Health

కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ కేసులు

కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ కేసులు

కేరళను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదకర వైరస్‌ల వ్యాప్తితో వణుకుతున్న కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ (Anthrax) కేసులు వెలుగు చూడడం కలవరం రేపింది. అత్తిరప్పిళ్లి అటవీ ప్రాంతంలో ఆంత్రాక్స్‌ కారణంగా అడవి పందులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. అయితే, వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అత్తిరప్పిళ్లి ప్రాంతంలోని అటవీ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల ఐదారు అడవి పందులు (Wild Boars) మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వాటి నమూనాలను పరీక్షించిన అనంతరం అవి ఆంత్రాక్స్‌ వల్లే మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించిన పశుసంవర్థక శాఖ అధికారులు.. నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇతర పశువులు లేదా మనుషులకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు గాను స్థానికంగా పశువులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు.