DailyDose

రేపు చంచల్‌గూడ జైలుకు.. రేవంత్‌రెడ్డి – TNI తాజా వార్తలు

రేపు చంచల్‌గూడ జైలుకు.. రేవంత్‌రెడ్డి  –  TNI  తాజా వార్తలు

* సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ములాఖత్‌ అయ్యేందుకు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం చంచల్‌గూడ జైలుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. వారి కోసం అడ్వకేట్‌లను కూడా నియమించన్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అదే విధంగా అగ్నిపథ్‌ స్కీంకి వ్యతిరేకంగా ఈ నెల 27న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

*ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్డై రెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు ఆయనే ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల కాలానికి రణదీప్ గులేరియా 28 మార్చి 2017న ఎయిమ్స్‌ డైరెక్టర్‌గా నియామకమయ్యారు. గురువారం నుంచి మూడు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించగా.. ఈ లోపు కొత్త డైరెక్టర్‌ను నియమించనున్నారు.

*పోలీసులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఏపీలో పలు అనర్థాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులో అక్రమ క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీకి లేఖ రాశారు.అధికార పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో జూదం, క్యాసినో కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.
సంక్రాంతి సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని గుడివాడలో నిర్వహించిన అక్రమ క్యాసినోపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినో నేరస్థులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవటం వల్లే కంకిపాడులో మరో క్యాసినో నిర్వహించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

*సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ బుధవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

* ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటీ, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. హైద‌రాబాద్ మురుగునీటి పారుద‌ల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు. ఎస్‌టీపీల నిర్మాణాల‌కు రూ. 8,654.54 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్య‌యంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాల‌ని విన‌తి చేశారు. హైద‌రాబాద్‌లో వ్య‌క్తిగ‌త రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు స‌హ‌క‌రించాల‌ని కేంద్ర‌మంత్రిని కేటీఆర్ కోరారు.

* ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. చ‌లికాలంలో గాలి కాలుష్యాన్ని త‌గ్గించేందుకు భారీ వాహ‌నాలు, ట్ర‌క్కుల‌పై నిషేధం విధించింది. ఈ ఏడాది అక్టోబ‌ర్ నుంచి 2023, ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఆ వాహ‌నాల‌ను ఢిల్లీలోకి అనుమ‌తించ‌బోమ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. గ‌త కొద్ది సంవ‌త్స‌రాల నుంచి చ‌లికాలంలో ఢిల్లీలో గాలి నాణ్య‌త పూర్తిగా ప‌డిపోతున్న సంగ‌తి తెలిసిందే.

* వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐపీఎల్‌ కు సర్వం సిద్ధమైంది. మినీ ఐపీఎల్‌గా భావించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆటగాళ్ల వేలం రేపటి నుంచి మొదలవుతుంది. గురువారం జరిగిన ఒక సమావేశంలో ఫ్రాంచైజీ లోగోలను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆవిష్కరించింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ జూలై 6 నుంచి 17 వరకు కొనసాగనున్నది.

*దివంగత పీజేఆర్పే రు తెలియని వారు ఎవరూ ఉండరని, పేదలకు పెద్దన్న పీజేఆర్ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్‌తో వెలిశాయన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనుకాడలేదని, చివరి శ్వాసవరకు పీజేఆర్ పేదల కోసం పని చేశారని కొనియాడారు. పీజేఆర్ పోరాటం వల్లనే కృష్ణాలో వాటా దక్కిందన్నారు. జంట నగరాలకు కృష్ణా వాటర్ కోసం ఆయన పోరాటం చేశారని, కొందరు తమ ఘనతగా ఇప్పుడు గొప్పలు చెప్పు కొంటున్నారని అన్నారు.

*వచ్చేనెల 17వ తేదీన జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ఆ దేశించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బాటానుండి రాంగోపాల్ పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన VDCC రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉత్సవాల నాటికి అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని చెప్పారు.

*సిద్ధాంతాలని బలిపెట్టి, అధికారం కోసం అర్రులు చాస్తే అది మూన్నాళ్ళ ముచ్చటగానే మిగులుతుందని ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ’ రుజువు చేసిందని బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. లోక కల్యాణానికి మూలమైన హిందూ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఉద్ధవ్తం డ్రి బాల్ థాకరే గారు శివసేన పార్టీ స్థాపించారని ఆమె ప్రస్తావించారు. మహారాష్ట్ర లో కాంగ్రెస్ , ఎన్సీపీ లతో కలసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న శివసేన పార్టీలో చోటు చేసుకున్న తిరుగుబాటు పరిణామం ఎంతమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదని అన్నారు. సీఎం ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేనలో రెబెల్ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఫేస్‌బుక్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

*మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మూడోసారి కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు బుధవారం నిర్ధారించారు. ముత్తంశెట్టికి కరోనా సోకడం ఇదో మూడోసారి. వైద్యాధికారుల సూచన మేరకు సీతమ్మధారలోని స్వగృహంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా అత్యవసరమైతే ఫోన్‌లోనే సంప్రదించాలని ముత్తంశెట్టి సూచించారు. ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించి, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

* ఆత్మకూరులో ఉపఎన్నికకు పోలింగ్‌ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరగనుంది. ఈ నెల 26న ఫలితాలు వెలువడుతాయి.మాజీ మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 14 మంది అభ్యర్ధులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు.

* తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 75,472 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 38,335 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

*కాకినాడలో పేరుగాంచిన 52 ఏళ్ల ఐడీఎల్ కాలేజీని మూసివేశారు. జులై 1 నుంచి కాలేజీ మూసివేస్తున్నట్లు కరస్పాండెంట్‌ చిరంజీవినీ కుమారి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానంతో విద్యాసంస్థలు నష్టపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీల ఆర్థిక పరిస్థితి అధ్యయనం చేయకుండా.. ఏపీ ప్రభుత్వం గ్రాంటు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులోని ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వం బదిలీ చేయడంపై మండిపడుతున్నారు.

*దంతేవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు. గంట పాటు మావోయిస్టులు కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. దర్భ డివిజన్ మలంగేర్ ఏరియా బైలాడిల్లా కొండ కింద హీరోలి గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యాంపుపై మావోలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. దాడిని ఏఎస్పీ రాజేంద్ర జైస్పాల్ ధ్రువీకరించారు.

*దుల్హన్‌ పథకం పై ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దుల్హన్‌ పథకాన్ని నిలిపివేస్తున్నట్లు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందులతో పథకం నిలిపివేశామని తెలిపింది. ముస్లిం యువతుల వివాహానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేది. ఆ ఆర్థిక సాయాన్ని రూ.లక్షకు పెంచుతామని గత ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చారు. జగన్‌ ప్రభుత్వం హామీ విస్మరించిందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నేత షిబ్లి ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. వైసీపీ ప్రభుత్వం స్కీమ్‌ అమలు చేయడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పథకం అమలుకు డబ్బులు లేవని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు. అఫిడవిట్లపై రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌ తరుఫు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

*ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గడం అవాస్తవమని తెలిపారు. అటెండన్స్ ఆధారంగా లబ్ది చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రెండు వేల రూపాయిలు కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. ఉపాధ్యాయ కొరతపై ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని బొత్స వెల్లడించారు. స్కూల్స్, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

*ఇంటర్ ఫలితాలు గత ఫలితాలు కంటే మెరుగ్గానే ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ ఒడి లబ్ధిదారుల సంఖ్య తగ్గడం అవాస్తవమని తెలిపారు. అటెండన్స్ ఆధారంగా లబ్ది చేకూరుతుందన్నారు. పిల్లలను సక్రమంగా స్కూల్‌కి పంపితేనే పథకం వర్తిస్తుందన్నారు. రెండు వేల రూపాయిలు కోత అనేది పాఠశాల నిర్వహణ కోసం ఖర్చు చేస్తామన్నారు. ఉపాధ్యాయ కొరతపై ఆయా సంఘాలతో చర్చలు జరుపుతామని బొత్స వెల్లడించారు. స్కూల్స్, కాలేజీల్లో అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

*హెచ్‌ఎండీఏ మరో భారీ లేఅవుట్‌ వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రూ.1000 కోట్ల ఆదాయమే లక్ష్యంగా లేఅవుట్‌ను చేపట్టనుంది. నగర శివారులో అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉన్న నిజాంపేటలోని బాచుపల్లిలో సిద్ధం చేస్తున్న ఈ లేఅవుట్‌కు అనూహ్యమైన డిమాండ్‌ ఉంటుందని భావిస్తోంది. బాచుపల్లి రెవెన్యూ పరిధిలో 38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని లేఅవుట్‌ అభివృద్ధి కోసం రెవెన్యూ అధికారులు హెచ్‌ఎండీఏకు అప్పగించారు. లేఅవుట్‌ పనులు తుది దశకు చేరగానే ప్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉత్తరాన ఉన్న నిజాంపేట, బాచుపల్లి, కొంపల్లి ప్రాంతాల్లో భూములకు అత్యధిక డిమాండ్‌ ఉంది. నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్‌ ప్రాంతాలు ఆవాసాలకు అనువైనవి. ఇవి అనతికాలంలోనే గణనీయంగా అభివృద్ధి చెందాయి.

* రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ జూలై 15 నాటికి ఒక జత, ఆగస్టు 15 నాటికి రెండు జతల యూనిఫాం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యాశాఖ జిల్లాల వారీగా సమర్పించిన వివరాల ప్రకారం మొత్తం 26,79,497 మంది విద్యార్థులకు యూనిఫాం అందించవలసి ఉందని వివరించింది.

*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ కల్పనకు అధ్యయనంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్తోంది. జూలై రెండో వారం తర్వాత మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పాటు పర్యటించనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ‘టర్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌’ కు అనుగుణంగా బీసీ కమిషన్‌ అధ్యయనం చేపట్టింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్‌ వెళ్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌లో ప్రస్తుత స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించారు. అయుతే అక్కడ ఏ రకంగా సర్వే చేశారు? డేటా ఎలా సేకరించారు? తదితర అంశాలపై తెలంగాణ బీసీ కమిషన్‌ వివరాలు సేకరించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి ప్రామాణికాలు, విధివిధానాలపై ఆయా రాష్ట్రాల అధికారులతో తెలంగాణ బీసీ కమిషన్‌ చర్చిస్తోంది. తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో తెలంగాణ బీసీ కమిషన్‌ పర్యటించనుంది.

*కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి అధికమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలకు వైద్య శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాల్లో కరోనా ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ నిర్వహణ వంటి నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు, రాష్ట్రంలో వరుసగా రెండోరోజూ 400కు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బుధవారం 27,754 కరోనా పరీక్షలు చేయగా 434 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. వీటిలో 292 కేసులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రంగారెడ్డిలో 71, మేడ్చల్‌లో 28 కేసులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2680 యాక్టివ్‌ కేసులున్నాయి

*అణగారిన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా దళితశక్తి ప్రోగ్రాం (డీఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ విశారదన్‌ మహరాజ్‌ చేపట్టిన స్వరాజ్య పాదయాత్ర వందవ రోజుకు చేరింది. తొమ్మిది జిల్లాలు చుట్టి వచ్చి ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో కొనసాగిస్తున్నారు. వంద రోజుల్లో ఆయన 1820 కి.మీల దూరాన్ని పూర్తి చేసుకున్నారు. పాదయాత్రలో దళితశక్తి ప్రోగ్రాం కార్యకర్తలతో కలిసి దళితులు, మైనార్టీలు, బీసీ, గిరిజనులలోని విద్యావంతులు, ఇతరులతో చర్చిస్తున్నారు. సామాజిక సమస్యలను పరిశీలిస్తూనే వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు 18 నుంచి 25 కి.మీల మేర నడుస్తూ దళితవాడల్లోనే బస చేస్తున్నారు. మొత్తం 10వేల కి.మీల పాదయాత్ర జరిపే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మొదలు పెట్టిన విశారదన్‌ పాదయాత్ర వనపర్తి, గద్వాల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణఖేడ్‌, వికారబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలోని రెంజల్‌ మండలంలో కొనసాగుతోంది.

*నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రేటర్‌లో పవర్‌ కట్‌ సమస్యలు పెరిగాయి.బుధవారం 45ప్రాంతాల్లో నిర్వహణ పేరుతో రెండు మూడు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. సమాచారం ఇవ్వకుండా విద్యుత్‌ కోతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుల్తాన్‌బజార్‌ కేంద్రీయ సదన్‌, సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ప్రాంతం, మలక్‌పేట, ఇందిరాపార్కు, బల్కంపేట, బేగంపేటతోపాటు సుమారు 50కి పైగా సబ్‌స్టేషన్ల పరిధుల్లో చెట్లకొమ్మల నరికివేత, మరమ్మతుల పేరుతో మూడు గంటలపాటు పవర్‌ కట్‌ విధించారు. బాచుపల్లి, కూకట్‌పల్లి, కొండాపూర్‌, గోపన్‌పల్లి జర్నలి్‌స్టకాలనీ తదితర ప్రాంతాల్లో తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

*ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 131 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బస్తీ దవాఖానాలపై మంత్రి బుధవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 259 బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయన్నారు. మొత్తం 390 దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలన్నారు. ఇప్పటికే సిద్థమైన 12 బస్తీ దవాఖానాలు త్వరగా ప్రారంభించాలని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారాను బస్తీ దవాఖానాల సేవలందించాలని, టెలి కన్సల్టేషన్‌ సేవలనూ పెంచాలన్నారు. టీ డయాగ్నొస్టిక్‌ సహకారంతో ఎక్కడిక్కడే శాంపిళ్ల సేకరణ జరగాలని, రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని సూచించారు. ఒకవైపు బస్తీ దావాఖనాలు, మరో వైపు టి డయాగ్నొస్టిక్‌ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు ఉచిత మందులు ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పుతుందని చెప్పారు.

*రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులు చదివిన విశ్వవిద్యాలయాల గుర్తింపు, ధ్రువపత్రాల పరిశీలనకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఇంటర్‌ బోర్డు ఏర్పాటు చేసింది. అంబేద్కర్‌ వర్సిటీ మాజీ రిజిస్ర్టార్‌ వెంకయ్య, రాజశేఖర్‌ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్‌ జీబీ రెడ్డిలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే మంగళవారం ఒకసారి సమావేశమైన కమిటీ ఈ నెల 27న మరోమారు భేటీ అవనుంది.

*ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తన కుమార్తె హర్షారెడ్డి కళాశాల స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌ వెళ్లడానికి సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిఇచ్చింది. ఈ నెల 28 నుంచి వారం రోజులు అనుమతి కావాలన్న ఆయన అభ్యర్థనను మన్నించింది. ఈ మేరకు బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు వెలువరించారు.

*మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సోమవారం ఆమెకు కుడి మోకీలు మార్పిడి చికిత్స జరిగింది. మూడు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమెను బుధవారం ఇంటికి పంపించారు. అంతకుముందు ఆస్పత్రిలో శోభను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు.

* ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూమిలో సర్వే చేసి డిజిటల్‌ మ్యాపింగ్‌ చేయాలని గతంలో తాము ఆదేశాలు జారీచేసినా పట్టించుకోలేదని భువనగిరి కలెక్టర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామలింగంపల్లిలోని సర్వే నంబర్‌ 208, 312లోని 768 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని.. వాటిని కాపాడాలని తుర్కపల్లికి చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా తాము ఆదేశించిన విధంగా చర్యలు తీసుకోలేదని.. రిపోర్ట్‌ దాఖలు చేయలేదని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వడానికి భువనగిరి కలెక్టర్‌ ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశిస్తూ.. విచారణను వచ్చేనెల 20కి వాయిదా వేసింది.

*మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మూడోసారి కొవిడ్‌ వైరస్‌ బారినపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు బుధవారం నిర్ధారించారు. ముత్తంశెట్టికి కరోనా సోకడం ఇదో మూడోసారి. వైద్యాధికారుల సూచన మేరకు సీతమ్మధారలోని స్వగృహంలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా అత్యవసరమైతే ఫోన్‌లోనే సంప్రదించాలని ముత్తంశెట్టి సూచించారు. ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించి, జాగ్రత్తగా ఉండాలని కోరారు.

*ఇంటర్‌ బోర్డు బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థులు విజయభేరి మోగించారని సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో ఏ. హేమలత(984), జీ. యశ్వంత్‌(982), కే. హర్షవర్థన్‌(982), ఎండీ. సుభాని(981), పీ. శివతేజ(990) మార్కులు సాధించారని తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ఎం. కవిత, కేహెచ్‌. వర్ధన్‌చౌదరి(464), జీ. జితేంద్రమోహన్‌, డీ. రమేష్‌, కేఎన్‌ఎన్‌ఎంహెచ్‌ శశాంక్‌(462) మార్కులు సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 100 మంది 450పైగా మార్కులు సాధించారని, ద్వితీయ సంవత్సరంలో 50 మంది 970కిపైగా మార్కులు కైవసం చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులను విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య , ప్రిన్సిపాల్స్‌ జీ. మోహనరావు, వై. వెంకటేశ్వరరావు అభినందించారు.

*పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీపీజీసెట్‌-2022) షెడ్యూలు విడుదలైంది. యోగి వేమన యూనివర్సిటీ వీసీ, పీజీసెట్‌ చైర్‌పర్సన్‌ సూర్య కళావతి.. పీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై. నజీర్‌ అహమ్మద్‌తో కలిసి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్‌, ఒకే ఫీజు అమలు చేశామన్నారు. ఏపీపీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై.నజీర్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 16 వర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 147 కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని వర్సిటీలకు కలిపి ఒకే అప్లికేషన్‌ ద్వారా పీజీలో చేరే అవకాశం కల్పించామన్నారు. పీజీసెట్‌ను 3 కేటగిరీలుగా విభజించామని, వీటిలో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌ ఉంటాయన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, డిగ్రీ చివరి సెమిస్టర్‌లో ఉన్న వారు పీజీసెట్‌ రాసేందుకు అర్హులని తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు జూలై 20వ తేదీ ఆఖరని, రూ.500 అపరాధ రుసుముతో జూలై 27వ తేదీ వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో జూలై 29 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాల కోసం వైవీయూ.ఈడీయూ.ఇన్‌లో చూడవచ్చన్నారు.

*ఉన్నత విద్యామండలి సహకారంతో జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈఏపీ) సెట్‌కు బుధవారం వరకు 2,98,634 దరఖాస్తులు అందాయి. ఈ మేరకు ఏపీఈఏపీ సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి. రంగజనార్దన, కన్వీనర్‌ ఎం. విజయ్‌కుమార్‌ తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు, రూ.5 వేల రుసుముతో జూలై 1 వరకు, రూ.10 వేల రుసుముతో జూలై 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హాల్‌ టిక్కెట్లను ఈ నెల 27 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. జూలై 4 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మాక్‌ పరీక్షల్లో పాల్గొని, ఆన్‌లైన్‌ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

*పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఏపీపీజీసెట్‌-2022) షెడ్యూలు విడుదలైంది. యోగి వేమన యూనివర్సిటీ వీసీ, పీజీసెట్‌ చైర్‌పర్సన్‌ సూర్య కళావతి.. పీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై. నజీర్‌ అహమ్మద్‌తో కలిసి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. ఒక సబ్జెక్టుకు ఒకే అప్లికేషన్‌, ఒకే ఫీజు అమలు చేశామన్నారు. ఏపీపీజీసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై.నజీర్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 16 వర్సిటీలు, అనుబంధ పీజీ కళాశాలలు, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, మైనార్టీ కళాశాలల్లో ఉన్న 147 కోర్సులకు ఒకే నోటిఫికేషన్‌ ద్వారా సీట్ల భర్తీ ఉంటుందన్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి పీజీ మొదటి సంవత్సరంలో చేరాలనుకునే విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అన్ని వర్సిటీలకు కలిపి ఒకే అప్లికేషన్‌ ద్వారా పీజీలో చేరే అవకాశం కల్పించామన్నారు. పీజీసెట్‌ను 3 కేటగిరీలుగా విభజించామని, వీటిలో ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, సైన్స్‌ ఉంటాయన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు, పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు, డిగ్రీ చివరి సెమిస్టర్‌లో ఉన్న వారు పీజీసెట్‌ రాసేందుకు అర్హులని తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు జూలై 20వ తేదీ ఆఖరని, రూ.500 అపరాధ రుసుముతో జూలై 27వ తేదీ వరకు, రూ.వెయ్యి అపరాధ రుసుముతో జూలై 29 వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. వివరాల కోసం వైవీయూ.ఈడీయూ.ఇన్‌లో చూడవచ్చన్నారు.

* ఉన్నత విద్యామండలి సహకారంతో జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిస్తున్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈఏపీ) సెట్‌కు బుధవారం వరకు 2,98,634 దరఖాస్తులు అందాయి. ఈ మేరకు ఏపీఈఏపీ సెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి. రంగజనార్దన, కన్వీనర్‌ ఎం. విజయ్‌కుమార్‌ తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 25 వరకు, రూ.5 వేల రుసుముతో జూలై 1 వరకు, రూ.10 వేల రుసుముతో జూలై 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హాల్‌ టిక్కెట్లను ఈ నెల 27 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. జూలై 4 నుంచి 7 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మాక్‌ పరీక్షల్లో పాల్గొని, ఆన్‌లైన్‌ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

*ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ.. హైకోర్టులో ఏపీజేఎఫ్‌ అధ్యక్షుడు చెవులు కృష్ణాంజనేయులు పిటిషన్‌ వేశారు. న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. పీపీతో సంబంధం లేకుండా డీజీపీ, కలెక్టర్‌ ఆదేశాలతో.. కేసులు ఎలా తొలగిస్తారని న్యాయవాది ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కేసులు తొలగించాలంటే.. హైకోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా తొలగించారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎన్ని కేసుల తొలగింపునకు హైకోర్టు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించింది. ఎన్ని ఉపసంహరించారన్న దానిపై అఫిడవిట్ వేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్లకు డబ్బుల పంపిణీ, అధికారులపై దాడుల కేసులు కూడా.. తొలగించారని ధర్మాసనం దృష్టికి శ్రవణ్‌కుమార్ తీసుకొచ్చారు. ప్రభుత్వం అఫిడవిట్ వేయకుంటే కేసులో ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

* టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ నెల 29న ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బసచేయనున్నారు. గుడివాడలో మహానాడు నిర్వహణ అనంతరం ఆయన నిమ్మకూరుకు వెళ్తారు. టీడీపీ నేతలు కృష్ణాజిల్లాలో మహానాడు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. భారీ బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని ఖరారు చేయాలని ఆయన క్యాడర్‌కు సూచించారు. వారు పలు ప్రాంతాలను ప్రతిపాదించగా.. అధిష్టానం త్వరలో ఒకదాన్ని ఖరారు చేయనుంది.

*అగ్నిపథ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆర్మీ అభ్యర్థులు విడుదలైయ్యారు. బెయిల్ పై 12 మంది యువకులు విడుదలైయ్యారు. ఈనెల 18న గుంటూరు నల్లపాడు వద్ద 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్న 31 మంది యువకుల్లో 12 మందికి బెయిల్ మంజూరు అయింది. విడుదలైన వారు అనంతపురం, నంద్యాల, ప్రకాశం,కర్నూలు జిల్లాలకు చెందిన యువకులుగా గుర్తింపు. బెయిల్‌పై విడుదలైన యువకులకు రాజమండ్రి వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు.

*‘సీఎం జగన్మోహన్‌రెడ్డి తన సొంత కంపెనీ విషయంలో అబద్ధాలు చెప్పి కోర్టును మోసం చేశారు. ఇటు ప్రభుత్వం తరఫున, అటు కంపెనీ తరఫునా జగన్మోహన్‌రెడ్డే ఉన్నారు. దానిని అవకాశంగా తీసుకొని కుమ్మక్కయ్యారు. జగన్‌ ప్రభుత్వం, జగన్‌ కంపెనీ కుమ్మక్కై కోర్టును తప్పుదారి పట్టించాయనీ, దీనివల్ల న్యాయస్థానం బాధితురాలిగా మారిందని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. బుధవారం ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైఎ్‌సఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్‌రెడ్డి పల్నాడు జిల్లాలో 1,500 ఎకరాల సున్నపు రాయి గనులను తమ సొంత కంపెనీ సరస్వతి పవర్‌కు కేటాయించుకొన్నారు.

*తిరుపతి జిల్లా గూడూరు పట్టణానికి చెందిన కాపునాడు నాయకుడు కంకణాల పెంచల నాయుడు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బుధవారం రాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్యసభలో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.

*టీటీడీ ఆధ్వర్యంలో ఆగస్టు 7న ఉదయం 8.07 నుంచి 8.17 గంటల వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిర్వహిస్తున్న ఉచిత వివాహాల కల్యాణమస్తుకు అన్ని జిల్లా కేంద్రాల్లో జులై 1 నుంచి 20వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్ర కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణమస్తులో వివాహాలు చేసుకునే వారికి రెండు గ్రాముల తాళి బొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు నుంచి 20 మందికి, వరుడి నుంచి 20 మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. టీటీడీ తరపున ప్రతి జిల్లాకు ఓ కో-ఆర్డినేటర్‌ను నియమిస్తున్నామని, వారు కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవోలతో సమన్వయం చేసుకుని కల్యాణమస్తును నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్‌, డిప్యూటీ ఈవోలు విజయలక్ష్మి, గోవిందరాజన్‌, శ్వేత డైరెక్టర్‌ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

*అంగన్వాడీలకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, సుబ్బరావమ్మ బుధవారం అమరావతి సచివాలయంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధను కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ఫోన్లు ఇవ్వాలని, సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని కోరారు. చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అంగన్వాడీలకు బీమా సౌకర్యం వర్తింపజేయాలని కోరారు. గ్రేడ్‌-2 సూపర్‌ వైజర్‌ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఖాళీగా ఉన్న వర్కర్‌, హెల్పర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

* ఇస్రో పూర్తి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగానికి రెడీ అయింది. ఈ నెల 30న పీఎ్‌సఎల్వీ-సీ53 రాకెట్‌ ద్వారా మూడు సింగపూర్‌ ఉపగ్రహాలను కక్ష్యల్లోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇస్రో ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌)లోని రెండవ ప్రయోగ వేదికనుంచి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగిస్తామని వెల్లడించింది. దీనికోసం ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించనున్నారు. సింగపూర్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది.

*సెంట్రల్‌ యూనివర్సిటీలు అందించే యూజీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-యూ జీ) తేదీలను ప్రకటించారు. జూలై 15 నుంచి ఆగస్టు 10 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే జూలై 17న నీట్‌-యూజీ పరీక్ష ఉన్నందున ఆ రోజు సీయూఈటీ పరీక్ష జరగదు. అలాగే జూలై 21 – ఆగస్టు 3 తేదీల మధ్య జేఈఈ మెయిన్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సీయూఈటీ పరీక్షలను నిర్వహించరు. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగు, అనేక ఇతర ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచి సెంట్రల్‌ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులకు కామన్‌ ఎంట్రన్స్‌ పెట్టాలని యూజీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 11లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దేశంలోని 44 సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు 12 స్టేట్‌ యూనివర్సిటీలు, 11 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలు కూడా సీయూఈటీ ఆధారంగా యూజీ సీట్లను భర్తీ చేయనున్నాయి.

* రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు 5వేలు దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 738 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 698, దక్షిణకన్నడ, మైసూరులో 13 చొప్పున, బళ్లారి, బెంగళూరు గ్రామీణ, ధారవాడ, తుమకూరులో 3 చొప్పున, దావణగెరె, కోలారులో ఒకటిచొప్పున నమోదయ్యాయి. 646 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. ప్రస్తుతం 5020 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 4819మంది ఉన్నారు.