NRI-NRT

డల్లాస్‌లో కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణం

డల్లాస్‌లో కన్నుల పండువగా శ్రీనివాసుని కల్యాణం

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అమెరికాలోని డల్లాస్‌లో అంగరంగవైభవంగా జరిగింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కల్యాణాల్లో భాగంగా డాల్లాస్‌లోని క్రెడిట్‌ యూనియన్‌ ఆఫ్‌ టెక్సాస్‌ ఈవెంట్‌ సెంటర్‌లో కన్నుల పండువగా నిర్వహించారు. కరోనా వల్ల శ్రీవారిని దర్శనభాగ్యానికి నోచుకోలేకపోయిన డల్లాస్‌లోని తెలుగువారందరూ తమకు దక్కిన అరుదైన అవకాశానికి మురిసిపోయారు. వెంకన్నను దర్శించుకునేందుకు 12 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కడప జడ్పీ చైర్‌పర్సన్‌ అమర్‌నాథ్‌ రెడ్డి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Dallas-srinivas-kalyanam
తెలుగుదనం ఉట్టిపడేలా..
టీపాడ్‌ ప్రతినిధులు కల్యాణ వేడుకలను ఆధ్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించారు. సుప్రభాత సేవతో మొదలుపెట్టి తోమాల సేవ, అభిషేక సేవలు ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించి ఈ సేవల్లో పాల్గొన్న వారికి టీపాడ్‌ నిర్వాహకులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
Dallas-srinivas-kalyanam1
ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌ సమన్వయంతో..
ఆమెరికాలో ఉంటున్న తెలుగువారందరికీ పద్మావతీ అలిమేలు సమేత తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ APNRTS సహకారంతో టీటీడీ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. కల్యాణ ఘట్టాన్ని తిలకించి భక్తిపరవశంతో పులకరిస్తున్నారు. కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులందరికీ తిరుమల నుండి తెచ్చిన లడ్డూ ప్రసాదం అందిస్తున్నారు. జూన్‌ 25న డల్లాస్‌ వేదికగా స్వామివారి కల్యాణం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా డాలస్‌ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్‌) పేర్కొన్నది.
TTD-1
వైవీ సుబ్బారెడ్డి దంపతులకు సత్కారం
శ్రీనివాసుని కల్యాణాన్ని కన్నువల పండువగా నిర్వహించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, అర్చకులు, పండితులను టీపాడ్‌ అధ్యక్ష కార్యదర్శులు విశేష రీతిలో సత్కరించారు. పద్మావతీ అలివేలు సమేత వెంకన్ననను దర్శనం చేసుకున్న వారందరికీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.
TTD-2
టీపాడ్‌ ప్రతినిధులు రామ్‌ అన్నాడి, రఘువీర్‌ బండారు, నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, అజయ్‌ రెడ్డి, రావు కల్వల సలహాదారులుగా వ్యవహరించారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన రమణ లష్కర్‌, ఇందు పంచెర్పుల, అశోక్‌ కొండల, రఘువీర్‌ బండారు, రామ్‌ అన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్‌ కలసాని, విజయ్‌ తొడుపునూరి, చంద్రారెడ్డి పోలీస్‌, కరణ్‌ పోరెడ్డి, పాండురంగారెడ్డి పాల్వాయి, రవికాంత రెడ్డి మామిడి కార్యక్రమ నిర్వహణకు విశేష కృషిచేశారు.
TTD-3
వివిధ కమిటీలకు చైర్స్‌గా వ్యవహరించిన నరేష్‌ సుంకిరెడ్డి, బాల గంగవరపు, స్వప్న తుమ్మపాల, మంజుల తొడుపునూరి, రూప కన్నయ్యగారి, మధుమతి వ్యాసరాజు, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, లక్ష్మీ పోరెడ్డి, శ్రీనివాస్‌ అన్నమనేని, రత్న ఉప్పల, శ్రీధర్‌ వేముల, రేణుక చనుమోలు, జయ తెలకపల్లి, శ్రీనివాస్‌ తుల, లింగారెడ్డి ఆల్వా, సుమన బసని, రోజా ఆడెపు, గాయత్రి గిరి, మాధవి మెంట, శ్రీనివాస్‌ రెడ్డి పాలగిరి, వెంకట్‌ అనంతుల, వీర శివారెడ్డి, రవీంద్రనాథ్‌ ధూలిపాల, సంతోషి విశ్వనాథుల, రాజా వైశ్యరాజు, అభిషేక్‌రెడ్డి కార్యక్రమం విజయవంతానికి సహకారం అందించారు.
TTD-5