NRI-NRT

కారేపల్లిలో ‘తానా’ , గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

కారేపల్లిలో  ‘తానా’ ,  గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

తానా ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు లు అన్నారు. మంచి సంకల్పంతో తన సొంత గ్రామ మైన కారేపల్లిలో ఉచితంగా వైద్య సేవలు అందించాలని ‘తానా జాయింట్ సెక్రటరీ మురళీ తాళ్లూరి ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించటం అభినందనీయమన్నారు. ఆదివారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో కారేపల్లి హైస్కూల్ 10వ తరగతి 93 బ్యాచ్ సహకారంతో .. జరిగిన ఉచిత మెడికల్ క్యాంపును వీరు ప్రారంభించారు. కార్యక్రమంలో తానా జాయింట్ సెక్రటరీ మురళీ తాళ్లూరి, తానా సభ్యులు సునీల్ సావెల్ శ్రీనివాస్ జరుగుల, ఎంపీపీ శకుంతల, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, సింగరేణి సర్పంచ్ స్రవంతి, ఎంపీటీసీ వసంత, ఆత్మకమిటీ చైర్మన్ సత్య నారాయణ, ప్రముఖ ప్రజా వైద్యుడు రాఘవులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
288855367-139029875447223-1540395561004115074-n
289258317-139029895447221-787476397792226742-n
289270301-139029912113886-4296336768799354191-n
289358295-139029058780638-6419528707685116937-n
289781042-139028965447314-1301844661686642157-n
290188554-139028788780665-5636343497515386120-n
290383595-139028718780672-1680031685068854233-n