Movies

వినోదాల ’షికారు’

వినోదాల ’షికారు’

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, కేవీ ధీరజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘షికారు’. నాగేశ్వరి సమర్పణలో శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్‌ పతాకంపై పీఎస్‌ఆర్‌ కుమార్‌ (బాబ్జీ) నిర్మిస్తున్నారు. హరి కొలగాని దర్శకుడు. జూలై 1న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు తెలిపారు చిత్రబృందం. ఈ కార్యక్రమంలో దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ…‘కథలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని వీలైనంత నవ్వించడానికి ప్రయత్నించాం. ఇటీవల ప్రమోషన్‌ టూర్‌కు వెళ్లినప్పుడు మా సినిమా గురించి ప్రేక్షకులకు అవగాహన ఉందని తెలిసింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాం’ అన్నారు. ‘ఈ సినిమా అన్‌లిమిటెడ్‌ ఫన్‌ రైడ్‌లా ఉంటుంది. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ నెల 24న విడుదల చేయాలనుకున్న మా చిత్రాన్ని జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని నిర్మాత పీఎస్‌ఆర్‌ కుమార్‌ అన్నారు. ‘తమిళ అమ్మాయినైనా నన్ను తెలుగు చిత్ర పరిశ్రమ ఆదరించింది. ఈ చిత్రంలో నాదొక అందమైన పాత్ర. మీకు బాగా నచ్చుతుంది’ అని చెప్పింది నాయిక సాయి ధన్సిక.