Sports

నీరజ్‌ చోప్రా అరుదైన ఫీట్‌.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు

Auto Draft

భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్‌లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. గురువారం స్టాక్‌హోమ్‌ వేదికగా జరిగిన ఈ లీగ్‌ పోటీల్లో నీరజ్ తృటిలో బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ పోటీల్లో 89.4 మీటర్ల అద్భుతమైన త్రోతో రెండో స్థానంలో నిలిచిన చోప్రా రజిత పతకం కైవసం చేసుకున్నాడు. ఇక గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 90.31 మీటర్ల బెస్ట్ త్రోతో తొలి స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు.కాగా డైమండ్‌ లీగ్‌లో నీరజ్‌కు ఇదే తొలి పతకం. కాగా ఇటీవల ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్‌ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి జాతీయ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డైమండ్ లీగ్‌లో తన తొలి ప్రయత్నంలోనే 89.4 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఆ తర్వాత వరుసగా చోప్రా 84.37మీ, 87.46మీ, 84.77మీ, 86.67, 86.84మీ త్రోలు చేశాడు.