DailyDose

మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. – TNI నేర వార్తలు

మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం..  – TNI  నేర వార్తలు

*ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. దేవరియా జిల్లాలో మొండెం లేని ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా లభ్యమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇది హత్యనా? లేక ఇంకేమైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

* విశాఖ రుషికొండ కేంద్రంగా సాగి.. కలకలం రేపిన స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కేసును.. నాలుగు రోజుల వ్యవధిలో పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు వ్యక్తులతో పాటు ఓ మహిళ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు ద్వారకా ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు.

*అనంతపురం జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్గా పనిచేస్తున్న ముని కుమార్.. కడప రాయచోటి రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. కడప జిల్లా ప్రకాష్ నగర్ కు చెందిన మునికుమార్.. కడప నగరపాలక కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించేవారు. మూడు నెలల కిందట.. డిప్యూటేషన్ పై అనంతపురం పంచాయతీ కమిషనర్ గా వెళ్లారు. వారాంతపు సెలవుల్లో ఇంటికి వచ్చేవారని కుటుంబీకులు తెలిపారు.

*ఉత్తర్‌ప్రదేశ్‌లో 4వేల ఏళ్లనాటి పురాతన వస్తువులు బయటపడ్డాయి. మెయిన్‌పురి జిల్లాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎస్ఐ) అధికారుల బృందం వీటిని గుర్తించింది. కురవాలి మండలం గణేశ్‌పుర గ్రామంలో ఈనెల 10న బహదూర్‌ సింగ్‌ అనే వ్యక్తి తన వ్యవసాయ భూమిని చదునుచేస్తుండగా పురాతన ఆయుధాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. దాదాపు 77 రాగి వస్తువులను స్వాధీనం చేసుకుని.. వారంపాటు అక్కడ శాస్త్రీయ పరిశోధనలు చేసింది. అక్కడ రాగి నిధులతోపాటు, కుండలు, వంట కొలిమిని స్వాధీనం చేసుకున్నారు.

*కదులుతున్న కారుపై చెట్టు కూలింది. దీంతో ఆ కారును డ్రైవింగ్‌ చేస్తున్న మహిళ మరణించింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చెన్నైలో భారీగా వర్షం కురిసింది. అయితే 57 ఏళ్ల మహిళ సాయంత్రం తన కారులో ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నది. ఆ కారును ఆమె డ్రైవ్‌ చేస్తుండగా అందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. కాగా, ఆ కారు కేకే నగర్‌ ప్రాంతంలోకి రాగానే నడుస్తున్న కారుపై ఉన్నట్టుండి రోడ్డు పక్కగా ఉన్న ఒక చెట్టు కూలింది. దీంతో డ్రైవింగ్‌ సీటులో ఉన్న 57 ఏళ్ల మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కామారెడ్డి: జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్ చేసింది. బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. మతిస్థిమితం లేని మహిళను పోలీసులకు అప్పగించారు. మూడు గంటల పాటు స్టేషన్‌లో ఉంచి పంపించేసినా.. మళ్లీ తీరు మారకపోవడంతో మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. సదరు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు.

*హైదరాబాద్: నగరంలోని బోలక్‌పూర్ వద్ద విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. భోలకపుర్ డివిజన్ దేవిచౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్(14) ద్విచక్రవాహనంపై పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*హైదరాబాద్: నగరంలోని రామంతపూర్ శ్రీనగర్ కాలనీలో భార్య భర్తల సూసైడ్ కలకలం రేపుతోంది. స్థానికంగా ఉండే సాయి గౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకొని శ్రీనగర్ కాలనిలో నివాసం ఉంటున్నారు. కాగా గత రాత్రి దంపతులిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త ఉరివేసుకోగా, భార్య విషం సేవించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*వరంగల్: జిల్లాలోని రాయపర్తి మండలం సూర్యతండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూతగాదాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*హైదరాబాద్: నగరంలోని బోలక్‌పూర్ వద్ద విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందాడు. భోలకపుర్ డివిజన్ దేవిచౌక్ వద్ద డీసీఎం ఎత్తు ఎక్కువగా ఉండటంతో విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ తీగ తెగి పడిపోయింది. డీసీఎం వెనకాల వస్తున్న మహమ్మద్ సమీర్(14) ద్విచక్రవాహనంపై పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి మహమ్మద్ ఖదీర్ సమోసా వ్యాపారం చేస్తుంటాడు. హోటల్స్ వెళ్లి కలెక్షన్ తీసుకొని వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కామారెడ్డి: జిల్లాలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్ చేసింది. బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతుండటంతో స్థానికులు అడ్డుకున్నారు. మతిస్థిమితం లేని మహిళను పోలీసులకు అప్పగించారు. మూడు గంటల పాటు స్టేషన్‌లో ఉంచి పంపించేసినా.. మళ్లీ తీరు మారకపోవడంతో మహిళకు స్థానికులు దేహశుద్ధి చేశారు. సదరు మహిళ ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు.

*నంద్యాల: జిల్లాలోని వెలుగోడు మండలం బోయారేవుల వద్ద నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అర్థరాత్రి వరకు డీజే డాన్స్‌లో పాల్గొన్న శివకుమార్ తెల్లవారేసరికి మృతి చెంది కనిపించాడు. నవ వరుడు ఎలా మృతిచెందాడు అనేది మిస్టరీగా మారింది. శివకుమార్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

*నంద్యాల: జిల్లాలోని నంద్యాల గాంధీచౌక్‌లో TDP పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నాకు దిగారు. ప్రభుత్వం రద్దు చేసిన దుల్హన్ పథకాన్ని తక్షణమే అమలు చెయ్యాలని నిరసన చేపట్టారు. ముస్లిం మైనార్టీకి మోసం చేసిన జగన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ జీవో(G.O)ను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎమ్‌ఎస్ నంబర్ 5 ద్వారా ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

* గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. గంజాయి సరఫరా లక్ష్యంగా స్మగ్లర్లు ఎంతటి సాహసానికై ఒడిగడుతున్నాయి. తాజాగా పుష్పా సినిమాకు మించిన తరహాలో ఖరీదైన కార్లలో గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం తెల్లవారుజామున జి.మాడుగుల ఉరుము జంక్షన్ వద్ద అతి ఖరీదైన ఫోర్డ్, స్కార్పియో వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు వారిని… పాడేరు ఎస్.ఈ.బి స్టేషన్‌కు తరలించారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్లు గల రెండు కార్లల్లో డోర్లు, సీట్లు, బ్యానెట్లలో స్మగ్లర్లు గంజాయి ప్యాకెట్లు అమర్చి అక్రమ రవాణాకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

*కర్నాటక రాష్ట్రంలోని కాల బురగీ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేసింది. ఈ నెల 27 వ తేదీన ఉదయం 11.00 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత కుటుంబాల సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేస్తారు. ఈ నెల 3 వ తేదీన జరిగిన ప్రమాదంలో హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో వస్తుండగా జరిగిన ప్రమాదంలో 7 గురు మృతి చెందగా, మరో 7 గురు తీవ్రంగా గాయపడ్డారు.

* అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్‌కు చెందిన నాగుల వేణుగౌడ్‌(40) కొన్నేండ్లుగా యం త్రాలు, తాయత్తులు కడుతూ, జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు.నను వేధించాడంటూ ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నదని, ఈ విషయంపై మాట్లాడుదామని ఓ విలేకరి వేణుకు ఫోన్‌ చేసి చెప్పాడు. మధ్యాహ్నం వేణు, తన స్నేహితుడితో కలిసి సిరిసిల్లకు వచ్చాడు. ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ ప్రాంతంలోని రైతు బజార్‌ సమీపంలో అప్పటికే వేచి ఉన్న కొందరు కర్రలతో వేణుపై దాడిచేశారు. గాయపడ్డ వేణును కుటుంబసభ్యులు కరీంనగర్‌ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. వేణుకు భార్య వైష్ణవి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

*ఇంటర్‌ ఫెయిలైనందుకు మనస్తాపంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు విద్యార్థులు, కృష్ణాజిల్లాలో ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు. తాడిపత్రి పట్టణంలోని కృష్ణాపురంలో ఉంటున్న సుదర్శన్‌(16) శుక్రవారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న సుదర్శన్‌ ఫెయిల్‌ కావడంతో ఉరివేసుకున్నాడు. శీసత్యసాయి జిల్లా కదిరిలోని కుటాగుళ్లకు చెందిన ఇంటర్‌ విద్యార్థి లయ వర్ధన్‌(19) ఇంటర్‌ ఫెయిలవడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని సనత్‌ నగర్‌కు చెందిన యువశ్రీ (17) ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాసింది. ఫలితాలలో తాను మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

* రాష్ట్రంలో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లాఇచ్చోడ మండలం ముఖ్ర(బి)కు చెందిన వగత్‌కార్‌ తుకారాం, సుగుణ దంపతులు మరో వ్యక్తితో కలిసి పొలానికి వెళ్లారు. శుక్రవారం పిడుగుపడి సుగుణ మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. నార్నూర్‌ మండలం రాజులగూడకు చెందిన షేక్‌ అయూబ్‌ (45), కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లికి చెందిన రౌతు రావూజీ(45) పిడుగులు పడి చనిపోయారు.

* నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలంకలం సృష్టించాయి. ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం నగరంలోని ప్రముఖ లండన్‌ పబ్‌ (గే బార్‌, నైట్‌ క్లబ్‌)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని చెప్పారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు.

*కోల్‌కతా నగరంలోని ముల్లిక్ బజార్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి అత్యంత భయానకంగా ఏడో అంతస్థుపై నుంచి దూకి, తీవ్ర గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళం, ఆసుపత్రి సిబ్బంది, ఇతర సహాయక బృందాలు చాలా శ్రమించినప్పటికీ, ఆయనను సురక్షితంగా క్రిందకు దించలేకపోయారు.

* ప్రకాశం జిల్లాలో ఎలుగు బంటి టెన్షన్కొ నసాగుతోంది. కొమరోలు మండలం తాటిచర్ల వద్ద ఐదు రోజుల నుంచి ఎలుగు బంటి సంచారం వెలుగు చూసింది. ఎలుగు బంటిని పట్టుకునేందుకు అటవీ అధికారులు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. రాచర్ల మండలం గుడిమెట్ట వద్ద నిన్న రాత్రి గ్రామస్థులకు ఎలుగు బంటి కనిపించింది. అటవీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. రెండు గ్రామాల్లో కనిపిస్తున్న ఎలుగు బంటి ఒకటేనా.. లేదంటే వేరువేరా అన్న సందేహం కలుగుతోంది. రెండు గ్రామాల్లో ఎలుగు బంటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు వలలు, బోను ఏర్పాటు చేశారు.

*పుట్టపర్తి నగర పాలక సంస్థ కమిషనర్ మణికుమార్ ఆత్మహత్య కు పాల్పడ్డారు. కడప రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆయన బలవన్మరణం పాలయ్యారు. గతంలో కడప నగర పాలక సంస్థ సూపరెండెంట్‌ గా మణికుమార్ పని చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు రైల్వే పోలీసులు తరలించారు.

*బాపట్ల: జిల్లాలో చెరుకుపల్లి ఎస్సై కొండారెడ్డి హల్‌చల్ చేశారు. అర్థరాత్రి సమయంలో పెట్రోల్ బంక్‌లో యువకులపై ఎస్సై చేయి చేసుకున్నారు. ఓ కేసులో సీజ్ చేసిన కారులో పెట్రోల్ పోయించుకునేందుకు ఎస్సై బంక్‌కు వచ్చారు. అదే సమయంలో పెట్రోల్ బంక్‌లో ఉన్న యువకులపై దాడికి పాల్పడ్డారు. వారి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా… ఎస్సై తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుల కారును వాడుకోవటంతో పాటు అకారణంగా దాడి చేసిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

*గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ఆలూరు గ్రామంలో కుమార్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు యువకుడి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

*హైదరాబాద్‌: నగరంలోని పుప్పాలగూడలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంటి ఆవరణలో సెల్లార్‌ గుంత తీస్తుండగా దాన్ని ఆనుకుని ఉన్న గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. గుంత తీస్తున్న కూలీలపై గోడపడిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా బిహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు.