DailyDose

అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు – TNI నేర వార్తలు

అమెరికాలో కాల్పులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు – TNI  నేర వార్తలు

* అగ్రరాజ్యం అమెరికాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒక దుండగుడు షికాగో నగర శివారులోని ఐలండ్‌ పార్కు వద్ద జరుగుతున్న ఇండిపెండెన్స్‌ డే పరేడ్‌పై కాల్పులకు జరిపాడు. దీంతో షికాగో పోలీసులు ఆ ఘటనకు పాల్పడిన నిందితుడి ఆచూకి కోసం నగరమంతా జల్లెడ పట్టారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడు 22 ఏళ్ల రాబర్ట్‌ క్రిమోగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.అతను హైపవర్‌ రైఫిల్‌తో వేడుకలకు వచ్చిన ప్రేక్షక్షులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురుమృతి చెందారని వెల్లడించారు. అంతేకాదు ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, కొందరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.నిందితుడు క్రిమో వద్ద ఆయుధాల ఉన్నాయని, అతను అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని కూడా చెబుతున్నారు. అమెరికన్లకు బహిరంగంగా తుపాకీని తీసుకెళ్లే ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటనలు అధికమవ్వడం బాధాకరం. అదీకూడా అమెరికా స్వాతం‍త్య్ర దినోత్సవం రోజున జరగడమే అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.అమెరికన్లే తమ దేశ వేడకలను భగ్నపరిచి విధ్వంసానికి పాల్పడటం అత్యంత హేయం అంటూ… ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ ఘటన పట్ల కలత చెందానన్నారు. బైడెన్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాదు తాను తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాడతానని వెనక్కి తగ్గేదేలేదని బైడెన్‌ నొక్కి చెప్పారు.

*ఏపీలో వైఎస్సార్‌ జిల్లాలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు, ఖాజీపేట అటవీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ కూడా ఉన్నారు.

* కృష్ణా జిల్లాలో 20 లక్షలు విలువ చేసే గంజాయిని ఎస్ఈబీ (SEB) అధికారులు ధ్వంసం చేశారు. గత మూడు నెలలలో పట్టుకున్న గంజాయికి నిప్పంటించి కాల్చిబూడిద చేశారు. ఈస్ట్, వెస్ట్, కృష్ణా జిల్లాల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 770 కేజీల గంజాయిని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. పలు ప్రదేశాల్లో పట్టుకున్న గంజాయిని మొత్తాన్ని గుట్టగా పోసి పోలీస్ అధికారుల సమక్షంలో నిప్పంటించారు. గన్నవరం మండలం గొలనపల్లి శివారులో కొండ ప్రాంతంలో గంజాయిని కాల్చి బూడిద చేశారు.

*చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతు.మచిలీపట్నం మండలం క్యాంబెల్‌పేటకు చెందిన నలుగురు మత్స్యకారులు చేపలవేట కోసం నాలుగు రోజుల క్రితం సముద్రంలోకి పయనం .తాము ప్రయాణిస్తున్న బోటు ఇంజన్‌ పాడైనట్లు కుటుంబ సభ్యులకు మత్స్యకారులు ఫోన్‌ ద్వారా సమాచారం .గత రెండు రోజుల నుంచి వారి సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన .గల్లంతైన మత్యకారులు విశ్వనాథపల్లి చినమస్తాన్ రామాని, నాంచార్లు, చెక్క నరసింహారావు, మోకా వెంకటేశ్వరరావుగా గుర్తింపు.మరో బోటులో క్యాంబెల్‌పేట మత్స్యకారుల కోసం అధికారులు గాలింపు చర్యలు .ఇప్పటికీ లభించని వారి ఆచూకీ .తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుటుంబసభ్యులు.

*మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

*నకిలీ విద్యా ధ్రువీకరణ పత్రాలను ఇస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తో పాటు కర్ణాటక యూనివర్సిటీల సర్టిఫికెట్‌ను ఈ ముఠా ఇష్యూ చేస్తున్నారని తెలిపారు. చైతన్య పూరి పోలీస్ స్టేషన్‌ లో దీనిపై కేసు నమోదైందన్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారి రోహిత్ కుమార్‌తో పాటు మరో ముగ్గురుని అరెస్ట్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ , జేఎన్‌టీయూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ల సర్టిఫికెట్స్‌ను ఇష్యూ చేస్తున్నారని సీపీ తెలిపారు. రోహిత్ అనే వ్యక్తి ఐటి ఉద్యోగి అని… ఫేక్ సర్టిఫికెట్స్‌ను తయారు చేసి డబ్బులు దండుకుంటున్నాడని వెల్లడించారు. శ్రీలక్ష్మి కన్సల్టెంట్స్ ద్వారా ఈ దందా కొనసాగిస్తున్నారన్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు 30 వేల నుంచి 40 వేలు తీసుకుంటున్నారన్నారు. లేని కాలేజీ పేర్లు కూడా పెట్టి సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నారన్నారు. విదేశాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకూ 20 వరకు సర్టిఫికెట్స్ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ దందా చేస్తున్నారన్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, మొబైల్స్ సీజ్ చేశామని మహేష్ భగవత్ వెల్లడించారు.

*గుంటూరు నగరంలో బ్రాడిపేట 4/13 లో యూనియన్ బ్యాంక్ లో అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంక్ లో వెనుకపక్క ఉన్న బ్యాటరీలు తగలపడటం తో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ,ఫైరింజన్లు, సిబ్బంది మంటలను అదుపు చేసారు,అర్బన్ ఎస్పీ,అరండలపేట స్టేషన్ పోలీసు అధికారులు ప్రమాదాన్ని పర్యవేక్షిచారు .

*పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలోమంగళవారం రోడ్డు పక్కన గల షాపుల్లోకి ట్రావెల్స్ బస్సు దూసుకు వెళ్ళింది. హైదరాబాద్ నుండిగుంటూరు వైపు వెళుతుండగా బస్సు అదుపు తప్పిదూసుకు వెళ్ళింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని దాచేపల్లి సీఐబిలాలుద్దీన్, ఎస్ఐ రహంతుల్లా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు

*పల్నాడు: జిల్లాలోని దాచేపల్లి మండలం పొందుగుల వద్ద మంగళవారం బస్సు ప్రమాదం జరిగింది. అద్దంకి – నార్కెట్పల్లి హైవేపై ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందరూ సురక్షితం బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తెనాలి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

*జగ్గయ్యపేట రూరల్ మండలం చిల్లకల్లు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జాస్తి శ్వేత కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సైబర్ ఉచ్చులో పడి ఆమె లక్షల రూపాయలు కోల్పోయినట్లుగా సమాచారం. తన తోటి స్నేహితులను కూడా కొంత నగదు కావాలని కోరినప్పటికీ వారు సహకరించకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. స్నాప్ చాట్ అనే కొత్త ఆన్‌లైన్ గేమ్‌లో గేమింగ్ ఆడినట్లుగా సమాచారం. ఆత్మహత్య కేసును దర్యాప్తు కోసం సైబర్ సెల్‌కు అప్పగించారు. తన స్వగ్రామం నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై ఒక్కతే వచ్చినట్లుగా సీసీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. చిల్లకల్లులోని చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపి ఆమె నడుచుకుంటూ చెరువులోకి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తల్లికి సెల్‌ఫోన్‌లో శ్వేత మెసేజ్ పెట్టింది.

*విశాఖపట్నం: నగరంలోని దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్మశాన వాటికలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పసికందుకు కేజీహెచ్‌కు తరలించారు. కాగా పసికందు మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు. శ్రీహరిపురం స్మశానవాటికలో ఈ ఘటన చోటు చేసుకుంది.

* పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగలలోమంగళవారం రోడ్డు పక్కన గల షాపుల్లోకి ట్రావెల్స్ బస్సు దూసుకు వెళ్ళింది. దరాబాద్ నుండిగుంటూరు వైపు వెళుతుండగా బస్సు అదుపు తప్పిదూసుకు వెళ్ళింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలాన్ని దాచేపల్లి సీఐబిలాలుద్దీన్, ఎస్ఐ రహంతుల్లా పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు

*శ్రీకాకుళం: జిల్లాలోని సంతబొమ్మాళి మండలం పాలనాయుడుపేటలో పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కొబ్బరి తోటలో పుట్టగొడుగులు కోసం స్థానికులు ఎగబడ్డారు. చివరకు వాటిని తిని గ్రామస్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

*వాకలపూడి కొరమండల్ బీచ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకువచ్చిన లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతులు సంజీవ్, తరుణ్ కుమార్‎గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనవడిని తాడికొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తుళ్లూరు డీఎస్పీ పోతురాజు మాట్లాడారు. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన మాదాసు సలోమన్‌(61)ను మనవడు తాడిగిరి లోకేష్‌ ఆస్తికి కోసం జూన్‌ 11వ తేదీ ఆర్ధరాత్రి హత్య చేశాడని తెలిపారు. సలోమన్‌కు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమార్తె మాణిక్యం 20 సంవత్సరం నుంచి భర్తకు దూరంగా ఉంటూ, తన పిల్లలతో కలిసి తండ్రి సలోమన్‌ దగ్గర ఉంటుంది. సలోమన్‌ తన పేరుమీద ఉన్న ఆస్తిని కుమార్తె మాణిక్యం పేరున రాశాడు. విషయం తెలుసుకున్న మాణిక్యం కుమారుడు తాడిగిరి లోకేష్‌ ఆస్తిని తన పేరు మీద రాయాలని తాతతో గొడవ పడుతున్నాడు. దీంతో జూన్‌ 11వ తేదీ లోకేష్‌ తన స్నేహితుడు కలిసి నిడుముక్కలలోని తాత ఇంటికి వచ్చిన తాతతో గొడవ పడి కంగారు కంగారు వెళ్లిపోయాడు.కొద్ది సేపటికి మృతుని కుమారుడు తండ్రి వద్దకు వెళ్లి చూడగా నోటిల్లో నుంచి నురుగ రావటాన్ని గమనించి 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపు సలోమన్‌ చనిపోవటంతో 108 సిబ్బంది మృతదేహాన్నికుటుంబ సభ్యులకు అప్పగించారు. మరుసటి రోజు సలోమన్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సలోమన్‌ మనవడు లోకేష్‌ ఆస్తి కోసం తాతను హత్య చేశాడనే పుకార్లు రావటంతో పాటు, పోలీసుల దృష్టికి విషయం వెళ్లింది. దీంతో పోలీసులు గుంటూరు జీజీహెచ్‌ వైద్యుల సహయంలో సలోమన్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో చేతులపై కనపడని దెబ్బలు ఉన్నాయని, మెడ కింద ఉన్న ఎముక విరిగిపోయిందని, గొంతునులుమి హత్య చేసినట్లు నిర్ధారించారు. దీంతో లోకేష్‌ను పోలీసులు అదుపులొకి తీసుకొని విచారించగా తానే తాతనే హత్య చేసినట్లు ఒప్పకున్నాడు. కేసు నమోదు చేసి కోర్టుకు హజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు.

* బాలికను అత్యాచారం చేసిన వ్యక్తికి 25ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి(పోక్సో కోర్టు) శ్యాంశ్రీ సోమవారం తీర్పునిచ్చారు. కొత్తగూడెంనకు చెందిన శ్రీనివాస్‌ ఓ బాలికపై అత్యాచారం చేశాడంటూ 2019 మే 7న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు అనంతరం అప్పటి డీఎస్పీ అలీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో 13మంది సాక్షులను విచారించిన అనంతరం శ్రీనివా్‌సపై నేరం రుజువైందని న్యాయస్థానం భావించింది. దీంతో శ్రీనివా్‌సకు సెక్షన్‌ 42 పోక్సో యాక్ట్‌ ప్రకారం 25సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా లేదా జరిమానాకు బదులుగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్‌ 56 భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల జరిమానా లేదా జరిమానా కింద 2 నెలల కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

*వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి మండలం జిన్నారానికి చెందిన కౌలురైతు బోయిని నర్సింహులు(34) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న నర్సింహులు పెట్టుబడి కోసం రూ.లక్ష అప్పు చేశాడు. దిగుబడి లేక అప్పు తీరకపోవడంతో ఆదివారం పురుగుమందు తాగాడు.

*అవినీతిని ప్రశ్నించిన, అన్యాయాన్ని ఎదిరించిన ఓ దళితుడు చివరకు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు ఆయన తలపై బండరాయితో మోది చంపేశారు. ప్రకాశం జిల్లా సి.ఎ్‌స.పురం మండలం ఏకునాంపురంలో జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది.

*అప్పులు మరో ముగ్గురు రైతుల ఉసురు తీశాయి. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒక రైతు సేద్యం చేసిన పొలాల్లోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామానికి చెందిన గుట్టిపాటి చిన్న సిద్ధయ్య (42)కు అర ఎకరా సొంత పొలం ఉంది. దీంతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. నాలుగేళ్లుగా ప్రకృతి అనుకూలించక పంటలు సక్రమంగా పండలేదు. దీంతో పెట్టుబడికోసం చేసిన అప్పులు పెరిగి రూ.5లక్షలకు చేరాయి. దీంతో కొంతకాలంగా సిద్ధయ్య తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆయనకు ధైర్యం చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తన పొలం వద్దకు వెళ్లిన ఆయన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే జిల్లా బేస్తవారపేట మండలం అక్కపల్లె గ్రామ పంచాయతీ చెరుకుపల్లె గ్రామానికి చెందిన పేరూరి చిన్న వెంకటయ్య (52) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని ఐదేళ్లుగా మిర్చి, కంది, పత్తి పంటలు వేశాడు. వాతావరణం అనుకూలించక నష్టపోయాడు.

*ద్విచక్రవాహనాల దొంగను నగరంలోని వనటౌన పోలీసులు అరెస్ట్‌ చేశారు. కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామిని అరెస్ట్‌ చేసి, అతడి నుంచి 8 బైక్‌లు, 20 సిగరెట్ల బండిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం వనటౌన పోలీ్‌సస్టేషనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవిశంకర్‌రెడ్డితో కలిసి అనంతపురం ఇనచార్జ్‌ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అరెస్ట్‌ వివరాలు వెల్లడించారు.

*కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన తిప్పేస్వామి పాత నేరస్థుడు. నాలుగేళ్ల కిందట ఓ చిన్నారి కిడ్నాప్‌ ఘటనలో డబ్బు డిమాండ్‌ చేసిన కేసులో ఇతని నిందితుడు. అనంతర కాలంలో బైక్‌ల దొంగతనాలకు పాల్పడ్డాడు. అనంతపురం, తాడిపత్రి, కర్నూలు జిల్లా డోన, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. దుకాణాలు, ఇళ్ల ముందు పార్క్‌ చేసిన మోటర్‌సైకిళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసేవాడు. అలా మొత్తం 8 మోటార్‌ సైకిళ్లు దొంగలించాడు. అనంతపురంలోని పాతూరులో ఉన్న కిరాణా షాపులో 20సిగరెట్‌ బండిళ్లను దొంగలించాడు.

*హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు 200 అడుగుల లోయలో పడటంతో 13 మంది దుర్మరణం చెందారు. షెయిన్‌షేర్‌ నుంచి కులు వెళ్తున్న ప్రైవేటు బస్సు జంగ్లా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరగ్గా పలువురు పాఠశాల విద్యార్థులు సహా 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు సాయంగా రూ.15వేల చొప్పున ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ బాధితకుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

*పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాము ఆత్మహత్య కలకలం రేపుతోంది. కార్యాలయంలోని పై గదిలో ఉరి వేసుకుని రాము బలవన్మరనానికి పాల్పడ్డాడు. పలువురు బ్లాక్ మెయిల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారాంటూ సూసైడ్ నోట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పేర్కొన్నాడు. ‘‘నా చావుకు కారణం ధర్మవరం ఇందిరమ్మ కాలనీకి చెందిన జాకీర్, కోట్ల విజయ, కోట్ల అనిల్, కనుముక్కల మహేష్ కారణం’’ అంటూ సూసైడ్ లెటర్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. పలు ఆన్‌లైన్ వ్యాపారాల్లోనూ మోసానికి పాల్పడ్డారంటూ సూసైడ్ లెటర్‌లో పేర్కొనాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే రాము ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.