Movies

సూర్యకు ఆస్కార్‌ పిలుపు

Auto Draft

 తమిళ హీరో సూర్య మరో అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆస్కార్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం అందుకున్న తొలి హీరో సూర్యనే కావడం విశేషం. ఈసారి ఆస్కార్‌ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది సినీ ప్రముఖులను ఆర్గనైజింగ్‌ కమిటీకి ఎంపిక చేశారు. బాలీవుడ్‌ నుంచి నటి కాజోల్‌, దర్శకురాలు రీమా కగ్తి, సుస్మితా ఘోష్‌, రీంతు థామస్‌, నిర్మాత ఆదిత్య సూద్‌ ఉన్నారు. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) సినిమా భారత్‌ నుంచి 93వ ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లగా, ‘జై భీమ్‌’ సినిమా 94వ ఆస్కార్‌ షార్ట్‌ లిస్టులో ఎంపిక కాలేదు.ఈ రెండు చిత్రాల ప్రభావమే సూర్యను ఆస్కార్‌ ఆర్గనైజింగ్‌ కమిటీలోకి ఆహ్వానించేలా చేసిందని తెలుస్తున్నది. ఇటీవల సూర్య ‘విక్రమ్‌’ సినిమాలో రోలెక్స్‌ పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. సినిమా విజయానికి కొసమెరుపు అయ్యారు. సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. రెగ్యులర్‌ చిత్రీకరణలో ఉందీ సినిమా.