Devotional

5న బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణం

Auto Draft

హైద‌రాబాద్‌లోని బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ల్యాణ మ‌హోత్స‌వం ఈ నెల 5వ తేదీన జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసి క‌ల్యాణ మ‌హోత్స‌వ వేడుక‌ల ఆహ్వాన ప‌త్రికను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆల‌య పండితులు వేద‌మంత్రాల‌తో ఆశీర్వ‌చ‌నం అందించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి సహా ధర్మకర్త మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.