DailyDose

అవినీతి పత్రిక సాక్షిని బాగా మేపుతున్నారు- మన్నవ మోహన కృష్ణ

అవినీతి పత్రిక సాక్షిని బాగా మేపుతున్నారు- మన్నవ మోహన కృష్ణ

ప్రజలు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ప్రజల ఆస్తి తనదే అనే రీతిలో ప్రజాధానాన్ని తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని తన అవినీతి పత్రిక సాక్షిని బాగా మేపుతున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా నష్టాల్లో ఉన్న జగతి పబ్లికేషన్స్ పార్టీ అధికారంలోకి రాగానే లాభాలలో ఎలా దూసుకుపోతోందని మోహనకృష్ణ ప్రశ్నించారు. మనకి అవసరమైనప్పుడు సొంత బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు తీసుకున్నట్లు సాక్షికి ఆర్ధిక అవసరాలు తీర్చేందుకు ప్రజా ఖజానా నుంచి డబ్బులు తీస్తున్నారు.గత మూడేళ్ళలో సాక్షికి ప్రకటనల రూపంలో రూ.280 కోట్లను తరలించారు. 1వ తేదీన జీతాలు ఇవ్వలేకపోయినా సాక్షికి ధన ప్రవాహం మాత్రం ఆగటం లేదు అన్నారు. కాంట్రాక్టుర్లు, సప్లయర్లకు రూ. లక్షల కోట్లు పైగా బిల్లులు పెండింగ్ ఉన్నా కానీ సాక్షికి మాత్రం ఒక్క రూపాయి పెండింగ్ ఉండదు. అది సరిపోదు అన్నట్లుగా సాక్షి సర్క్యూలేషన్ పెంచుకునేందుకు మరో ప్లాన్ వేశారు. 2 లక్షల మంది వాలంటీర్లకు దిన పత్రికల ఖర్చుల కింద నెలకు 200 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వాలంటీర్లు అంతా సాక్షి పేపర్ కొనుగోలు చేసి ఆ డబ్బంతా సాక్షి పేపర్ కి మళ్లిస్తున్నారని మన్నవ మోహనకృష్ణ అన్నారు.