Politics

వైసీపీ సర్కార్ది అరాచక పాలన – TNI రాజకీయ వార్తలు

వైసీపీ  సర్కార్ది అరాచక పాలన  – TNI  రాజకీయ వార్తలు

*వైసీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ది అరాచక పాలన అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ ద్వారా అరాచక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని గంజాయి కేసులతో వేధిస్తున్నారని తప్పుబట్టారు. తప్పుడు కేసులు అడ్డుకున్నందుకు మాజీ మేయర్ హేమలతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని చినరాజప్ప తెలిపారు.

*ఎస్సీ నిధులు పక్కదారి.. ‘దళిత సింహగర్జన’తో కళ్లు తెరిపిద్దాం: హర్ష కుమార్
వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో ఎస్సీలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ వేరే పథకాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. పది లక్షల మందితో దళిత సింహగర్జన నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని హర్షకుమార్ పిలుపునిచ్చారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల్ని ముఖ్యమంత్రి జగన్ వేరే పథకాలకు వినియోగిస్తున్నారని మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపించారు. అది పచ్చి మోసమని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం మూడేళ్లలో ఎస్సీలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని.. జగన్ సర్కార్ మోసాన్ని ఎవరూ మర్చిపోకూడదని అన్నారు. జగన్ వైఖరిని ఎండగట్టేందుకు దళిత సింహగర్జన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందుకు మేధావులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. పది లక్షల మందితో దళిత సింహగర్జన నిర్వహించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని హర్ష కుమార్ పిలుపునిచ్చారు.

*MCD ఎన్నికల కోసం కోర్టుకు వెళ్తాం: Kejriwal
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సకాలంలో నిర్వహించకుంటే తాము కోర్టును ఆశ్రయిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారంనాడు ఆయన మాట్లాడుతూ, ఎంసీడీ ఎన్నికలు గడువులోగా నిర్వహించాలన్నారు. లేదంటే కోర్టుకు వెళ్లి తీరుతామని పరోక్షంగా కేంద్రానికి సంకేతాలు ఇచ్చారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తమ శక్తియుక్తులతో ఎన్నికలను జరగనీయడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీని పూర్తి కేంద్ర పాలిత ప్రాంతం చేసి, ఎన్నికలు లేకుండా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.

*Raghuramaకు అదే చివరి రోజు అయ్యేది: Bonda Uma
సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును హత్య చేయటానికి ప్లాన్ చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు భీమవరం వచ్చుంటే ఆయనకు అదే చివరి రోజు అయ్యేదని అన్నారు. రఘురామకు బేగంపేటలో రైలు దాడి సమాచారం రాగానే దిగి పోయి ప్రాణాలు కాపాడుకున్నారని, ఇది నిజం కాదని వైసీపీ అంటే.. సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు తెలుస్తాయన్నారు. ప్రధాన మంత్రి మోదీ (Modi) ఏపీ (AP) వస్తున్నప్పుడే ఎంపీని హత్య చేయటానికి ప్లాన్ చేశారంటే.. జగన్పా లన ఎలా ఉందో అర్థమైందన్నారు. జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సత్తనపల్లి రైల్వే స్టేషన్ పుటేజ్‌ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మొన్న సతెనపల్లిలో 100 మంది గుండాలతో.. రఘురామ ప్రయాణం చేస్తున్న బోగిని తగలపెట్టి చంపాలని ప్లాన్ చేశారన్నారు. వైసీపీకి చిత్త శుద్ది ఉంటే సిబీఐతో విచారణ జరిపించాలని బోండా ఉమ మరోసారి డిమాండ్ చేశారు.

*సందేహమే లేదు.. జనసేన, BJP కలిసే ఉన్నాయి: Somu Veerraju
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొన్నొక వీడియో సందేశం పంపారని.. దానిలో జనసేన శ్రేణులు ప్రధాన మంత్రి మోదీ సభను జయప్రదం చెయ్యాలని కోరారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. జనసేన , బీజేపీ కలిసే ఉన్నాయని.. అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని సోము వీర్రాజు తెలిపారు. నిన్న ప్రధాన మంత్రి పర్యటన బాగా జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని శక్తులకు వారి కుటుంబాలు మాత్రమే కావాలని… కానీ బీజేపీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

*పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించాం: Bhatti
తమ పార్టీ అంతర్గత విషయాలపై కేసీ వేణుగోపాల్తో చర్చించామని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చించామని అంతా సర్దుమణిగిందన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు ఉంటాయన్నారు. బీజేపీ(BJP) జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ పార్టీ తో ఆ పార్టీ దోస్తీ బయటపడిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని ఆశించామన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదన్నారు.

*రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉంది: భూమన
2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం వ్యక్తుల సమాచారం సేకరించి ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిందని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వ్యక్తుల ప్రైవేట్ భద్రతకు ముప్పు వాటిల్లేలా చేసిందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో డేటా చౌర్యం ఉందని తెలంగాణ సర్కార్ కూడా దర్యాప్తు జరిపిందన్నారు. అవసరమైతే కొందరిని హౌస్ కమిటీ ముందుకు పిలుస్తామన్నారు.

*విఘ్ణవర్దన్ కాంగ్రెస్‌ లోనే ఉంటారు: VH Hanumantha Rao
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత పీ జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్దన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. విఘ్ణవర్దన్ తన ఇంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన హనుమంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాత్రీపగలు కష్టపడ్డారు. ఆయన కొడుకు విష్ణువర్దన్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్. కాంగ్రెస్ ఒకరి సొత్తు కాదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి‌ని సోనియాగాంధీ అపాయింట్ చేసింది. ఆయన నాయక్వత్వాన్ని బలపరుస్తున్నాం. కానీ రేవంత్ కూడా అందరిని కలుపుకుపోవాలి. నా ఇష్యూ‌పై హైకమాండ్‌తో మాట్లాడతా. నా విషయం ఇక్కడ మాట్లాడితే నాకు నేనే అవమానపర్చుకున్నట్టే. అందరికి అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దాం.’’ అని వీహెచ్ పేర్కొన్నారు.

*బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయి: మధుయాష్కీ
రాహుల్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ సూచించారు. కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. పార్టీని నమ్మి పని చేసినవారికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. టికెట్ కోసమే వచ్చి పనిచేసే వారికి టికెట్లు ఉండవన్నారు. కాంగ్రెస్ బలోపేతాన్ని అడ్డుకోవడానికి తెరచాటున కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయని, ఈ కుట్రను గమనించాలన్నారు.

*ఎమ్మెల్యే కోటంరెడ్డివి బురద రాజకీయాలు: Anjaneya reddy
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బురద రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి బురదలో దిగడం ఏమిటి? అని ప్రశ్నించారు. అణువణువుని రాజకీయంగా మలుచుకోవడంలో శ్రీధర్ రెడ్డిని‌ మించిన నాయకుడు లేడని ఆంజేయరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాగా… రైల్వే, మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మంగళవారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మురుగునీటి కాలువలోకి దిగిన విషయం తెలిసిందే. 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించానన్నారు. రైల్వే, కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార విషయంలో అధికారమా? ప్రతిపక్షమా? అనేది ఉండదని.. ప్రజల పక్షాన ఉంటానని స్పష్టం చేశారు. రైల్వే అధికారుల మొండి తీరు, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ మురుగు గుంతలోకి దిగుతున్నానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

*Achennaiuduని కావాలనే ప్రభుత్వం అవమానించింది: Chinarajappa
అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని మాజీ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. వీఐపీ బ్రేక్ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ (AP)కి సంబంధించిన హామీలను ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఏపీ మద్దతు కీలకం అయినప్పటికీ సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి డిమాండ్లు చేయకుండానే మద్దతు ప్రకటించడాన్ని చినరాజప్ప తప్పుపట్టారు.భీమవరంలో ప్రధాని పాల్గొన్న కార్యక్రమానికి… స్థానిక ఎంపీ హోదాలో రఘురామ కృష్ణరాజు అధ్యక్షత వహించాలి. కానీ… ప్రధాని కార్యాలయం (పీఎంవో) పంపిన ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరే లేదు! ‘అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మీ పార్టీ తరఫున ప్రతినిధిని పంపించండి’ అని కేంద్రం లిఖితపూర్వకంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కోరింది. ఆయన సూచించిన మేరకు అచ్చెన్నాయుడుకు జాబితాలో చోటు దక్కింది.

*తెలంగాణలో బీజేపీ గెలవదు: మంత్రి Satyavati
రాష్ట్రంలో బీజేపీ గెలవదని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మరో మారు విజయసభ పెట్టుకోలేమని ముందే పెట్టుకున్నారని యెద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పే అని అన్నారు. ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరి కపుడు నిండదని… ద్రౌపది మూర్ము పీఎం అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏముందని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కళ్ళు ఉండి చూడలేని కబోదులని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం లో అవినీతి జరుగుతుంది అనుకుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలన అని కేటీఆర్ కేసీఆర్ మీద ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*బిగుసుకుపోయిన భీమ్లానాయక్‌: రోజా
‘‘భీమవరం సమావేశం చూసి భీమ్లానాయక్‌ బిగుసుకుపోయాడు. మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు తహతహలాడడం అత్యాశే అవుతుంది’’ అని మంత్రి రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం దివాన్‌చెరువులో వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ‘‘మంత్రిగా ఉండి ఓడిపోయిన లోకేశ్‌… జగన్‌కు సమానం అనుకుంటున్నాడు. వాళ్ల నాన్న కేసీఆర్‌ని చూసి విజయవాడకు వచ్చాడు. జగన్‌ను చూసి హైదరాబాద్‌ పారిపోయాడు. బాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుంది. అటువంటి దారులు మూసేయండి. టీడీపీ నేత బండారు సత్యనారాయణ తాము అధికారంలోకి వస్తే జగన్‌ సంక్షేమ పథకాలు మూసేస్తామంటే, మరో నాయకుడు అచ్చెన్నాయుడు వలంటరీ వ్యవస్థను తీసిపారేస్తాం అంటున్నారు’’ అంటూ ఆరోపించారు. సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, సత్తి సూర్యనారాయణరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి. జ్యోతుల చంటిబాబు, తలారి వెంకట్రావు పాల్గొన్నారు.

*రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి: మండాది వెంకట్రావు
తమ సమస్యలు పరిష్కరించాలని పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ధర్నా చేశారు. ప్రజా పంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్‌ ఉండటం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా డీలర్లందరికి ఒకే కమీషన్ ఇవ్వాలని రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 29 వేల మంది డీలర్లు కరోనా సమయంలోనూ నిత్యావసరాలు పంపిణీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఎండీయూలను ఏర్పాటు చేసి రేషన్‌ పంపణీ చేయడం సరికాదని రేషన్ డీలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*Vangaveeti Ranga అందరివాడు..: గంటా Srinivasarao
వంగవీటి మోహనరంగా 75వ జయంతి వేడుకలు కాపు నేత, గాదే బాలాజీ ఆధ్వర్యంలో విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి రంగా, ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వారు కాదని, అందరివాడని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు జరుపుతున్నారన్నారు. కాపులు ఎప్పుడూ ఐక్యంగానే ఉన్నారని, రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నారన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమని, జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసే ఉన్నారు కాబట్టి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని ఇప్పటికే బీజేపీ చెప్పిందన్నారు. చిరంజీవి, గతంలో పర్యాటక శాఖ మంత్రిగా, పని చేశారు కాబట్టి ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారన్నారు. ప్రతిపక్షంగా టీడీపీని కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందని గంటా శ్రీనివాసరావు అన్నారు.

*అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలి: Achennaidu
అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…. అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని అందరికన్నా ముందుగా దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రొటోకాల్‌లో ఉన్న పేరును రాష్ట్ర అధికారులు తొలగించారని, మోదీ సభకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ (YCP) పాలనలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మోదీ సభలో అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎంపీ రఘురామరాజు రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

*బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగవు: ఎర్రబెల్లి
బీజేపీ కుట్రలు తెలంగాణలో సాగవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరైన నేతలంతా తమ వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై దాడులకు దిగారని మండిపడ్డారు. బీజేపీ సమావేశాలు, సభలో నేతల వ్యాఖ్యలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్‌ పేరెత్తకపోయినా.. బీజేపీ జాతీయ నాయకులు మాత్రం విమర్శలతో సీఎం కేసీఆర్‌పై దాడి చేయడమే కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

*బీజేపీ సమావేశాల్లో పస లేదు: మల్లు రవి
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కా ర్యవర్గ సమావేశాలు ప్రజల్ని నిరుత్సాహపరిచాయని, పస లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రజల మధ్య మతపరమైన చిచ్చు పెట్టే కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌, మోదీల మధ్య అవగాహన ఉంది కాబట్టే ఆయన కేసీఆర్‌ ప్రస్తావనే తీసుకురాలేదని ఆరోపించారు.

*డబుల్‌ ఇంజన్‌తో అభివృద్ధి శూన్యం: కొప్పుల
బీజేపీ నేతలు వల్లె వేస్తున్న డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో జరిగే అభివృద్ధి, సంక్షేమం శూన్యమని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం జగిత్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు.

*సహకార బ్యాంకులు అభివృద్ధి చెందాలి: వినోద్‌
గ్రామస్థాయి నుంచి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే సహకార బ్యాంకుల వ్యవస్థ అభివృద్ధి చెందాలని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్‌ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా, అనంతరం విలేకరులతోనూ ఆయన మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కేంద్రంలోని మోదీ పాలనలో బ్యాంకింగ్‌ రంగం అస్తవ్యస్తం అయ్యిందని ఆరోపించారు.

*ల్లూరి పోరాట యోధుడు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అల్లూరి సీతారామరాజు పోరాట యోధుడని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా మన్యం ప్రాంతంలో ముందుగా చెప్పి పోలీస్‌స్టేషన్‌లపై దాడులు చేసిన మహా యోధుడు అల్లూరి. లేఖ రాసి, సమయం చెప్పి మరీ దాడులు చేసిన ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం. దేశవ్యాప్తంగా ఇటువంటి గొప్పవ్యక్తులను ప్రజలకు తెలియజెప్పేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విదేశాల్లోనూ భారతీయులు సైతం ఆజాదీ కా అమృత్‌ ఉత్సవాలు జరుపుకుంటున్నారు’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.
*