Politics

ముహూర్తం ఎందుకు.. ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే – TNI రాజకీయ వార్తలు

ముహూర్తం ఎందుకు.. ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే  – TNI రాజకీయ వార్తలు

* “నేను అజ్ఞాతంలో ఉన్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.. కానీ నేను నర్సీపట్నంలోనే ఉన్నాను” అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తనకు తాను పులిని అనుకుంటున్న విజయసాయి రెడ్డి.. పోలీసులతో కాకుండా సింగిల్‌గా వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి దిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి.. తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తాను అజ్ఞాతంలో ఉన్నానడం అవాస్తవమని.. నర్సీపట్నంలోనే ఉన్నానని తెలిపారు. విజయసాయిరెడ్డి ఎప్పుడొచ్చినా తాను సిద్దమేనని.. దీనికి ముహూర్తమెందుకని ప్రశ్నించారు.అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేనురెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!. విజయసాయి రెడ్డి పులి అయితే.. పోలీసుల్ని వేసుకొని రాడని.. సింగిల్గా రావాలని సవాల్‌ చేశారు. విజయసాయిరెడ్డి 16 నెలల పాటు జైలు భోజనం తినడం వల్ల శరీరం మందపడిందని ఎద్దేవా చేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదని అయన్నపాత్రుడు సైటెర్లు వేశారు.

*రోడ్ల దుస్థితిని చూసి ప్రభుత్వం కళ్లు తెరవాలి: దేవినేని ఉమా
వైకాపా పాలనలో రహదారుల దుస్థితిని నిరసిస్తూ.. మైలవరం నియోజకవర్గంలో.. తెదేపా నేత దేవినేని ఉమా పాదయాత్ర చేపట్టారు. రోడ్లపై గుంతల వల్ల మైలవరం నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రహదారుల దుస్థితిని నిరసిస్తూ.. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు పాదయాత్ర చేపట్టారు. దుగ్గిరాలపాడులో మొదలైన ఈ యాత్ర సాయంత్రం జి.కొండూరులో ముగియనుంది. మొత్తం 14కిలోమీటర్ల మేర సాగనున్న యాత్రలో.. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. రోడ్లపై గుంతల వల్ల మైలవరం నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.మూడేళ్లలో గుంతల్లో పడి ముగ్గురు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో 25 వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే.. వైకాపా పాలనలో ఒక్క రోడ్డునూ బాగుచేసిన పాపాన పోలేదని ఆక్షేపించారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని చూసి.. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని ధ్వజమెత్తారు.

*దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు : మంత్రి గంగుల
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్‌, రేకుర్తి గ్రామంలో శనివారం దళితబంధు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌, జ్యోతిభాపూలే కన్న కలలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. ప్రభుత్వాలు మారినా దళితుల తల రాతలు మారలేదని, గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని విమర్శించారు.సమాజంలోని అట్టడుగు వర్గాలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు అనేక నిబంధనలు విధిస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేస్తుందన్నారు. గత 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,559 మంది లబ్ధిదారులకు గాను 11,500 మందికి పథకం వర్తింపజేసినట్లు చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లో 300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, ఇప్పటి వరకు 250 మందికి
యూనిట్లు మంజూరు చేశామన్నారు.

*ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు నికర ఆదాయం : నిరంజన్‌రెడ్డి
ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు నికర ఆదాయం లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఒకే రోజు 313 ఎకరాల్లో 15వేల ఆయిల్‌ పామ్‌ మొక్కలను నాటారు. ఆత్మకూరు మండలంలో 88.17 ఎకరాలు, పెబ్బేరు 42.77, కొత్తకోట 38.77, వనపర్తి 37.60, పానగల్ 30.64, అమరచింత 20.47, గోపాల్ పేట 17, మదనాపూర్ 15, పెద్దమందడి 14, శ్రీరంగాపూర్ 4.57, రేవల్లి 4.57 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు.చిట్యాల గ్రామంలో ముష్టి బాలీశ్వర్ ఐదెకరాల పొలంలో సామూహిక ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల వైవిధ్యీకరణతోనే అధిక ఆదాయం లభిస్తుందన్నారు. రైతులు సాంప్రదాయ సాగు నుంచి బయటకు రావాలన్నారు. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ పాలసీ ఉన్న ఒకే ఒక పంట ఆయిల్ పామ్‌ అన్నారు. 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు.ఏటా రూ.80వేల కోట్ల విలువైన వంటనూనెలు దిగుమతి చేసుకుంటున్నామని, 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్ పామ్ సాగు, ఇతర విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. వరి మినహా అన్ని రకాల పంటలను ఆయిల్ పామ్‌లో అంతరపంటలుగా సాగుచేయవచ్చని, నూనె, పప్పు గింజల సాగుపై దృష్టి పెట్టి.. ఆ దిశగా రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.

*బాలా సాహెబ్ పేరు వాడుకోవద్దు : ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర అధికార కూటమి MVA లోని శివసేన పార్టీలో ఇంటి పోరు క్షణక్షణానికి ముదురు పాకాన పడుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి వేరు కుంపటి పెట్టిన ఏక్‌నాథ్ షిండే వర్గం ప్రత్యేమైన పేరును పెట్టుకుంది. ఈ పేరులో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే పేరు ఉండటంతో ఉద్ధవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలా సాహెబ్ పేరును మాత్రం వాడుకోవద్దని, అది తప్ప ఏది నచ్చితే అది చేసుకోండని హెచ్చరించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు తమ పార్టీ పేరును నిర్ణయించుకున్నారు. ఈ వర్గం ప్రతినిధి, రెబల్ ఎమ్మెల్యే దీపక్ కెసార్కర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఇక నుంచి తమ గ్రూప్‌ను ‘శివసేన బాలా సాహెబ్‌’ గా పిలుస్తామని చెప్పారు. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో కెసార్కర్ ఈ ప్రకటన చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేల వర్గానికి ‘శివసేన బాలా సాహెబ్’గా నామకరణం చేయడంపై స్పందించాలని చాలా మంది తనను కోరుతున్నారని ఉద్ధవ్ పేర్కొన్నారు. అయితే దీని గురించి తాను ఇదివరకే చెప్పానన్నారు. ‘‘వారికి కావలసినదానిని వారు చేసుకోవచ్చు, వారి విషయంలో నేను జోక్యం చేసుకోను. వారి నిర్ణయం వారు తీసుకోవచ్చు. కానీ బాలా సాహెబ్ థాకరే పేరును మాత్రం ఎవరూ ఉపయోగించుకోకూడదు. ఈ విషయంలో శివసేన ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయిస్తుంది’’ అని ఉద్ధవ్ చెప్పారు.

*సీఎం జగన్ ఉద్యోగులను మోసం చేశారు: Devineni
సీపీఎస్ రద్దుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళం పాడటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘నాడు వారంలో సీపీఎస్ రద్దు అని అధికారంలోకి రాగానే ఉద్యోగులను మోసంచేశారు. మూడేళ్ల అసమర్థపాలనతో ఉద్యోగుల హామీలను గాలికొదిలేసి ఒకపోస్టు భర్తీచేయలేదు. జీతాలు, పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వలేని స్థితికి తెచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి నేడు మాటతప్పి మడమ తిప్పడం నిజం కాదా?.. వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.

*తెలంగాణ ఏర్పడ్డాకే హైదరాబాద్ అన్ని రంగాల్లోఅభివృద్ధి:Talasani
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే అన్ని రంగాలలో హైదరాబాద్ నగర అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ వద్ద 5 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూవిశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు.నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాదచారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ ల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి వివరించారు.GHMC పరిధిలో ఇప్పటికే 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రారంభమైనాయని చెప్పారు. మరో 22 నిర్మాణంలో ఉన్మాయన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పురోగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLC ప్రభాకర్ రావు, MLA సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

*మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదు: Sunita raot
రాష్ట్రంలో నిత్యావసర ధరలు అన్నీ విపరీతంగా పెరిగాయని మహిళా కాంగ్రెస్అ ధ్యక్షురాలు సునీతారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… నిత్యావసర ధరలకు తోడు ఆర్టీసీ బస్సు ఛార్జీలు మళ్ళీ పెంచే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు మహిళా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుందని తెలిపారు. తాము కూడా బస్‌భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా సంతోషమే.. చెప్పి చేరితే ఇంకా సంతోషమని సునీతారావు పేర్కొన్నారు.

*ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయి: Raghunandan
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్, బచ్చాయిపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించి పెద్దమ్మతల్లి దేవాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రఘు నందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ఏళ్ల కొద్దీ ఏలుతున్న పార్టీల పునాదులు కదులుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘8 ఏళ్లలో బచ్చాయిపల్లికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? డబుల్ బెడ్ రూంలు ఎన్ని వేశారు? సీసీ రోడ్లు ఎన్ని? పరిపాలించే నాయకులే చెప్పాలి’ అన్నారు. రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురయడం ఖాయమన్నారు. మీకు చిత్త శుద్ధి ఉంటే బచ్చాయిపల్లికి వెంటనే డబుల్ బెడ్రూం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల గుండెల్లో కాషాయం జెండా ఉన్నదని.. ఫ్లెక్సీలలో మాత్రం మీ బొమ్మలున్నాయని టీఆర్ఎస్‌నుద్దేశించి రఘునందన్ పేర్కొన్నారు.

*ఆర్థిక పరిస్థితి, అప్పులపై Buggana అవాస్తవాలు కట్టిపెట్టాలి: Ramakrishna
రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటి ప్రశ్న వేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవాస్తవాలు కట్టిపెట్టాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే దుల్హన్ పథకానికి రూ.లక్ష ఇవ్వలేమని హైకోర్టు లో అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేశారని ప్రశ్నించారు. వైసీపీ అధికారం చేపట్టాక ఏపీలో కొత్తగా ఎన్ని పరిశ్రమలు వచ్చాయో, ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పగలరా? అని రామకృష్ణ నిలదీశారు.

*వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం: Bonda uma
వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. శనివారం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, విద్యుత్ రాయతీలు ఇవ్వాలంటూ టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీలను వాడుకుని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్కరికైన న్యాయం చేశారా అని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికైన స్వయం ఉపాధి రుణాలు ఇచ్చారా? అని నిలదీశారు. టీడీపీ హయాంలో అమలు చేసిన అన్ని పధకాలను నిలిపివేశారని మండిపడ్డారు. అంబేడ్కర్ భవన్‌లలో గబ్బిలాలు తిరిగే పరిస్థితి తెచ్చారన్నారు. జగజ్జీవన్ రామ్ 200 యూనిట్ల ఉద్యుత్ ఉచిత పంపిణీ పథకాన్ని రద్దు చేశారని ఆయన అన్నారు.

*ఎఫ్‌ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి: Varla ramaiah
పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ కాఫీలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేలా చర్యల తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ నేత వర్ల రామయ్యలేఖ రాశారు. చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ కాపీలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచడం లేదని తెలిపారు. ప్రభుత్వం జిఓలను రహస్యంగా ఉంచిన తరహాలోనే ఎఫ్‌ఐఆర్‌లను కూడా దాచిపెడుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్ధరాత్రి రహస్య జీవోలతో అపఖ్యాతి పాలైనా బుద్ధి రాలేదని విమర్శించారు. సెక్షన్ 154, 207 సీఆర్‌పీసీ ప్రకారం నిందితులకు ఎఫ్.ఐ.ఆర్, సంబంధిత పత్రాలను అందుబాటులో ఉంచాలని స్పష్టంగా నిర్దేశిస్తోందని చెప్పారు. అత్యంత సున్నితమైన స్వభావం కలిగి ఉంటే తప్ప అన్ని ఎఫ్.ఐ.ఆర్ లను 24 గంటలలోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని పేర్కొన్నారు. అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా నిర్దిష్ట ఆదేశాలకు, సూచనలకు కట్టుబడి ఉండటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోందని వర్ల అన్నారు.

*కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి: Tarun Chugh
తెలంగాణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్. తెలంగాణలో జంతర్ మంతర్ .. తాంత్రిక్ సర్కార్ నడుస్తోందన్నారు. యువత, మహిళలు, కిసాన్, ఎస్సీ ఎస్టీ వర్గాలు కేసీఆర్ పాలనపై విసుగెత్తాయన్నారు. సీఎం కేసీఆర్ సర్కారుకు ప్రజలు బైబై చెప్పే రోజు ఎంతో దూరం లేదన్నారు. మరో 529 రోజుల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని చెబుతూ..‘‘సాలు దొర..‌ సెలవు దొర’’ (www.selavudora.com).. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ వెబ్‌సైట్ ను తరుణ్ చుగ్ ప్రారంభించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సచివాలయానికి ఎందుకు పోవటం లేదో కేసీఆర్ చెప్పగలడా? దళితులకు మూడెకరాల భూమి, కేజీ టూ పీజీ ఉచిత విద్య ఎక్కడ? అని ప్రశ్నించారు.

*తెలంగాణ ఏర్పడ్డాకే హైదరాబాద్ అన్ని రంగాల్లోఅభివృద్ధి:Talasani
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే అన్ని రంగాలలో హైదరాబాద్ నగర అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ వద్ద 5 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూవిశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాదచారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ ల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి వివరించారు.GHMC పరిధిలో ఇప్పటికే 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రారంభమైనాయని చెప్పారు. మరో 22 నిర్మాణంలో ఉన్మాయన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పురోగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLC ప్రభాకర్ రావు, MLA సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

*త్వరలో భారీ చేరికలు:రేవంత్‌
కాంగ్రెస్‌ పార్టీలో చేరికల తుఫాన్‌ మొదలైందని, త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరో 11 నెలల్లోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని, ఆ వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గాంధీభవన్‌లో శుక్ర వారం టీఆర్‌ఎస్‌ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కరకగూడెం జెడ్పీటీసీ కాంతారావు సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. రేవంత్‌రెడ్డి.. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు చేరికతో అశ్వారావుపేటలో కాంగ్రెస్‌ మరింత బలపడనుందని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు, మొత్తం అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు.

*అంబేడ్కర్‌ వారసుడు మోదీయే: బండి సంజయ్‌
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ వారసుడు ప్రధాని మోదీయే నని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకులు ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ణతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యక్ష ఓటు ద్వారా భాగస్వామ్యం కాబోతున్న సంజయ్‌కి శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్‌ తదితరులు సన్మానం చేశారు. 3న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభకు ఆదివాసీ జాతి మొత్తం కదిలి రావాలని సంజయ్‌ పిలుపునిచ్చారు.

*తెలంగాణను చీకట్లోకి నెట్టే కుట్ర: జగదీశ్‌రెడ్డి
‘తన కన్నపిల్లలను తానే తినే పాములాగా కేంద్రం వ్యవహరిస్తోంది. తల్లి ఒడిలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి.. గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. సంవత్సరకాలంగా కేంద్రం తెలంగాణను చీకట్లోకి నెట్టే కుట్ర చేస్తోంది’ అని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) కొత్త చైర్మన్‌గా వై.సతీశ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు హాజరయ్యారు. అనంతరం జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే.. కేంద్ర పెద్దలు బ్యాంకులకు స్వయంగా ఫోన్లు చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

*బీజేపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్‌ను డమ్మీ చేసింది:Mla Jagga reddy
కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నాలు చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.బీజేపీ సర్కార్ ఎలక్షన్ కమిషన్‌ను డమ్మీ చేసిందని ఆయన ఆరోపించారు. బీజేపీ దొడ్డి దారిలో రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొడుతోందని విమర్శించారు. బీజేపీయేతర నేతలను ఇబ్బంది పెడుతున్నారన్నారు.రాహుల్‌గాంధీ పాదయాత్రలకు వెళ్లకుండా బీజేపీ కుట్రలు చేసిందన్నారు.తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు.అలెగ్జాండర్ పతనమైనట్లే.బీజేపీ కూడా పతనం అవుతుందన్నారు.

*షెడ్యూల్డ్ ప్రాంతాలకు చెందిన చట్టాలపై దృష్టి సారించాలి:మంత్రి Satyavathi
షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించిన అన్ని చట్టాలపై దృష్టి సారించాలని రాష్ట్ర గిరిజన స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్అ ధికారులకు సూచించారు.డీఎస్ఎస్ భవన్ లో ఐటిడిఏ ప్రాజేక్ట్ అధికారులతో నిర్వహించిన రెండు రోజుల ట్రేనింగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సమావేశంలోనూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో గురుకుల ఆశ్రమ పాఠశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరడం సంతోష కరమని అన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో యుఆర్జే సీ లో చదువుతున్న విద్యార్థులు ఒకరు ఆనారోగ్యంతో, మరొకరు పురుగులమందు సేవించి మరణించిన ఘటనలపై మంత్రి సీరియస్ గా స్పందించారు. గురుకుల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

*అన్నిరకాల క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం:Talasani
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల క్రీడలను ప్రోత్సహిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం LB ఇండోర్ స్టేడియంలో(lb stadium) తెలంగాణ అమెచ్యూర్ పికిల్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 వ పికిల్ బాల్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ నిర్వహకులు రావుల శ్రీధర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 16 రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకున్నారు.

*పోడు భూములకు పట్టాలేవి: రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోడు భూములకు పట్టాలిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్ తర్వాత ఆ ఊసే మరిచారని విమర్శించారు. పోడుభూమి రైతులకు పట్టాలిచ్చి యజమానులు చేసింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. ఆదివాసీలను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని,వందల మంది ఆదివాసీలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. గిరిజన భూములు లాక్కుని లే అవుట్‌లు వేస్తున్నారని, పోలీసులకు సమయానికి జీతాలు చెల్లించలేని పరిస్థితులు రాష్ట్రం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు పార్లమెంట్ సీట్లతో పాటు మొత్తం అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్‌వేనన్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావు చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగాగే పోడు భూముల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

*మద్దతివ్వమని వైసీపీని ఎన్డీఏ అడగలేదు: రఘురామ
‘‘ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి మా పార్టీకి చెందిన ఎస్టీ మహిళా ఎంపీ జీ మాధవినో లేదా ఎస్సీ వర్గానికి చెందిన ఎంపీలనో పంపించవచ్చు. వారితోనే ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్లపై సంతకం చేయించవచ్చు. అలా ఎందుకు చేయలేదు? ఎస్టీ మహిళ రాష్ట్రపతిగా నామినేషన్‌ వేస్తుంటే పిలవని పేరంటానికి వెళ్లినట్లు ఇతర ఎంపీలు వెళ్లడమేంటి?’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. శుక్రవారం ఆయన కోల్‌కతా నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడారు. ‘‘సామాజిక న్యాయం పేరిట మా పార్టీ ప్రజలను మభ్యపెడుతోంది. ఎన్డీఏ తరఫున రాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశమున్న వాళ్లతో విజయసాయిరెడ్డి ఫొటోలు దిగి ట్విటర్‌లో పెట్టారు. ఇవన్నీ రాష్ట్రంలో న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికే. రాష్ట్రపతి దగ్గర పలుకుబడి ఉందని అనిపించుకోవడం కోసమే. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని బీజేపీ నాయకత్వం మా పార్టీని ఒక్కసారి కూడా అడగనందుకు హ్యాట్సాఫ్‌’’ అని వ్యాఖ్యానించారు.

*తప్పు చేసే పోలీసులను వదిలేది లేదు: చంద్రబాబు
వైసీపీ కార్యకర్తల్లా మారి, గాడి తప్పి, తప్పులు చేస్తున్న పోలీసు అధికారులను వదిలేది లేదని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌రెడ్డి దయాదాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు ఇంతలా దిగజారి పోయారంటే ఆశ్యర్యంగా ఉందని శనివారం ట్విటర్‌లో మండిపడ్డారు. చిత్తూరులో మేయర్‌ దంపతుల హత్య కేసులో సాక్షులను వేధించి, అక్రమ కేసులు పెట్టడంలో అర్థమేంటి? పోలీసులే పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా పెట్టి, కేసులు రాయడం దుర్మార్గం. నేరస్తులను పోలీసులు కాపాడతారా? పోలీసులు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకోవటానికి వచ్చిన చిత్తూరు మాజీ మేయర్‌ కఠారి హేమలత మీదకి… మహిళ అని కూడా చూడకుండా జీపు ఎక్కించడానికి పోలీసులకి ఎంత ధైర్యం? ఎవరి అండ చూసుకుని, ఇలా రాక్షసంగా రెచ్చి పోతున్నారు?’’ అని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వం చేయించిన ఈ దౌర్జన్యకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

*లుక్‌అవుట్‌ తొలగించండి: సుజన
తనకు వ్యతిరేకంగా సీబీఐ జారీచేసిన లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ను తొలగించాలని.. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూన్‌ 30 నుంచి ఆగస్టు 14 వరకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం.. స్పందన తెలియజేయాలని సీబీఐకి ఆదేశాలు జారీచేశారు.

*వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి: బొప్పరాజు
జనవరి డీఏ, డీఏ బకాయిలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2018 జూలై 1 నుంచి 2019 జనవరి 1 వరకు డీఏ ఎరియర్స్‌ ఇప్పటికీ సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 2019 జూలై 1కి సంబంధించిన డీఏ ఎరియర్స్‌ చెల్లించాలని జీవో ఇచ్చి రద్దు చేశారన్నారు. కరోనా సమయంలో కేంద్రం ఫ్రీజ్‌ చేసిన 3 డీఏలు ఎరియర్స్‌తో సహా చెల్లించిందని, కానీ రాష్ట్రం ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. 2021 జూలై 1 డీఏ ప్రకటించినా ఎరియర్స్‌ చెల్లింపుల విషయంలో ప్రభు త్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల డీఏల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారని, అయితే ఎలాంటి నిర్ణయం వెలువడలేదన్నారు.

*సమ్మె ఆలోచన విరమించండి: మంత్రి సురేశ్‌
మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సమ్మె ఆలోచ న విరమించాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పారిశుధ్య కార్మిక సంఘాల నేతలకు సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర పారిశుధ్యకార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. మొత్తం 14 అంశాలను కార్మిక సంఘాల నేతలు ప్రస్తావించారు. అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వారితో అన్నారు.

*ఆరు గిరిజన భాషల్లో వాచకాలు: రాజన్న దొర
గిరిజనులు తమ మాతృభాష ద్వా రా విద్యనభ్యసించేందుకు వీలుగా 6 గిరిజన భాషల్లో రూపొందించిన వాచకాలను ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్నదొర శుక్రవా రం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యా విషయంలో సహజంగా గిరిజనుల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు, వారి మాతృభాషలు సవర, సుగాలి, ఆదివాసి, ఒరియా, కొండకువి, కోయ భాషల్లోనే ఈ వాచకాలను రూపొందించినట్లు చెప్పారు. ఈ విద్యాబోధన 3 సెమిస్టర్లలో సాగుతుందన్నారు.

*రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు: తులసిరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ప్రత్యేక హోదాను సాధించుకునే సువర్ణావకాశాన్ని రాష్ట్రం కోల్పోయిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని, శ్రీరామరక్ష, ప్రాణవాయువు, ఆంధ్రుల హక్కు అని ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్‌ పలుమార్లు చెప్పారన్నారు. ప్రస్తుతం వైసీపీకి 22 మంది లోక్‌సభ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు… వెరసి 31 మంది ఎంపీలు ఉన్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలవాలంటే వైసీపీ మద్దతు కీలకమన్నారు. కానీ ముఖ్యమంత్రి షరతు విధించలేదన్నారు. ‘‘కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారు. బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారింది. మాటతప్పే నాయకుడు రాజీనామా చేయాలని అప్పట్లో జగన్‌ పలుమార్లు డిమాండ్‌ చేశారు. మాట తప్పాడు కాబట్టి జగన్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలి’’ అని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.

*వెంటనే డీఏ బకాయిలు ఇవ్వండి: బొప్పరాజు
జనవరి డీఏ, డీఏ బకాయిలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే విడుదల చేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 2018 జూలై 1 నుంచి 2019 జనవరి 1 వరకు డీఏ ఎరియర్స్‌ ఇప్పటికీ సీపీఎస్‌, ఓపీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. 2019 జూలై 1కి సంబంధించిన డీఏ ఎరియర్స్‌ చెల్లించాలని జీవో ఇచ్చి రద్దు చేశారన్నారు. కరోనా సమయంలో కేంద్రం ఫ్రీజ్‌ చేసిన 3 డీఏలు ఎరియర్స్‌తో సహా చెల్లించిందని, కానీ రాష్ట్రం ఇంతవరకు ఆదేశాలు ఇవ్వలేదన్నారు. 2021 జూలై 1 డీఏ ప్రకటించినా ఎరియర్స్‌ చెల్లింపుల విషయంలో ప్రభు త్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగుల డీఏల బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారని, అయితే ఎలాంటి నిర్ణయం వెలువడలేదన్నారు.

*సమ్మె ఆలోచన విరమించండి: మంత్రి సురేశ్‌
మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, సమ్మె ఆలోచ న విరమించాలని మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పారిశుధ్య కార్మిక సంఘాల నేతలకు సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏఐటీయూసీ, సీఐటీయూ తదితర పారిశుధ్యకార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు. మొత్తం 14 అంశాలను కార్మిక సంఘాల నేతలు ప్రస్తావించారు. అన్ని అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి వారితో అన్నారు.