Business

లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు!

లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు!

అంతర్జాతీయ మార్కెట్‌లపై దేశీయ మార్కెట్‌లపై ప్రభావం చూపించింది. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల వంటి ఇతర కారణాలు దేశీయ మార్కెట్‌లకు వరంగా మారాయి. దీంతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమైన ఆ వెంటనే తిరిగి లాభాల్లోకి పుంజుకున్నాయి.శుక్రవారం ఉదయం 9.35 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 54,400పైన నిలదొక్కుకోగా, నిఫ్టీ 80పాయింట్లతో లాభపడి 16,200 మార్క్‌ను క్రాస్‌ చేసింది. బ్యాంక్‌ నిఫ్టీ 35,100 ఉండగా,ఇండియా వీఐఎక్స్‌ 20 స్థాయిల దిగువకు పడిపోయాయి. ఇక సెన్సెక్స్‌లో 1.2శాతం క్షీణించిన ఏషియన్‌ పెయింట్స్‌ నష్టాల్లో పయనిస్తుంది. హిందుస్తాన్‌ యూనిలీవర్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లారెన్స్‌ అండ్‌ టూబ్రో, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి.