NRI-NRT

‘ఆటా’ 17వ మహాసభలు విజయవంతం

‘ఆటా’ 17వ మహాసభలు  విజయవంతం

అమెరిక తెలుగు అసోసియేషన్(ఆటా)అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆటా 17వతెలుగు మహాసభల సంబరాలు అంబరాన్నంటాయి. వాషింగ్టన్ నగరం తెలుగు వారితో పోటెత్తింది. ఇంత భారీ ఎత్తున అమెరికాలో మహా సభలు నిర్వహించటం తెలుగు కన్వెన్షన్స్ చరిత్రలో మొట్ట మొదటి సారి కావటం విశేషం. కోవిడ్ మహమ్మారి తర్వాత నిర్వహించిన భారీ మొదటి తెలుగు మహాసభలు కావటం మరియు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ఈ సభ ఎంతో వ్యయ ప్రయాసలకు వెరవకుండా నిర్వహించటం విశేషం.
DSC09210
సద్గురుజగ్గీ వాసుదేవ్ పాల్గొన్నఈ కార్యక్రమంలో 15,౦౦౦మందికి పైగాపైగా పాల్గొనటం ఒక విశేషం. జులై 1న నిర్వహించిన బాంక్వేట్డిన్నర్లో 3000 మందికి పైగా పాల్గొన్నారు. వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ ఆటా అవార్డ్స్ ప్రధానం చేసారు. క్రికెట్దిగ్గజాలు కపిల్దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్గేల్ తదితరులు ఈ బాంక్వేట్ డిన్నర్ లో పాల్గొన్నారు. వీరిని ఆటా ఘనంగాసత్కరించింది. అదే రోజు నిర్వహించిన గోల్ఫ్టోర్నమెంట్లోకపిల్దేవ్, రకుల్ ప్రీత్ సింగ్, సద్గురు జగ్గీ వాసుదేవ్ పాల్గొన్నారు.
DSC09057
125 మందితో స్వాగతోత్సవ జానపద సంబరాలు “మన ఆటా జానపదాల కోట” నిర్వహించారు. 140 మందికి పైగా పాల్గొన్న “తెలుగు మన వెలుగు” కార్యక్రమంలో కూచిపూడి, గోండి, లంబాడి తదితర సంప్రదాయ నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మనబడి బాలలు చేసిన శ్రీకృష్ణరాయభారం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. బతుకమ్మ పైన ఆటా ముద్రించిన పుస్తకాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. వద్దిపర్తి పద్మాకర్ గారు నిర్వహించిన అవధానం ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకున్నది. శివమణి, థమన్మ్యూజికల్ నైట్ శ్రోతలను ఉర్రుతలుగించింది.
DSC09030
steam gif icon
డ్రమ్స్ పైన శివమణి చేసిన విన్యాసం ఆబాలగోపాలాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఉపాసన కామినేని, సద్గురుకి వినూత్నమైన ప్రశ్నలు శ్రోతల తరపున అడిగారు. సద్గురు మాట్లాడుతూ పర్యావరణ ముప్పుని నివారించటానికి సారవంతమైన భూమిని ఎలా కాపాడుకోవాలో, ఆహార భద్రతకు దీని ఆవశ్యకత, ఎంత ప్రాముఖ్యం సంతరించుకుందో సోదాహరణంగా “సేవ్ ది సాయిల్”ప్రోగ్రాం గురించి వివరించారు. ఈ సభలకు మగ్దూం సయ్యద్, రవి రాక్లే, సింగర్సునీతవ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళలు, పిన్నలు పెద్దలు సాంప్రదాయ దుస్తులను ధరించి సందడి చేసారు. ఆటా మొదటి రోజు సాహిత్య కార్యక్రమాల ప్రారంభ సమావేశంలో ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్, అఫ్సర్, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి, స్వామి వెంకటయోగి సమకాలీన సాహిత్యం గురించి మాట్లాడారు.
DSC08973
ఆ తర్వాత, జొన్నవిత్తుల తన పారడీ పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మానకాలపు నవల, కథ’ పేరుతో నిర్వహించిన చర్చలో అమెరికాలో ఉన్న కథా, నవలా రచయితలు పాల్గొని సమకాలీన కథా సాహిత్యం గురించి లోతైన చర్చ చేశారు. రెండవ రోజు సాహిత్య కార్యక్రమాలలో సినిమాకి, సాహిత్యంలో ఉన్న సంబంధం గురించి వివరించడానికి ‘సినిమా కథ… సాహిత్య నేపధ్యం’ పేరుతో నిర్వహించిన చర్చలో దర్శకులు సందీప్ రెడ్డి వంగ, తనికెళ్ళ భరణి, ధర్మ దోనేపూడి, సుకుమార్, శివ సోమయాజుల పాల్గొన్నారు. చర్చలో భాగంగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకులు సమాధానాలు ఇచ్చారు. ఆ తర్వాత, ‘ఆటా, పాటా, మనం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమమంలో చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి వారి పాటల నేపధ్యాన్నీ వివరించారు. ఈ కార్యక్రమానికి ఆడియన్స్ నుండి విశేషమైన స్పందన లభించింది.
DSC08536
జులై 3న ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లోకకళ్యాణం కోసం నిర్వహించిన శ్రీనివాస్కళ్యాణం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఆటా బ్యూటీ పేజంట్ విజేతలకు రకుల్ ప్రీత్ సింగ్ , అడివిశేష్ బహుమతులు అందచేశారు. అమెరికాలో 12 నగరాల నుంచి ఓత్సాహికులు పాల్గొనటం విశేషం. ఝుమ్మంది నాదం పాటల పోటీలలో మరియు సయ్యంది పాదం నాట్య పోటీలలో పాల్గొన్న మూడు వందల మందిలోని నుండి విజేతలకు బహుమతులు అందచేశారు.. బిజినెస్క కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో GMR సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సులో ఉపాసన కామినేని పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి పైనిర్వహించిన సదస్సులో తనికెళ్ళ భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
DSC08533
ఈ మహాసభలలో మంత్రులు ఎర్రబెల్లిదయాకర్రావు, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లరెడ్డి, ఎమ్మెల్యేలు ఆళ్ళ వేంకటేశ్వర రెడ్డి , గువ్వల బాలరాజు, కాలే యాదయ్య, బొళ్ళం మల్లయ్య యాదవ్ , గాదారి కిశోర్, వైజాగ్ పార్లమెంట్ సభ్యులు MVVసత్యనారాయణ, రాజమండ్రి శషన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌధరి మరియు ఇతర నాయకులు భాను ప్రకాష్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, భవానీ మారికంటి, మన్నవ సుబ్బ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర మిషన్ ధ్యాన గురువు కమలేష్పటేల్(దాజి) ప్రత్యేక సందేశం అందించారు .
DSC06749
ఈ మహాసభల నిర్వహణకు విరాలలాను అందచేసిన ధాతలను ఆటా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఆటా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగువారు అందరు అమెరికాలో ఎదగటానికి ఆకాశమే కొలమానమని మన జాడ్యాలను విడనాడి అవకాశాలను అందిపుచ్చుకొని ఎంతో అబివృద్దిలోకి రావాలి అని ఆయన ఆకాంక్షించారు. ప్రేమ్రెడ్డిగారికి తదుపరి ప్రెసిడెంట్ మధు
బొమ్మినేని గారువేదిక పైకి ఆహ్వానించగ, ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల తెలుగు శాస్త్రీయ పద్దతిలో ఘనంగా సత్కరించారు. పూర్వ ప్రెసిడెంట్ రమేష్భీం రెడ్డి జ్ఞపీకను అందచేశారు. మాస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి అంధరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది.గురువందనతో సంగీత విభావరి ప్రారంభమై ఎన్నో అద్భుతమైన పాటలను మనో, కార్తీక్ లాంటి ప్రముఖ గాయని గాయకులు అంధింస్తు సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
DSC06133
DSC05754
DSC05275
DSC05019
DSC00600-1
PHOTO-2022-07-03-00-03-56-1
PHOTO-2022-07-06-11-41-21
PHOTO-2022-07-06-11-40-32
DSC01037
DSC01004