ScienceAndTech

మెయిల్‌లో ఇవి తెలుసా!

Auto Draft

ఈ రోజుల్లో మెయిల్‌ అకౌంట్‌ లేని వారు అరుదు. అధికారిక పనులు లేదా వ్యక్తిగత అవసరాల కోసం, విద్యార్థులు అయితే అసైన్‌మెంట్స్‌ తదితరాలు పంపుకోవడానికి జీమెయిల్‌ ఉపయోగిస్తూ ఉంటారు. చివరకు చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌లోనూ జీమెయిల్‌ యాప్‌ ఈ రోజుల్లో తప్పనిసరిగా ఉంటుంది. ల్యాప్‌టాప్‌, ట్యాబ్స్‌లో దీని ఉనికి సరేసరి. ఇలా ఆధునిక వ్యక్తికి అవసరమైన హంగుల్లో జీమెయిల్‌ కూడా ఒకటి. కొన్ని ట్రిక్స్‌, టిప్స్‌తో జీమెయిల్‌ను వినియోగదారులు మరింత సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. గూగుల్‌ చాట్‌ లిస్టుకు ఎవరినైనా జతచేస్తే, వారితో వీడియో కాల్‌ చేసుకోవచ్చు. మీ ఇన్‌బాక్స్‌ నుంచి మాట్లాడవచ్చు. ఆ వ్యక్తి పేరుపై హోవరింగ్‌తో వీడియో కాల్‌ కోసం క్లిక్‌ చేయవచ్చు. మీ ఇన్‌బాక్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌గా ఏదైనా ఇమేజ్‌ను పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేసి థీమ్స్‌లోకి వెళ్ళి స్టార్ట్‌ కావచ్చు. లేబుల్స్‌ అంటే ఫోల్డర్ల కింద మీ మెయిల్స్‌ను ఒక పద్ధతిలో ఆర్గనైజ్‌ చేసుకోవచ్చు. ఈ మెయిల్‌కు పైనే లేబుల్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేసి అవసరమైన విధంగా ఫోల్డర్లను క్రియేట్‌ చేసుకోవచ్చు. మీ మెయిల్స్‌ను ఆటోమేటిక్‌గా ట్యాబ్స్‌గా ఆర్గనైజ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు షాపింగ్‌ సైట్‌ నుంచి వచ్చిన సేల్స్‌కు సంబంధించిన ఈమెయిల్‌ను ప్రమోషన్‌ ట్యాబ్‌ కిందకు చేర్చవచ్చు. సెర్చ్‌ బాక్స్‌ ఉపయోగించుకుని మెయిల్స్‌ను కనుగొనవచ్చు. ఫలితాలను ఇక్కడ ఫిల్టర్‌ చేసుకోవాలి. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇందుకు ఉపయోగపడుతుంది. రైట్‌ క్లిక్‌ ఉపయోగించి మూవ్‌, ఆర్కైవ్‌, మ్యూట్‌, ఫిల్టర్‌, కొత్త విండో ఓపెనింగ్‌ వంటి పనులను వేగంగా చక్కబెట్టవచ్చు. పొరపాటుగా ఎవరికో మెయిల్‌ పంపితే ‘అన్‌డూ’ చేయవచ్చు. అన్‌డూ సెండ్‌కు టర్న్‌ చేస్తే చాలు, అది డెలివర్‌ కావడానికి ముందు సమయం చిక్కుతుంది.