Politics

మీరు పోలీసులా? లేదంటే ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా? – TNI రాజకీయ వార్తలు

మీరు పోలీసులా? లేదంటే ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా?  – TNI రాజకీయ వార్తలు

* హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా? అని ట్విటర్ వేదికగా పోలీసులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! అని నిలదీశారు. హత్యకేసులో సాక్షులకి రక్షణ కల్పించాలని డిమాండ్ చేయడమే మాజీ మేయర్ హేమలత చేసిన నేరమా? పోలీసులూ! మీరు ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న పోలీసులా! వైఎస్ జగన్ మాఫియా రెడ్డి ఫ్యాక్షన్ నడిపే ప్రైవేటు సైన్యమా? పోలీసులే అమాయకుడైన పూర్ణ జేబులో గంజాయి పెట్టి అమ్ముతున్నాడని అరెస్టు చేయడం.. ఇదేం అన్యాయం అని నిలదీసిన హేమలత మీద నుంచి పోలీసు వాహనం పోనిచ్చారంటే వీళ్లంతా పోలీసులు కాదు. వైసీపీ ఫ్యాక్షన్ టీం’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

*తెలంగాణపై కేంద్రానిది చిన్న చూపు: మంత్రి Mallareddy
75 ఏళ్లలో ఏ ప్రభుత్వమూ కార్మికలోకానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి సింగరేణి స్థలాల్లో ఉంటున్న పేదలకు పట్టాలు ఇప్పించిన ఘనత బాల్క సుమన్‌కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తూ నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. అయినా కూడా కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు. గుజరాత్ మహిళలు తాగునీటి కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లెటర్ రాస్తే ఇప్పటి వరకు సమస్య తీర్చలేదన్నారు. కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ ఒక ఇంజనీర్‌లా నిలబడి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడు దొంగల్లా మారి కేసీఆర్‌పై అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.

*అందుకే Congressలో చేరుతున్న..: తాటి Venkateshwarlu
టీఆర్ఎస్నే త, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేనిచోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని, తన నియోజక వర్గంలో పోడు భూముల సమస్యను పరిష్కరించ లేదని చెప్పారు. కేసీఆర్కం టే ముందు కూడా తెలంగాణ లో అభివృద్ది జరిగిందన్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్‌లు వేయడం అభివృద్ది కాదని.. తన నియోజకవర్గం ప్రజల పోడు భూములకు పట్టాలు ఇస్తే సంతోషిస్తామన్నారు.

*Modi నిర్ణయాలతో అంబేద్కర్ సంతృప్తి చెందుతారు: Bandi Sanjay
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ధ న్యవాదాలు తెలిపారు. తల్లిగా దేశానికి ద్రౌపది ముర్ము సేవ చేస్తారని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని అంబేద్కర్‌ వారసుడితో బండి‌ సంజయ్ పోల్చడం గమనార్హం. మోదీ నిర్ణయాలతో బాబా సాహెబ్ అంబేద్కర్‌ తృప్తి చెందుతారని పేర్కొన్నారు. జులై 3న సికింద్రాబాద్ ప్రధాని మోదీ సభకు గిరిజన, ఆదివాసీలు భారీగా తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మైనార్టీ వర్గానికి చెందిన కలాంను, ఎస్సీ వర్గానికి చెంది కోవింద్‌ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. ప్రధాని మోదీ, జేపీ నడ్డాల కృషితోనే ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని బండి సంజయ్ కొనియాడారు

*ఉద్ధవ్ వస్తానన్నా స్వాగతిస్తాం: అసోం సీఎం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీ వ్యూహం పన్నిందని, సేన రెబల్ ఎమ్మెల్యేలకు గౌహతి హోటల్‌లో అసోంలోని బీజేపీ ప్రభుత్వం ఆతిథ్యమిచ్చిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ (Himant Biswa Sharma) తోసిపుచ్చారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో శర్మ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని రాకుండా ఏ ఒక్కరినీ తాను ఆపనని, ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర సీఎం) కూడా రావచ్చని అన్నారు.

*ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు: Nasir Ahmed
వైసీపీ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెంచి ప్రజలకు వాతలు పెట్టిందన్నారు. 2020లో మౌలానా అబ్దల్ కలామ్ ఆజాద్ జయంతి రోజున దుల్హన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ డబ్బులు చెల్లిస్తామని జగన్ చెప్పారని, ఇప్పుడు మొండిచేయి చూపారని విమర్శించారు. వైసీపీ తమ ప్రచార ఆర్భాటాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, మైనార్టీ సోదరీమణులు పెళ్లిళ్లు అయిపోయినా వారికి ఇవ్వాల్సిన రూ.50 వేలు రావడంలేదన్నారు. మైనార్టీల అభివృద్ధిని కాంక్షించి చంద్రబాబు పెట్టిన విదేశీ విద్య పథకాన్ని అటకెక్కించారని, దుల్హన్ పథకాన్ని రూ. లక్షకు పెంచుతామని చెప్పి ముస్లీం మైనార్టీలను మోసం చేశారని, మైనార్టీ శాసనసభ్యులు మైనార్టీ ద్రోహులుగా మిగిలిపోతారని నసీర్ అహ్మద్ అన్నారు.

*శివసేన పొత్తులోనే ఉంది.. ప్రభుత్వానికి మెజారిటీ ఉంది: అజిత్ పవార్ లాజిక్
మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వానికి మెజారిటీ తగ్గిందనే వార్తలు అనేకం వస్తున్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని వదిలి మాతోశ్రీ నివాసానికి ఉద్ధవ్ మారిపోవడం వీటికి బలాన్ని చేకూర్చుతోంది. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం పతనం అవ్వడం ఖాయం అంటు ఊహాగాణాలు వెలువడుతున్న తరుణంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. ప్రభుత్వానికి నష్టమేమీ లేదని తమకు సరిపడా మెజారిటీ ఉందంటూ సరికొత్త లాజిక్ చెప్పారు.అజిత్ పవార్ చెప్పిన లాజిక్ ప్రకారం.. శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు పొత్తులోనే ఉన్నాయని ఈ పొత్తు ప్రకారం తమకు మెజారిటీ ఉందని చెప్పారు. థాకరే శివసేననా ఏక్‌నాథ్ షిండే శివసేననా అని కాకుండా శివసేన పొత్తులోనే ఉందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. నిజానికి.. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేతోనే ఉన్నారు. గువహాటిలోని హోటల్‌లో ఉన్న వీరంతా తమ పార్టీ నేత షిండేనే అని ఏకగ్రీవంగా తీర్మానించారు. అధికారికంగా మూడింట రెండొంతుల మెజారిటీ ప్రకారం.. శివసేన పార్టీకి షిండేనే అవుతారు.

*తెలంగాణ కేవలం మద్యం విషయంలోనే అభివృద్ధి చెందింది: షర్మిల
తెలంగాణ రాష్ట్రం కేవలం మద్యం విషయంలో మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల విమర్శించారు. ఖజానా నింపుకునేందుకు మద్యాన్ని ఏరులా పారిస్తున్నారని,ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం బరాఖత్‌గూడెం గ్రామస్తులతో వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా మాట-ముచ్చట నిర్వహించారు. ఈసందర్భంగా నాలుగేళ్లుగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లు వృద్దులు వివరించారు.

*సైనిక సంప్రదాయాన్ని బీజేపీ కాలరాస్తోంది: మల్లురవి
సైనిక సంప్రదాయాన్ని బీజేపీ కాలరాస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ఆరోపించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సైనికుల్ని తీసుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు.దేశంలో అత్యంత కీలకమైన శాఖ.. రక్షణ శాఖ అని,అగ్నిపథ్‌.. దేశ భద్రతకు ప్రమాదకరమని మల్లురవి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపధ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

*బలపరీక్షలో గెలుస్తాం: పవార్‌
తమ కూటమి ప్రభుత్వ బలం సభలో నిర్వహించే బలపరీక్షలో తేలుతుంది తప్ప గువాహటిలో కాదని.. ఎంవీయే తన మెజారిటీని సభలో నిరూపించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం లేదన్న అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. మహారాష్ట్రకు ఆవల బీజేపీ గురించి అజిత్‌ పవార్‌కు తెలియదని, తనకు తెలుసని శరద్‌ అన్నారు. తనకు ఒక జాతీయ పార్టీ మద్దతు ఉందని సాక్షాత్తూ ఏక్‌నాథ్‌ షిండేనే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘శివసేన రెబెల్‌ ఎమ్మెల్యేలను తొలుత గుజరాత్‌కు, అక్కణ్నుంచీ అసోంకు ఎలా తరలించారో అందరికీ తెలుసు. వారికి సాయం చేస్తున్నవారందరి పేర్లనూ మేం చెప్పక్కర్లేదు. అసోం ప్రభుత్వం వారికి సాయం చేస్తోంది’’ అని బీజేపీపై ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడితే రెబెల్‌ ఎమ్మెల్యేలంతా ముంబైకి, శాసనసభకు రావాల్సిందేనని గుర్తుచేశారు. ఒకసారి ముంబైకి వచ్చాక వారికి గుజరాత్‌, అసోం బీజేపీ ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తాయా? అని ప్రశ్నించారు. గతంలో ఇలా శివసేన నుంచి బయటకు వెళ్లిపోయిన చగన్‌ భుజ్‌బల్‌ వర్గంలో ఒక్కరు తప్ప మిగతావారంతా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారని.. షిండే వర్గానికీ అదే జరుగుతుందన్నారు. ఇక.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నంబర్ల కోసమే.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చి, తాను సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చాలన్న బీజేపీ ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధమని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘‘అసోంను వరదలు ముంచేస్తుంటే ఈ ఎమ్మెల్యేలను అక్కడికి పంపించి అసోం ప్రభుత్వాన్ని ఎందుకు డిస్టర్బ్‌ చేస్తారు? వారిని బెంగాల్‌ పంపండి. జాగ్రత్తగా చూసుకుంటాం’’ అన్నారు.

*ఆ అధికారులను వదలం: అచ్చెన్న
జగన్‌రెడ్డి అవినీతిని ప్రశ్నించిన వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను అర్థరాత్రి వేళ నిబంధనలకు విరుద్ధంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అచ్చెన్నాయుడు గురువారమిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఐపీఎస్‌ అధికారి మణికంఠ, ఆర్డీవో గోవిందరావు, మున్సిపల్‌ కమిషనర్‌ కనకారావు, ఎమ్మార్వో జయలకు రాజ్యాంగంపై కనీస పరిజ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. ఈ మూడేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదన్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, వ్యతిరేక కార్యక్రమాల్లో భాగస్వాములైన అధికారులకు దీనిపై లేఖలు రాసి, భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తే… వీరిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం అని హెచ్చరించారు.

*దేశ భక్తులకు ఆదర్శం శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ: నాగోతు రమేశ్‌
శ భక్తులు, బీజేపీ కార్యకర్తలకు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఆదర్శ ప్రాయుడని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు అన్నారు. జనసంఘ్‌ వ్యవస్థాపకుడైన ముఖర్జీ బలిదానాన్ని గుర్తు చేసుకొంటూ విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన్ను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్‌ నాయుడు మాట్లాడుతూ ముఖర్జీ వారసులుగా నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఆర్టికల్‌ 370ని రద్దు చేసి మహనీయుడి ఆకాంక్షను నెరవేర్చారని గుర్తు చేశారు.

*కేజీబీవీ ఉపాధ్యాయుల వేతనాలు పెంచండి: కత్తి
కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లు ప్రిన్సిపాళ్ల వేతనాలు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన నేతృత్వంలో ఎస్టీయూ కేజీబీవీ నాయకులు గాజుల నాగేశ్వరరావు సీహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు కె.రత్నమాలినిదేవి తదితరులు గురువారం సమగ్రశిక్ష ఎస్పీడీ వెట్రిసెల్విని కలిసి వినతిపత్రం అందజేశారు.

*ఎంత ధరకైనా విద్యుత్‌ కొంటాం: పెద్దిరెడ్డి
రాష్ట్రంలో కరెంటు కొరతను అధిగమించడంలో వెనుకాడకుండా ఎంత ధరకైనా కొంటామని ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రానున్న నాలుగు నెలలూ రోజుకు 500 నుంచి 1500 మెగావాట్లను కొనుగోలు చేసేందుకు ఈ-రివర్స్‌ ఆక్షన్‌కు టెండర్లు వేశామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడిన దృష్ట్యా నిరంతర విద్యుత్తు సరఫరాకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో మంత్రి వివరించారు.