NRI-NRT

చికాగోలో ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామారావు పుస్తక ఆవిష్కరణ

చికాగోలో ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామారావు పుస్తక ఆవిష్కరణ

గొప్ప చిత్రకారుడిగా,ప్రపంచ ప్రఖ్యాతి సాధించి తెలుగు జాతికి గర్వదాయకుడు కావడమే కాకుండా,కవిగా,రచయితగా కూడా తనదైన గుర్తింపు సాధించుకున్న మహోన్నత వ్యక్తి పద్మశ్రీ యస్.వి.రామారావు అని మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్ అన్నారు. చికాగో నగరంలో చికాగో తెలుగు సాహితీ మిత్రులు,చికాగో తెలుగు సంఘం ఆద్వర్యలో జరిగిన సభలో శ్రీ యస్.వి.రామారావు రచించిన “అలోలాంతరాళాలలో…” కవితాసంపుటిని శ్రీబుద్దప్రసాద్ ఆవిష్కరించారు.
IMG-20220628-WA0029
తెలుగు వారు తమ జాతిలో జన్మించిన గొప్పవారిని గుర్తించి గౌరవించుకోకపోవడం వల్ల,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిద రంగాలలో విఖ్యాతులైనవారి కీర్తిని చాటకపోవడం వల్ల తెలుగుజాతికి తీరని నష్టం జరిగిందని,శ్రీరామారావుకి ప్రపంచగుర్తింపు లభించింది.తెలుగువారికి వారి గురించి తెలిసింది తక్కువైనా,తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తూ ,తెలుగు భాషాసంస్కృతులపట్ల వారికిగల మక్కువ,భారతదేశంపట్ల వారికి గల గౌరవప్పత్తులు తమ కవితల ద్వారా వ్యక్త పరచారని శ్రీ బుద్దప్రసాద్ అన్నారు.
IMG-20220628-WA0030
చికాగో సాహితీమిత్రుల సంస్ద అధ్యక్షులు శ్రీజయదేవ్ మెట్టుపల్లి అధ్యక్షతన జరిగిన సభలో శ్రీమతులు దామరాజు లక్ష్మి,చిమట కమల,మాదిరెడ్డి పద్మ,శ్రీయుతులు జంపాల చౌదరి,శ్రీరామ్ శొంఠి,రవీంద్ర రెడ్డి,ప్రకాష్ తిమ్మాపురం,దాసరి అమరేంద్ర,కార్టూనిస్టు శ్రీధర్ ,గౌరిశంకర్ ప్రభృతులు ప్రసంగించి రామారావు దంపతులను ఘనంగా సత్కరించారు.శ్రీయస్.వి.రామారావు ప్రసంగిస్తూ తన అభ్యున్నతికి దోహదపడిన వారందరినీ పేరుపేరునా స్మరించుకున్నారు.ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించి తెలుగునాట తనకు ప్రభుత్వగర్ింపు లభింపచేసిన శ్రీమండలి వెంకట కృష్ణారావుకి తన కవితాసంపుటి అంకితం శారు. మాతృభాషని, మాతృసంస్కృతిని, మాతృదేశాన్ని మరువరాదని ఆయన అన్నారు.కృషి చేస్తే సాధించనదంటూ ఉండదని అన్నారు. 
IMG-20220628-WA0031
IMG-20220628-WA0032