యోగాలు లేక వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను కేసీఆర్ భ్రష్టు పట్టిస్తున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు. ఇచ్చారా? అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

*‘అగ్నిపథ్‌’ని ఉపసంహరించాలి: అసద్‌
అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ డిమాండ్‌ చేశారు. ఆ పథకం ద్వారా.. దేశసేవ చేయాలనుకునే యువత లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారనే ఆవేదన కలుగుతోందన్నారు. డ్రైవర్‌, కార్పెంటర్‌ ఉద్యోగాల కోసం సైన్యంలో ఎందుకు చేరుతారని ఆయన ప్రశ్నించారు. దేశ భద్రతతో మోదీ ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విమర్శించారు.

*ఎస్సీ, ఎస్టీలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు: శిరీష
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఆ వర్గాలకు ప్రతి పథకంలోనూ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ వర్గాల వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పథకం అమలుకు వంద ఆంక్షలు పెడుతున్నారు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నగరాలు, పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు తమకు ప్రత్యేకించిన కాలనీల్లో ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి హయాం లో ప్రతి సంక్షేమ పథకం కత్తెర పథకంగా మారిపోయిందని విమర్శించారు. పథకాలు అందని ప్రజలు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారన్నారు.

*కారుణ్య నియామకాలపై ఆదేశాలివ్వండి: ఎమ్మెల్సీ కత్తి
కొవిడ్‌తో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు జాప్యం లేకుండా కారుణ్య నియామకాలపై ఆదేశాలు జారీచేయాలని ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం తాడేపల్లిలో సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెలాఖరులోపు నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా అమలుకావడం లేదని తెలిపారు. పాఠశాల విద్య, ఎయిడెడ్‌, మున్సిపల్‌, మోడల్‌ స్కూల్స్‌ తదితర సంస్థల్లో అవసరమైన ఖాళీలు లేనందున, ఇతర శాఖల్లో నియామకాలకు అవకాశం ఇవ్వాలని కోరారు.

*ఎస్సీ, ఎస్టీలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు: శిరీష
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ఆ వర్గాలకు ప్రతి పథకంలోనూ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ వర్గాల వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొన్నారు. ఇప్పుడు ఆ పథకం అమలుకు వంద ఆంక్షలు పెడుతున్నారు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నగరాలు, పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలు తమకు ప్రత్యేకించిన కాలనీల్లో ఉండటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి హయాం లో ప్రతి సంక్షేమ పథకం కత్తెర పథకంగా మారిపోయిందని విమర్శించారు. పథకాలు అందని ప్రజలు ప్రశ్నిస్తే రాజద్రోహం కేసు పెడుతున్నారన్నారు.

*అగ్నిపథ్‌తో దేశభద్రతకు ముప్పు: నారాయణ
దేశభద్రతకు హాని కలిగించే విధంగా కేంద్రం అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ మంగళవారం తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ సర్కారు డబ్బుతో మిలటరీ శిక్షణ పూర్తిచేసిన యువకులను నాలుగేళ్ల తరువాత ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకొనే ఆలోచన కేంద్రానికి ఉందని తెలిపారు. అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనల్లో మరణించినవారి కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పొట్టకూటి కోసం యువకులు ఆందోళన చేస్తే, వారిపై కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. యువతపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా, అగ్నిపథ్‌ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న యువతపై పెట్టిన కేసులపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. బెయిల్‌ కోసం గుంటూరు జిల్లాకోర్టుకు వచ్చిన ఆర్మీ అభ్యర్థుల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

*ఆ భూములు రాష్ట్రానికి అప్పగించాలి: తమ్మినేని
రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను తెగనమ్మే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. వాటిని పునరుద్దరించాలని లేదా ఆ స్థలాల్లో కొత్త పరిశ్రమలను ప్రారంభించాలని వీలు కాకుంటే ఆ స్థలాలను తిరిగి ఇచ్చివేయాలని కోరారు. మూసివేసిన ఐడీపీఎల్‌ హెచ్‌ఏఎల్‌, హెచ్‌ఎంటీ, హెచ్‌సీఎల్‌, డీఆర్‌డీఎల్‌, సీసీఐ లాంటి సంస్థల ఏర్పాటుకు 7,200 ఎకరాల భూమిని రాష్ట్రం కేటాయించిందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఈ సంస్థలను ఉద్దేశపూర్వకంగా మూసేసి వాటి ఆస్తులు, భూములను కారుచౌకగా అమ్ముకునేందుకు కేంద్రం సిద్ధపడుతోంందని ఆరోపించారు. ఆ ఆస్తులు రాష్ట్ర ప్రజల సంపద అని, రూ. వేల కోట్ల విలువైన ఈ భూములను అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టాలని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా ప్రతిఘటించాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.