DailyDose

ఈ నెల 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర – TNI తాజా వార్తలు

ఈ నెల 30 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర   –  TNI  తాజా వార్తలు

* మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్‌ యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 (గురువారం) నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్‌ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్‌ దర్శన ఏర్పాట్లు కూడా చేసింది. యాత్రకు వచ్చేవారు ఆధార్‌ కార్డు (లేదా) బయోమెట్రిక్‌ వివరాల ఆధారంగా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. 2019లో అర్టికల్‌ 370 రద్దుతో యాత్రను అర్ధంతరంగా నిలిపివేశారు. 2020, 2021లో కరోనా కారణంగా యాత్రను నిర్వహించలేదు.

*లక్షద్వీప్ ఎన్‌సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్ రజాక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఓ కేసును నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం జరిగినట్లు సీబీఐ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైందని తెలుస్తోంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన విజిలెన్స్ డిపార్ట్‌మెంట్సీ బీఐ కలిసి నిర్వహించిన సోదాల్లో నేరారోపణ చేయదగిన పత్రాలు దొరికినట్లు సమాచారం

*వైకాపా గూండాలు అధికార మదంతో రెచ్చిపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ప్రజలు, అధికారులపై దాడులు అయిపోగా.. ఇప్పుడు పాత్రికేయుల వంతు వచ్చిందని ఆక్షేపించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్నగర్ వద్ద జర్నలిస్ట్ ఈశ్వర్పై వైకాపా నేత, శ్రీకాళహస్తీశ్వర ఆలయం బోర్డు మెంబర్ జయ శ్యామ్ దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈశ్వర్కి చెందిన స్థలాన్ని కబ్జా చెయ్యడమే కాకుండా ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ భౌతిక దాడికి పాల్పడటం దారుణమని దుయ్యబట్టారు. జర్నలిస్ట్పై దాడికి పాల్పడిన జయశ్యామ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్ట్ స్థలాన్ని తిరిగి ఆయనకి చెందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

* గుడివాడలో రేపు జరుగనున్న టీడీపీ(TDP) మహానాడు వాయిదా పడింది. ఎడతెరిపి లేని వర్షం, వాతావరణం అనుకూలంగా లేనందున కార్యక్రమం వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. గుడివాడలో రేపటి మహానాడు నిర్వహణపై మంగళవారం చంద్రబాబుతో ముఖ్యనేతలు సమీక్ష నిర్వహించారు. గుడివాడ మహానాడు నిర్వహించుకున్న తర్వాతే మరో కార్యక్రమం చేపడదామని ఈ సందర్భంగా అధినేత తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా గుడివాడ మహానాడు తదుపరి తేదీ ఖరారు చేయాలని నేతలకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

*అనంతలో జిల్లా స్థాయి YCP ప్లీనరీ సమావేశం వెలవెలబోయింది. ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ‘ఏందయ్యా మాకు ఒక మనిషి.. ఆర్డీవో కూడా పలకడం లేదు’ అంటూ మంత్రి పెద్దిరెడ్డి ముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో సగానికిపైగా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

*జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే ఇళ్లను కట్టించాలని, టిడ్కో ఇళ్లు వెంటనే ఇవ్వాలంటూ సీపీఎం డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టింది. ఈ సందర్బంగా సీపీఎం నేత దోనేపూడి కాశీనాథ్ఇ క్కడ మీడియాతో మాట్లాడుతూ పేదలకు ఇళ్లు ఇస్తానని జగన్ ఎన్నికల సమయంలో ఘనంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఊరికి దూరాన ఎక్కడో సెంటు స్థలం ఇచ్చామని పత్రాలు చేతిలో పెట్టారు.. స్థలం చూపించకుండా రూ. 35 వేలు కట్టాలని చెబుతున్నారని, కోర్టులో కేసులు ఉన్నా… అమరావతి ప్రాంతంలో స్థలాలు ఎలా ఇచ్చారు?.. ఇచ్చిన స్థలాల్లో కూడా ఇళ్లు కట్టుకోవాలని పేదలపై భారం మోపుతున్నారన్నారు. రూ. లక్షా యనభైవేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపు కుంటుందని విమర్శించారు. డబ్బులు లేక మధ్యలోనే ఇళ్ల నిర్మాణం నిలిచిపోతుందన్నారు.

*మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు అమలు చేసినా.. ప్రధానిగా ఆర్థిక సరళీకరణ విధానాల ద్వారా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించినా.. మాటల కన్నా చేతలకే ప్రాధాన్యమిచ్చిన మేధావి పీవీ నరసింహారావు’’ అని కొనియాడారు. తెలుగు వెలుగు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి దేశసేవను స్మరించుకుంటూ ఆయన స్మృతికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.

* సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మోహన్ బాబు తన కుమారులతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టుకు హాజరవుతున్నారు. నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మోహన్‌బాబు, విష్ణు , మనోజ్‌ లు పాదయాత్రగా కోర్టు (Court)కు బయలుదేరారు. 2019 మార్చి 22న తిరుపతి మదనపల్లెలో జాతీయ రహదారిపై ఫీజ్ రియంబర్స్ చెల్లించలేదని తమ విద్యార్థులతో కలిసి మోహన్ బాబు ధర్నా చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిగింది. పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఏ1 నుంచి ఏ5 వరకు నేరానికి పాల్పడ్డారంటూ చార్జిషీటులో పేర్కొన్నారు.

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. భక్తులను నందీశ్వరుడి విగ్రహం వద్ద వరకే అనుమతించారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. ఆషాఢమాసం ప్రారంభానికి ముందు చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు

*ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు సోమవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉచిత ప్రయాణం కోసం బ్యాటరీ కారును ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్‌ 10వ నెంబర్‌ ప్లాట్‌ఫాంపై సికింద్రాబాద్‌ రైల్వే డీఆర్‌ఎం ఏకే గుప్తా, ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ యాదగిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బ్యాటరీ కారు 1 నుంచి 10 ప్లాట్‌ఫాంలలో ప్రతీ రోజు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌లో రైలు దిగిన వృద్ధ్దులు, దివ్యాంగులు, పిల్లలకు ప్రాఽధాన్యత ఇస్తూ ప్రయాణికులను నేరుగా స్టేషన్‌ బయటే దింపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న, డీసీఎం రైల్వే అధికారి బసవరాజు, ఏడీఆర్‌ఎం ఆర్టీసీ డివిజనల్‌ మేనేజర్‌(సికింద్రాబాద్‌) ఆపర్ణ కల్యాణి, డిపో మేనేజర్లు లక్ష్మి, సుధాకర్‌, రామ్మోహన్‌ యేసులతోపాటు ఆర్టీసీ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

*ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలపాతాలన్నీ కొత్త శోభను సంతరించుకుని కనువిందు చేస్తున్నాయి. బొగత జలపాతా నికి వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల తో.. జలపాతాలకు వరద ప్రవాహం పెరిగింది. జలపాతాల సందర్శనకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. వసతుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

*వచ్చే ఎన్నికల్లో జనగామ నుంచి పోటీచేస్తున్నారన్న వార్తలపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 12 నియోజకవర్గాలకు ఎమ్మెల్సీగా గెలుపొందానని.. అందరి బాగోగులు చూసే వ్యక్తినని అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు జనగామలో ఇన్చార్జ్‌గా పనిచేశానని, జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో వెంట నడుస్తున్నాని, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో సైతం తనకు అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నాయకత్వంలో జనగామ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

*హనుమకొండ: జిల్లాలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ నగర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డబ్బులు బెడ్రూం ఇళ్లు కేటాయించాలంటూ మంగళవారం ఉదయం పేదలు ధర్నాకు దిగారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఐదేళ్లు గడిచినా ఇళ్లను పంపిణీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లేందుకు పేదలు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అచ్చం అలాంటి వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తమకు శత్రువులుగా ఉన్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వీరి ఆరోపణల నేపథ్యంలో ఎవరా సీనియర్లు అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్‌కు బంధువైన బాలినేని ఇలాంటి ఆరోపణలు ఊరికే చేయరనే వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి.

*రాష్ట్రంలో రైతుబంధు సంబురం మొద‌లైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు న‌గ‌దు జ‌మ అవుతోంది. న‌గ‌దు జ‌మ అయిన వెంట‌నే రైతుల ఫోన్ల‌కు మేసేజ్‌లు రావ‌డంతో.. అవి మోగిపోతున్నాయి. ఆ మేసేజ్‌ల‌ను చూసి రైతులు మురిసిపోతున్నారు. ఇక ఆ న‌గ‌దును డ్రా చేసుకునేందుకు బ్యాంకుల వ‌ద్ద‌కు రైతులు వెళ్తున్నారు. అలా ప్ర‌తి ఊరులో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిత్ర‌ప‌టాల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు.. ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు రైతులు.

*భూ కుంభకోణం కేసులో శివ‌సేన నేత‌, ఎంపీ సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మంగ‌ళ‌వారం మ‌రోసారి స‌మ‌న్లు జారీ చేసింది. మంగ‌ళ‌వారం విచార‌ణ అధికారుల ఎదుట హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టికే సంజ‌య్ రౌత్‌కు ఈడీ సమ‌న్లు జారీ చేయ‌గా ఆయన హాజ‌రు కాలేదు.ఈడీ ఎదుట హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని ఆయ‌న కోరారు. సంజ‌య్ రౌత్ భార్య‌, ఆయ‌న అనుచ‌రులకు చెందిన రూ 11 కోట్ల విలువైన ఆస్తుల‌ను మ‌నీల్యాండ‌రింగ్ నియంత్ర‌ణ చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అంత‌కుముందు అటాచ్ చేసింది.ముంబైలోని గోరేగావ్ స‌బ‌ర్బ్ ప్రాంతంలోని ఓ ప్రాజెక్టు రీడెవ‌ల‌ప్‌మెంట్‌లో అక్ర‌మాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై ఈడీ ద‌ర్యాప్తు చేప‌డుతోంది. మ‌రోవైపు మ‌హారాష్ట్ర సంక్షోభం నేప‌ధ్యంలోనే శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌పై కేంద్ర ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు ఏజెన్సీల‌ను ప్ర‌యోగిస్తోంద‌ని శివ‌సేన నేత‌లు ఆరోపిస్తున్నారు. తాను ఎలాంటి ఒత్తిళ్ల‌కు త‌లొగ్గేది లేద‌ని సేన ఎంపీ సంజ‌య్ రౌత్ స్ప‌ష్టం చేశారు.

*కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయి. మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. గత మూడు రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇండ భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

*నేపాల్‌లోని ఖాట్మండు వ్యాలీలో పానీ పూరీ అమ్మకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిషేధించింది. పానీపూరీలో ఉపయోగించే నీటిలో కలరా బ్యాక్టీరియా ఉన్నీట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే పానీ పూరీ అమ్మకాలను నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు లలిత్ పూర్‌ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు అధికంగా నమోదయ్యాయని తెలిపారు.ప్రస్తుతం దేశంలో కలరా రోగుల సంఖ్య 12కు చేరుకున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ కలరా వ్యాప్తిని అరికట్టేందుకు మహానగరాల్లోనూ, రద్దీ ప్రాంతాలు, కారిడార్‌ వంటి ప్రాంతాల్లో పానీ పూరీ విక్రయాలను నిషేధించారు. అంతేకాదు ఎవరికైన కరోనా లక్షణాలు కనిపించినట్లయితే సమీప ఆరోగ్య కేంద్రాలను సందర్శించాలని ప్రజలను అధికారులు కోరారు. ముఖ్యంగా వేసవి, వర్షాకాలాల్లో డయేరియా, కలరా వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రిత్వ శాఖ అభ్యర్థించింది.

*న పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీవీ 101 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి నివాళులు అర్పించారు.

*తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు జరిగే కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉంటుంది. గవర్నర్‌కు, సీఎం కేసీఆర్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలో ఈసారి కేసీఆర్‌ హాజరవుతారా? లేదా? అన్న అంశంపై తొలుత సందేహం ఏర్పడింది. అయితే ఈ కార్యక్రమానికి ఆయన వెళ్తారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకొని తరించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. భక్తులను నందీశ్వరుడి విగ్రహం వద్ద వరకే అనుమతించారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. ఆషాఢమాసం ప్రారంభానికి ముందు చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు

*ఆస్ట్రేలియాలో జరిగే టీ వరల్డ్‌ క్‌పకు ముందు నిర్వహించే ముక్కోణపు సిరీస్‌లో పాకిస్థాన్‌ పాల్గొననున్నట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా తెలిపాడు. న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టీ సిరీ్‌సలో పాక్‌తోపాటు బంగ్లాదేశ్‌ కూడా ఆడనుంది. అక్టోబరు మొదటివారంలో ఈ సిరీ్‌సను షెడ్యూల్‌ చేసే అవకాశం ఉందని రమీజ్‌ చెప్పాడు.

*కృష్ణా జిల్లా గుడివాడలో మరో రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించనున్న తరుణంలో వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి.గుడివాడ రూరల్‌ మండలం బొమ్ములూరులో ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైసీపీ రంగులు పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే మండలంలోని అంగలూరులో నిర్వహించనున్న మినీ మహానాడుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. దీనికి కూతవేటు దూరంలోని బొమ్మలూరులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి వైసీపీ రంగులు పూయడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విషయం తెలుసుకుని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుమాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు హుటాహుటిన బొమ్ములూరు చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు.టీడీపీ మండల అధ్యక్షుడు వాసే మురళీకృష్ణ తదితరులు ఆ దిమ్మెకు తిరిగి పసుపు రంగు వేశారు. మాజీ మంత్రి కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మహానాడు బ్యానర్లపై అధికార పార్టీ నాయకులు తమ బ్యానర్లు కట్టుకున్నారంటూ మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కాగా టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూరల్‌ సీఐ జయకుమార్‌ అక్కడికి పోలీసు బలగాలను తరలించారు. పికెట్‌ ఏర్పాటు చేశారు.

*అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాలు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభమయ్యాయి. త్యాగరాజ భవనంలో సీతారామరాజు చిత్రపటానికి కలెక్టర్‌ ప్రశాంతి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు. ఈసందర్భంగా త్యాగరాజ భవనం నుంచిప్రారంభమైన విద్యార్థుల ర్యాలీ ప్రకాశం చౌక్‌ వరకు కొనసాగింది. కాగా, సీతారామరాజు జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు జూలై 4న భారత ప్రధాని నరేంద్రమోదీ భీమవరం వస్తున్న సందర్భంగా వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

* పాలకులుగా, అధికారులుగా మనం గొంతులేని వారి పక్షాన నిలవాలని, వారివైపు నుంచే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రైతుల విషయంలోనూ వారి పక్షానే నిలిచి, వారు పండించిన పంటకు మద్దత ధర కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ఖరీఫ్‌ ప్రారంభం నేపథ్యంలో తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సంబంధిత మంత్రులు అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసేయాలి. ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలి. ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదు. ధాన్యం కొనుగోలు బాధ్యత పౌరసరఫరాల శాఖదే. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత.. ఆ ధాన్యాన్ని వేరే వేబ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలి.

*పాఠశాలల్లో మరుగు దొడ్లు, పాఠశాలల నిర్వహణ ఖర్చుల కోసమని చెప్పి అమ్మ ఒడి కింద ఇచ్చే రూ. 15 వేలలో రూ. రెండు వేలను ప్రభుత్వం కోత కోస్తోంది. అందులో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వారి నుంచి కోత కోసిన డబ్బు ప్రైవేటు పాఠశాలలకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదు’ అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. సోమవారం ఇక్కడ ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం విలేకరులతో మాట్లాడారు. అమ్మ ఒడి లబ్ధిదారులుగా ఉన్న వారిలో ఇరవై లక్షల మంది తల్లులు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్నారని, ఒక్కొక్కరి నుంచి రూ.2వేల చొప్పున మొత్తం రూ.800 కోట్లు ప్రభుత్వం కత్తిరించి ఎవరికీ ఇవ్వకుండా తనే ఉంచుకొంటోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ స్కూళ్లలో మరుగు దొడ్ల నిర్వహణకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని.. ఆయాలకు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని.. అమ్మ ఒడి నుంచి కత్తిరిస్తున్న డబ్బులు ఎటు పోతున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

*సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతమున్న రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ ప్రకటించారు. సిరిపురంలోని చిల్డ్రన్‌ ఎరీనాలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ ఎంఎ్‌సఎంఈ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భూమి కేటాయిస్తే స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు పారిశ్రామిక దిగ్గజం ఆదిత్యమిట్టల్‌ సానుకూలంగా ఉన్నారన్నారు. విశాఖను బీచ్‌ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 1.25 లక్షల ఎంఎ్‌సఎంఈలను ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని, వాటిలో 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రణాళికలు తయారుచేశామని చెప్పారు.

*మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. తనను ఎవరు టార్గెట్‌ చేస్తున్నారో తెలుసని.. వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు.తనపై ఆరోపణలు చేస్తున్నవారితో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. పవన్ రిక్వెస్ట్ చేస్తేనే జనసేనవారిపై కేసులు ఉపసంహరించుకున్నానని తెలిపారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు.

*ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మొన్నదావోస్‌కు వెళ్లింది అధికారిక పర్యటన కాగా.. ఇప్పుడు ఫ్రాన్స్‌కు వెళ్తున్నది పూర్తిగా వ్యక్తిగతం. జూన్ 28వ సాయంత్రం 7.30కు ఫ్రాన్స్‌కు బయల్దేరుతారు. పారిస్‌లో ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో జగన్ పెద్ద కూతురు హర్షిణి రెడ్డి మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. జూలై 2న బిజినెస్ స్కూల్లో జరిగే కాన్వొకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరవుతున్నారు. జూలై 3వ తేదీ ఉదయం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

* కొవిడ్‌ నేపథ్యంలో ఆస్తిపన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఎప్పటినుంచో బకాయిలున్న వాణిజ్యవేత్తలు జూలై 31లోపు ఆ బకాయిలను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని ఏపీఐఐసీ ప్రకటించింది. 2022- 23కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు కూడా ఒకేసారి చెల్లిస్తే ఐదుశాతం రాయితీ వర్తిస్తుందని ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. వివరాలు సీజీజీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

*కొవిడ్‌ నేపథ్యంలో ఆస్తిపన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఎప్పటినుంచో బకాయిలున్న వాణిజ్యవేత్తలు జూలై 31లోపు ఆ బకాయిలను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ ఇస్తామని ఏపీఐఐసీ ప్రకటించింది. 2022- 23కు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు కూడా ఒకేసారి చెల్లిస్తే ఐదుశాతం రాయితీ వర్తిస్తుందని ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. వివరాలు సీజీజీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉన్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

*రాజస్థాన్‌ నుంచి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, దక్షిణ ఒడిసా, ఉత్తరాంధ్ర మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు తూర్పు, పడమర ద్రోణి విస్తరించింది. మరోవైపు కేరళ నుంచి గుజరాత్‌ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో అరేబియా సముద్రం నుంచి దక్షిణ, మధ్య భారతంపైకి బలమైన తేమగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో సోమవారం అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

*కరోనా వైరస్‌.. మళ్లీ కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలో అధికారికంగా తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలోని కొత్తపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు బిక్కవోలు పీహెచ్‌సీ వైద్యాధికారి రాజీవ్‌ తెలిపారు. కాకినాడలోని ప్రైవే టు కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఆ యువకుడి స్నేహితునికి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆ యువకుడు 2 రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చి కరోనా పరీక్ష చేయించుకున్నారని, సోమవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం యువకుడు హోం ఐసొలేషన్‌లో ఉన్నాడని వెల్లడించారు.

*రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి తర్వాత స్థానంలో ఉన్న సీనియర్‌ న్యాయమూర్తి న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పట్నాకు బదిలీ అయ్యారు.

*మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి మహారాష్ట్రలో సోమవారం పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతున్న పథకాలు, విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, బాలింతలకు అందిస్తున్న కిట్ల వివరాలను అధికారులు వారికి వివరించారు.
ఉస్మానాబాద్‌ జిల్లా తుల్జాపూర్‌ మండలం మంగరుల్‌ గ్రామంలోని బాల్‌ఆనంద్‌ భవన్‌ ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవల్‌పమెంట్‌ స్కీమ్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని మంత్రులు సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను మంత్రి సత్యవతి రాథోడ్‌ అక్కడి అధికారులకు వివరించారు. మహారాష్ట్రలోని విద్యార్థులకు పౌష్టికాహారం ఇంటికి పంపిస్తున్నారని, కానీ తెలంగాణలో అంగన్‌వాడీ సెంటర్‌లోనే వంట చేసి అందిస్తున్నారని తెలిపారు. అంతకుముందు మంత్రులు సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి తుల్జా భవాని ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు.

*ఇంటర్మీడియట్‌ విద్యలో సాధారణ టైం స్కేల్‌లో పనిచేస్తున్న 74 మంది జూనియర్‌ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వీరిలో 22 మంది సాధారణ, 52 మంది ఒకేషనల్‌ కళాశాలల జూనియర్‌ లెక్చరర్లు ఉన్నారు. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌కు సూచించారు.

*అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్లేందుకు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎలక్రిక్‌ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలకు సంబంధించిన వ్యాపార లావాదేవీలపై చర్చలు జరిపేందుకు వెళ్లాల్సి ఉందని.. తనకు వ్యతిరేకంగా సీబీఐ జారీచేసిన లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ను తొలిగించాలని పేర్కొంటూ ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జూన్‌ 30 నుంచి ఆగస్టు 14 వరకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం విదేశీ యాత్రకు అనుమతి ఇచ్చింది. తిరుగు ప్రయాణం తేదీలను సీబీఐకి తెలియజేయాలని సూచించింది.

* ‘ఐటీడీఏ పీవో రావాలి.. తమ సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్‌ చేస్తూ అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచ్‌ పలువురు గిరిజనులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. తన పరిధిలోని గ్రామాల్లో మౌలిక వ సతులు కల్పించాలని, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతున్నా రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురం అధికార పార్టీ సర్పంచ్‌ సోనీ శివశంకర వరప్రసాద్‌ సోమవారం చేపట్టిన నిరశన దీక్షకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురంలో నివాసాలు ఏర్పాటు చేసుకు న్న గిరిజనులు సుమారు 20 ఏళ్లుగా చీకట్లోనే జీవిస్తున్నారు. అటవీ భూములు కా వడంతో ఆ గ్రామంలో విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించలేదు. ఈ సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌ ప్రసాద్‌.. ప్రజాప్రతినిధులు, ఐటీడీఏ పీవో, జిల్లా పాలనాధికారులను అనేకసార్లు కలిసి విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఐటీడీఏ పీవో వచ్చి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిమ్మాపురంలో దీక్షకు దిగారు. ఇందుకు గ్రామస్థులు కూడా మద్దతు పలికారు. తాను బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అయ్యిందని, అధికారులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కకపోవడంతోనే దీక్షకు దిగానని సర్పంచ్‌ ప్రసాద్‌ వెల్లడించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ దీక్ష విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి దీక్షా శిబిరానికి వెళ్లి సర్పంచ్‌ ప్రసాద్‌, గిరిజనులతో మాట్లాడారు. సమస్యలను పరిష్కరిస్తామని, వెంటనే దీక్షను విరమించాలని కోరారు. అయితే సమస్యలు పరిష్కారమయ్యే వరకు దీక్ష కొనసాగుతుందని గిరిజనులు ఆయనకు తేల్చి చెప్పారు.

*టెట్‌ తప్పనిసరి చేసింది ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు ఎయిడెడ్‌లో కొత్తగా చేరేవారికి మాత్రమేనని విద్యాశాఖ అధికారులు తెలిపారని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ ప్రతినిధులు ఎల్‌కే చిన్నప్ప సీహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి చెప్పారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ అధికారులను కలిసి చర్చించగా ఈ మేరకు స్పష్టత నిచ్చారన్నారు.