NRI-NRT

స్టార్ట్‌ పలకు హెచ్‌-1బి సరళీకృతం

స్టార్ట్‌ పలకు హెచ్‌-1బి సరళీకృతం

స్టార్ట్‌ పలకు హెచ్‌ 1బీ వీసా జారీ ప్రక్రియ మరిత సులభతరం చేసేందుకు అమెరికా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (డీహెచ్‌ఎ్‌స) ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఇందులోభాగంగా మార్గదర్శక ఎజెండాకు అదనంగా.. ఫామ్‌ ఐ-485 ప్రాసెసింగ్‌ను మెరుగుపరిచేందుకు నియమాలను జారీ చేయాలని చూస్తోంది. దీంతో హెచ్‌ 1బీ మీద అమెరికాలో ఉంటూ గ్రీన్‌ కార్డు పొందేందుకు దశాబ్దాల పాటు వేచి చూసే పరిస్థితి మారనుంది. ఫామ్‌ ఐ-485.. అమెరికాలో ఒక వ్యక్తి చట్టబద్ధ శాశ్వత నివాస స్థితికి చేసే దరఖాస్తు. ఇకపై ఈ దరఖాస్తులను వేగంగా పరిశీలించనున్నారు. 2023కు సంబంధించి క్రమబద్ధీకరణ ఎజెండాలో భాగంగా హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ను ఆధునికీకరించాలని అమెరికా భావిస్తోంది. స్టార్ట్‌పలు.. హెచ్‌-1బీ నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాపై విదేశీ ఉద్యోగులను నియమించుకోవడాన్ని ఇది సులభతరం చేయనుంది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ విధానంలో మోసాలు, దుర్వినియోగాన్ని తగ్గించేందుకు పలు నిబంధనలను సవరించనుంది. దీంతో ప్రవాస భారతీయులకు గొప్ప మేలు చేకూరుతుంది. ఈ ప్రతిపాదిత ముసాయిదా నియమం వచ్చే ఏడాది మేలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.