Movies

ఏడు రూపాలు

ఏడు రూపాలు

 హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న కంగనా రానౌత్ కొత్త సినిమా ‘థాకడ్ టీజర్’ విడుదలైంది దీనిలో కంగన చేసిన పోరాటాలు శరీరం గగుర్పొడి చేలా ఉన్నాయి. ఏజెంట్ అగ్ని అనే గూఢచారి పాత్రలో ఏడు భిన్న రూపాలతో కనిపిస్తుందట. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల్లో నటించే హీరో యిన్లు తక్కువగా ఉన్నారు. ఆ అవకాశం నాకు రావడం అదృష్టం. పక్కా కమర్షియల్ యాక్షన్ చిత్రాన్ని ఒక హీరోయిన్తో తీయడానికి నిర్మాతలు ధైర్యం చేశారు. ఈ విషయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది” అని చెప్పింది. ప్రస్తుతం కంగన చేతినిండా సినిమాలే ఉన్నాయి.