NRI-NRT

డల్లాస్‌లో మారుమ్రోగిన గోవింద నామ స్మరణ

June 2022 Dallas TTD Kalyanam Was Grand Success

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో DFW Hindu Community-TPADల సహకారంతో జూన్ 25వ తేదీన అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర అలెన్ నగరంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వైఖానస ఆగమం ప్రకారం తితిదే అర్చకులు, వేదపండితులు శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి భక్తి పరవశంతో పులకించారు. ఈ కళ్యాణంలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, ఏఈఓ వెంకటేశ్వర్లు, విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ, APNRTS అధ్యక్షులు వెంకట్ మేడపాటి, ఎన్నారై సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి, ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల(కడప), ఆకేపాటి అమర్నాథరెడ్డి, NATA అధ్యక్షులు శ్రీధరరెడ్డి కొర్సపాటి, రఘువీరరెడ్డి భండారు, డా.ఎన్.వాసుదేవరెడ్డి, TPAD అధ్యక్షుడు రమణ లష్కర్ తదితరులు పాల్గొన్నారు.
June 2022 Dallas TTD Kalyanam Was Grand Success - డల్లాస్‌లో మారుమ్రోగిన గోవింద నామ స్మరణ
June 2022 Dallas TTD Kalyanam Was Grand Success - డల్లాస్‌లో మారుమ్రోగిన గోవింద నామ స్మరణ
June 2022 Dallas TTD Kalyanam Was Grand Success - డల్లాస్‌లో మారుమ్రోగిన గోవింద నామ స్మరణ