NRI-NRT

చికాగోలో వైభవంగా శ్రీవారి కళ్యాణం

చికాగోలో వైభవంగా శ్రీవారి కళ్యాణం

తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణం అమెరికాలోని చికాగో నగరంలో వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని టీటీడీ అర్చకస్వాములు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం, సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు. హెచ్ జీటీసీ దేవస్థానం నిర్వహకులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.
29-1
ఈ కార్యక్రమంలో ప్రముఖ అవధాని డాక్టర్‌ మేడసాని మోహన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రవాసాంధ్రుల వ్యవహారాలు, ఏపీఎన్ ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ ఏఈవో బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అమెరికాలోని 9 నగరాల్లో కళ్యాణ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు నగరాల్లో నిర్వహించిన టీటీడీ చికాగో నిర్వహించడం మూడోది. జూలై ౩న వాషింగ్టన్ డి.సి ఆటా మహాసభలలో కళ్యాణం నిర్వహణఖు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 9 న అట్లాంటా, 10 న బర్మింగ్ హామ్ – అలబామాలలో శ్రీవారి కళ్యాణం నిర్వహించనున్నారు.