DailyDose

వీసా గడువు పొడిగిస్తానంటూ చైనీయులకు టోపీ – TNI నేర వార్తలు

వీసా గడువు పొడిగిస్తానంటూ చైనీయులకు టోపీ – TNI  నేర వార్తలు

* చెన్నైలోని విదేశీ వ్యవహారాల అధికారులతో మాట్లాడి వీసా గడువు పొడిగిస్తానంటూ చైనాకు చెందినవారిని మోసం చేసిన తమిళనాడు వ్యక్తిని అరెస్టుచేశారు. రేణిగుంట డీఎస్పీ రామచంద్ర మీడియాకు గురువారంవివరాలను తెలియజేశారు. చైనాకు చెందిన డూయింగ్‌, మరి కొంతమంది రేణిగుంట మండలం గురవరాజుపల్లె సమీపంలో ఉంటూ.. స్థానికంగా వ్యాపారాలు చూసుకుంటున్నారు. వీరి సహచరులు మరికొందరు ఢిల్లీలో ఉంటున్నారు. వీరిలో మొత్తం ఎనిమిది వీసాల గడువు ముగిసింది. ఈ సమయంలో వీరికి చెన్నైకు చెందిన సాల్మాన్‌ ప్యారిస్‌ (32), కన్నన్‌ (34) పరిచయమయ్యారు. చెన్నైలోని విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారులతో తమకు పరియాలు నమ్మించారు. వీసా గడువును మరో ఆరు నెలలు పొడిగించి నూతన ధ్రువపత్రాలను మంజూరు చేయిస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.11లక్షలు తీసుకున్నారు.

* బంగాల్లో దారుణం జరిగింది. ముగ్గురు తృణమూల్ కాంగ్రెస్ నాయకుల్ని హత్య చేశారు దుండగులు. దక్షిణ 24 పరగణాలు జిల్లా గోపాల్పుర్ గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. దీంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మృతుల్ని ధర్మతలా గ్రామ పంచాయతీ సభ్యులు స్వపన్ మాఝీ(38), భూత్నాథ్ ప్రామాణిక్(33), ఝాంతు హల్దార్గా (33) గుర్తించారు.

*జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్య
జపాన్‌ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు దాదాపు ఐదున్నర గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు.

*ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోఓగి అక్కడికక్కడే మృతి చెందాడు. చందానగర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన మేరకు.. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన మూలపల్లి చంద్రమోహన్‌కు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు దిలీప్‌ (27) నెల క్రితం ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో చేరాడు. అమీన్‌పూర్‌లో బావ రాకేష్‌ ఇంటిలో నివాసముంటూ గచ్చిబౌలికి ఉద్యోగానికి వెళ్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటలకు దిలీప్‌ కుమార్‌ అతని స్నేహితుడు సూర్యతో కలిసి ఫల్సర్‌ బైక్‌పై అమీన్‌పూర్‌ నుంచి చందానగర్‌ వైపు భోజనం చేసేందుకు వెళ్తున్నారు.దారిలో రెయిన్‌బో స్కూల్‌ వద్దకు చేరుకోగానే ఆటో టీటీడీ లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ త్రివీర్‌ వాహనం వేగంగా వచ్చి దిలీప్‌కుమార్‌ వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ పై ఉన్న దిలీప్‌ కుమార్‌ సూర్య కిందపడగా దిలీప్‌కుమార్‌ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు దిలీప్‌కుమార్‌ను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పీఆర్‌కే ఆస్పత్రికి తరలించారు. గచ్చిబౌలిలో..మద్యం మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌కు ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బలయ్యాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా జిల్లాకు చెందిన బోయపాటి అశోక్‌ కుమార్‌(26) గువా రెసిడెన్సీ, మియాపూర్‌లో నివాసం ఉంటూ మాస్‌ మ్యూచ్‌వల్‌ కంపెనీలె సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అదే రెసిడెన్సీలో నివాసం ఉంటే మదన్‌ మోహన్‌ రెడ్డి(24) జావా ఎజ్డీ బైక్‌పై వెళ్లి బధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకు అశోక్‌ పికప్‌ చేసుకున్నారు.విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ట్రిపుల్‌ ఐటీ సబ్‌స్టేషన్‌ వద్ద ఫుట్‌పాత్‌ను అతి వేగంగా ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయాలై వెనక కూర్చున్న అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ నడిపిస్తున్న మదన్‌ మోహన్‌ రెడ్డి స్వల్ప గాయాలతో బయటçపడి ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం రామాంజనేయులు దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

*కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి (bear) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు అటవీ శాఖ (Forest Department) అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు (officials) మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు. విషపూరిత ఆహారం తినడం వల్లే మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అయినా ఎలుగుబంటి మృతికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

*నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్‌లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు. పద్మానగర్‌కు చెందిన నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణి గురువారం రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటిగోడ కూలిపోయింది. నిద్రిస్తున్న వారిపై బిరువపడింది. దీంతో తల్లీకూతుళ్లు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.

*గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఆగి ఉన్న i 20 కారులో మంటలు…వెంటనే ఫైర్ ఇంజన్ సిబ్బంది స్పందించి మంటలు ఆర్పీ వేయడం జరిగింది…ఎవరికి ఎటువంటి హని జరగలేదు.

*పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పూతలపట్టు ఫ్లైఓవర్ వద్ద ఘటన. పీలేరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న లారీని వర్షంలో గమనించని కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ లారీ ని ఢీకొనడంతో ప్రమాదం.పూతలపట్టు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూతలపట్టు ఎస్సై రామ్మోహన్.

* కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి, ఎస్టీ మహిళ అయిన రొడ్డా భవాని(32) గురువారం అమలాపురం మండలం కామనగరువులోని తన సొంతింట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈమెకు భర్త వెంకటేశ్వరరావు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన భవాని పదేళ్ల క్రితం వెంకటేశ్వరరావును పెళ్లి చేసుకున్నారు. ఈమె 2019లో చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా వచ్చారు. మూడు నెలల క్రితం పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. 90 రోజుల గడువు దాటిన మూడు రోజులకు సమావేశం నిర్వహించారు. అప్పట్నుంచి కొందరు ఆమెను వేధిస్తుండడంతో తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. భవాని మృతదేహాన్ని అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు గురువారం సాయంత్రం వరకు ప్రయత్నించారు. డీఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలంటూ.. భవాని బంధువులు డిమాండు చేశారు. ఓ దశలో వాగ్వాదం చోటుచేసుకోగా సీఐ వీరబాబు, ఎస్సై పరదేశి కలుగజేసుకుని సర్దిజెప్పారు. భవాని భర్త వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేయనున్నట్లు ఎస్సై తెలిపారు.

* జమ్ముకశ్మీర్ ఉధంపుర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రామ్నగర్ సమీపంలోని కియా గ్రామం వద్ద ఓ బస్సు 150 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 48 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం రామ్నగర్కు తరలించామని తెలిపారు.

* అతి వేగం ప్రమాదకరమని పదే పదే ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నా కుర్రకారు మాత్రం పెడ చెవిన పెడుతోంది. ఓ విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అదుపు తప్పింది. డివైడర్‌ ఎక్కి విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. టోలీచౌకికి చెందిన అరీబ్‌ ఖాన్‌ ముఫకంజ కళాశాల విద్యార్థి. తన సోదరుడితో కలిసి టాటా హరియర్‌ కారులో అతి వేగంగా జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌ వైపు వెళుతున్నాడు. రోడ్డు నెంబరు 1కి రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ ఎక్కి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది.

* కోకాపేట్‌ మూవీ టవర్స్‌లో పై నుంచి దూకి ఓ సినీ నిర్మాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం జరిగింది. మూవీ టవర్స్‌లోని 16వ అంతస్తులో యార్లగడ్డ రజిని నివాసం ఉంటోంది. ఆమె తండ్రి, సీనియర్‌ సినీ నిర్మాత రాజేంద్రప్రసాద్‌ (87) కూడా అక్కడే ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను గురువారం ఉదయం 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రజని ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌ మాధవీ పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లతోపాటు ఇతర హీరోలతో కలిసి పలు బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను నిర్మించారు.

*రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో యువతికి గాయాలయ్యాయి. ఈ సంఘటనా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ అక్బర్‌ హిల్స్‌లో చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అక్బర్‌హిల్స్‌ ప్రాంతానికి చెందిన సుమయ్య బేగం(19) సులేమాన్‌నగర్‌లో కుట్టు నేర్చుకుంటుంది. బుధవారం మధ్నాహ్నం కుట్టుశిక్షణ కేంద్రం నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న సమయంలో అదే బస్తీకి చెందిన ఓ బాలుడు కారు నడుపుతూ ఆమెపైకి పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమయ్య బేగంను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన బయటకు పొక్కడంతో గురువారం అక్బర్‌ హిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. ప్రసార మాద్యమాలలో ఈ అంశం చక్కర్లు కొట్టింది. కారు నడిపిన విధానం, ప్రమాదం జరిగిన తీరు సీసీ ఫుటేజీ ద్వారా చూసిన వారికి, ఇది కావాలని చేసిన ప్రమాదమనే అనిపించించింది.

*గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధు డు మృతి చెందిన సంఘటన కందిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. సంగారెడ్డి రూరల్‌ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామంలోని పాత కందికి చెందిన చాకలి పండరి(65) గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కంది చౌరస్తా వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పండరికి తలపగిలి తీవ్ర రక్తస్రావం జరిగి ఘటనాస్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

*బాసర ట్రిపుల్‌ ఐటీలో బీటెక్‌ తృతీయసంవత్సరం చదువుతున్న మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన సిమ్మ మహేశ్‌ (22) గురువారం తెల్లవారుజామున ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మూడురోజులక్రితంమహేశ్‌ వీరన్నపేటకు వచ్చాడు. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం గదిలో నిద్రించాడు. ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పరిశీలించగా మృతి చెందినట్టు గుర్తించారు. అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.

*న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే.. లంచం డిమాండ్‌ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. కర్నూలు జిల్లా మద్దికెర పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ బదిలీపై వెళ్లడతో.. తుగ్గలి ఎస్‌ఐగా పని చేస్తున్న సమీర్‌బాషా వారం రోజులుగా ఆ స్టేషన్‌కు ఇన్‌ చార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో మద్దికెరకు చెందిన క్రాంతికుమార్‌, ప్రీతి జంట ప్రేమించుకుని ఇంట్లో నుంచి పారిపోయారు. అబ్బాయి తరఫు వారికి ఈ పెళ్లి ఇష్టంలేదు. దీంతో వారు పెద్ద మనుషులతో కలసి ఎస్‌ఐను కలవడానికి వెళ్లారు. అయితే, పెళ్లికొడుకు తరఫు వారిని ఒప్పిస్తానని.. అందుకు తనకు రూ.50వేలు ఇవ్వాలని ఎస్‌ఐ యువతి బంధువులను డిమాండ్‌ చేశారు. యువతి సమీప బంధువు, తుగ్గలి ఎంపీటీసీ రాజును మధ్యవర్తిగా పెట్టారు. చివరికి రూ.40వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో క్రాంతికుమార్‌, ప్రీతిలకు పెరవలి దేవాలయంలో వివాహం జరిపించారు. తనకు రూ.40 వేలు ఇవ్వాలని మధ్యవర్తిగా ఉన్న రాజుపై ఎస్‌ఐ సమీర్‌బాషా ఒత్తిడి తెచ్చాడు. అయితే, పెళ్లికుమార్తె తరఫు వారు కేవలం రూ.25వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తం ఇస్తామంటున్నారని ఎస్‌ఐతో చెప్పారు.

*వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. షెడ్యూల్డ్‌ తెగల కులానికి చెందిన రొడ్డా భవానీ (32) గురువారం మధ్యాహ్నం కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. వైసీపీ నేతల వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ లైన్‌మేన్‌గా పనిచేస్తున్న భవానీ భర్త భారతి వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉప్పలగుప్తం ఎంపీపీ దంగేటి అచ్యుతజానకి భర్త రాంబాబు, ఉప సర్పంచ్‌ చీకురుమెల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ, సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ భర్త వరసాల సత్యనారాయణలు.. భవానీని బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధింపులకు గురి చేశారు. వైసీపీ నేతలతోపాటు డీఎల్పీవో విక్టర్‌ కూడా వేధింపులకు గురిచేసినట్టు మృతురాలి భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

* నల్లగొండ పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పద్మా నగర్‌లో ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్లు మృతిచెందారు. పద్మానగర్‌కు చెందిన నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణి గురువారం రాత్రి తమ ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే వర్షాలకు శుక్రవారం తెల్లవారుజామున ఇంటిగోడ కూలిపోయింది. నిద్రిస్తున్న వారిపై బిరువపడింది. దీంతో తల్లీకూతుళ్లు నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు.

*వనపర్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లికుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీపనగండ్ల మండలం గోవర్ధన్గిరిలో ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో బావిలో దూకి తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తల్లి శశికళ(34), కుమారుడు అనిల్(7)గా పోలీసులు గుర్తించారు.

*ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వస్తున్న ఓ కారు నదిలో పడి 9 మంది మరణించారు.ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా రామ్‌నగర్ ప్రాంతంలో ఎర్టిగా కారు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కారులో 11మంది ప్రయాణికులు ఉండగా, వారిలో ఓ చిన్నారిని పోలీసులు రక్షించారు.సంఘటన స్థలానికి ఉత్తరాఖండ్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. మృతులంతా పంజాబ్‌కు చెందిన వారేనని పోలీసులు చెప్పారు.కారులో 11 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. 9 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

*నల్గొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం (Rain) కురుస్తోంది. దీంతో పద్మానగర్‌లోని ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం చెందారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా మీద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)గా గుర్తించారు. ఇటీవలే కళ్యాణికి వివాహం జరిగింది. ఆ కుటుంబం కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలం టి.రంగంపేట ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు తిరుపతి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

*తుగ్గలి ఎస్సై (SI) సమీర్ బాషను వీఆర్‌కు పంపిస్తూ ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రేమ జంటకు వివాహం చేసే విషయంలో మధ్యవర్తి రాజు ద్వారా ఎస్సై సమీర్ రూ.40 వేలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాను లంచం డిమాండ్ చేయలేదని.. ఏబీఎన్‌లో ఎస్సై సమీర్ బాషపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అమ్మాయి కుటుంబ సభ్యులతో ఎస్సై చెప్పించాడు. అమ్మాయి కుటుంబ సభ్యులతో చెప్పించిన వీడియోలను జిల్లా పోలీసు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి పోలీసు అధికారులను నమ్మించి, ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన ఎస్పీ… పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

*అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని ముదిగల్లు సమీపంలో ఎలుగుబంటి
అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతి చెందిన ఎలుగుబంటిని పరిశీలించారు.